Sunday, October 6, 2024
Homeహెల్త్Onions: ఉల్లిపాయతో ఇలా చేస్తే ఎంత హాయో

Onions: ఉల్లిపాయతో ఇలా చేస్తే ఎంత హాయో

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇక ఉల్లిపాయ వేసిన వంటకాల రుచయితే చెప్పనక్కర్లేదు. నిత్యం మనం ఎదుర్కొనే రక రకాల అనారోగ్య సమస్యలకు ఉల్లిపాయ వంటింటి వైద్యమంటున్నారు డైట్ నిపుణులు, వైద్యులు. ఏడువేల నరాలు ఉన్న పాదం కిందిభాగంలో ఉల్లిపాయముక్కను పెట్టుకుని పడుకుంటే శరీరానికి ఎంతో మంచిదని చెపుతున్నారు. రాత్రి పడుకోబోయే ముందు పాదం కింది భాగంలో ఉల్లిపాయను పెట్టుకోవడం వల్ల మనం నిద్రలో ఉన్నప్పుడు అది శరీరాన్నంతా శుభ్రంచేసేస్తుందిట.

- Advertisement -

శరీరంలోని సూక్ష్మజీవులను, బాక్టీరియాను పీల్చేసుకుంటుందిట. అరికాలు దగ్గర చర్మం సున్నితంగా ఉండడంతో గుడ్ బాక్టీరియా, ఆరోగ్యకరమైన రసాయనాలు రక్తంలో వేగంగా కలిసిపోతాయిట. అలా రక్తాన్ని కూడా ఉల్లిపాయ శుభ్రంచేస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు పాదాలకు వేసుకునే తొడుగులో ఉల్లిపాయను ఉంచుకుంటే జలుబు తొందరగా తగ్గిపోతుంది. శరీరానికి సాంత్వననిచ్చే సుగుణాలు ఎన్నో ఉల్లిపాయలో ఉండడం వల్లే పలు ఆరోగ్య సమస్యలకు అది మందులా పనిచేస్తుంది.

ఉల్లిపాయలు దుర్వాసనను పోగొట్టడమే కాదు చుట్టూరా ఉన్న గాలిని సైతం పరిశుభ్రం చేస్తాయి. జలుబే కాదు బ్లాడర్ ఇన్ ఫెక్షన్లపై, చెవిపోటు, పంటి పోటు వంటి సమస్యలపై సైతం ఉల్లిపాయ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. శరీర బాధల నివారణకు రసాయనాలతో పండిచిన ఉల్లిపాయలు కాకుండా ఆర్గానిక్ ఉల్లిపాయను వాడితే మంచిది.

ఉల్లిపాయలో దాగున్న వైద్యపరమైన సుగుణాలను ద్రుష్టిలో పెట్టుకుని డాక్టర్లు సైతం రాత్రి పడుకోబోయేముందు సగం తరిగిన ఉల్లిపాయ చెక్కను అరికాలులో పెట్టుకోమని సూచిస్తున్నారు. పొద్దున్న లేచిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కను పాదాలకు స్క్రబ్ గా కూడా వాడచ్చంటున్నారు . మరి ఉల్లిపాయా…మజాకానా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News