Friday, January 17, 2025
Homeహెల్త్Parkinson's disease: పార్కి­న్సన్స్​‍ వ్యాధికి శాశ్వత పరి­ష్కారం

Parkinson’s disease: పార్కి­న్సన్స్​‍ వ్యాధికి శాశ్వత పరి­ష్కారం

ఒత్తిడిని దూరంగా ఉంచండి

పార్కి­న్సన్స్​‍ వ్యాధి, దీని పేరు చెబి­తేనే చాలా కుటుం­బాలు భయంతో వణి­కి­పో­తాయి. ఎందు­కంటే, అప్పటికే తమ కుటుం­బాల్లో ఎవరో ఒకరు లేదా అంత­కంటే ఎక్కువ మంది చేతులు వణు­కుతూ, అడుగులు సరిగా పడక ఇబ్బంది పడు­తు­న్న­వా­రిని చూస్తూనే ఉంటారు. సాధా­ర­ణంగా కాస్త పెద్ద వయసులో వచ్చే ఈ సమస్య, ఇటీ­వల చిన్న వయ­సు­లోనూ కొంద­రికి వస్తోంది.

- Advertisement -

మొదట్లో చిన్నగా వేళ్లు

ఈ వ్యాధి వచ్చి­న­వా­రికి మొదట్లో వేళ్లు వాటం­తట అవే కొంత కదు­లు­తుం­టాయి. తర్వాత క్రమంగా చెయ్యి మొత్తం వణు­కుతూ ఉంటుంది. చేత్తో కనీసం పెన్ను పట్టు­కుని సరిగా రాయ­లేరు. గ్లాసు చేత్తో పట్టు­కుని మంచి­నీళ్లు గానీ, టీ కాఫీలు గానీ తాగ­లేరు. అన్నం తినడం కూడా చాలా కష్టం అవు­తుంది. అన్నిం­టికీ పక్కన ఎవరో ఒకరు సాయం చేయా­ల్సిందే. పోనీ ఇదేదో కొన్నాళ్లు ఉండి మందులు వాడి­తేనే, మరే­దైనా చికిత్స తీసు­కుం­టేనో తగ్గి­పో­తుం­దని అను­కుంటే ఇన్నా­ళ్లుగా అలాంటి ఆశ దాదాపు లేదు. డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యు­లే­షన్‌ లాంటి శస్త్ర­చి­కి­త్సలు ఉన్నా వాటితో వచ్చే సమ­స్యలు ఎలా ఉంటా­యో­నన్న భయం, అసలే మెద­డుకు శస్త్ర­చి­కిత్స కావ­డంతో చాలా­మంది భయ­పడి, వయ­సు­రీత్యా కుద­ర­దని భావించి ఆగి­పో­తున్నారు. వారిలో కొందరు కేరళ, కర్ణా­టక లాంటి రాష్ట్రా­లకు వెళ్లి అక్కడ ఆయు­ర్వేద చికి­త్సలు కూడా తీసుకుం­టు­న్నారు. వాటి వల్ల కొంత ప్రయో­జనం ఉంటుం­దని భావి­స్తున్నా, ఎంత­వ­రకు ఉంటుం­ద­నేది మాత్రం అను­మా­నమే. దాంతో బతి­కు­న్న­న్నాళ్లూ బాధలు భరిం­చా­ల్సిం­దే­నన్న కుంగు­బాటు కూడా పార్కి­న్సన్స్​‍ వ్యాధి బాధి­తుల్లో ఎక్కువ అవు­తోంది. అయితే, వైద్య­రం­గంలో ఎప్ప­టి­క­ప్పుడు సరి­కొత్త సాంకే­తి­కత అభి­వృద్ధి చెందు­తూనే ఉంది. దాని­వల్ల ప్రతి సమ­స్యకూ ఓ సమ­ర్థ­వం­త­మైన పరి­ష్కారం లభిం­డానికి అవ­కా­శాలు ఎప్ప­టి­క­ప్పుడు వస్తు­న్నాయి.

ఎంఆ­ర్‌­జీ­ఎ­ఫ్‌­యూ­ఎస్
పార్కి­న్సన్స్​‍ వ్యాధి బాధి­తులు అంద­రికీ ఇప్పుడు వస్తున్న సరి­కొత్త చికిత్సా పద్ధతి అయిన ఎంఆ­ర్‌­జీ­ఎ­ఫ్‌­యూ­ఎస్ ఒక అద్భు­త­మైన పరి­ష్కా­రంగా కన­ప­డు­తోంది. మాగ్నె­టిక్‌ రిజొ­నెన్స్​‍ గైడెడ్‌ ఫోకస్డ్‍ అల్ట్రా సౌండ్‌ – ఎంఆ­ర్‌­జీ­ఎ­ఫ్‌­యూ­ఎస్ అనే ఈ యంత్రం.. పార్కి­న్సన్స్​‍ వ్యాధి వల్ల వచ్చే వణు­కును వెంటనే తగ్గి­స్తుంది. ఏదో ఒక మంత్రం వేసి­న­ట్లుగా అప్ప­టి­వ­రకు తీవ్రంగా ఉన్న వణుకు కాస్తా.. ఈ యంత్రం మీద చికిత్స తీసు­కున్న తర్వాత ఐదారు నిమి­షా­ల్లోనే పూర్తిగా ఆగి­పో­తోంది. ఇప్ప­టికే ప్రపం­చ­వ్యా­ప్తంగా పలు దేశాల్లో క్లిని­కల్‌ ట్రయల్స్​‍ పూర్తయ్యి, ఇప్పుడు పూర్తి­స్థా­యిలో ఆస్ప­త్రు­లలో అందు­బా­టు­లోకి వచ్చింది.
ప్రధాన కార­ణాలు.

  • ఒత్తి­డితో కూడిన జీవ­న­శైలి
  • వయస్సు పై బడటం
  • వంశ­పా­రం­పర్యం
  • మెద­డుకు దెబ్బ తగ­లడం
  • మెదడు ఇన్‌­ఫె­క్ష­న్లకు గురి­కా­వడం
  • ప్రమా­ద­వ­శాత్తు తలకు గాయాలు కావడం
  • ప్రమా­దాల్లో మెద­డుకు రక్త ప్రవాహం తగ్గడం
  • మద్య­పానం లాంటి దుర­ల­వాట్లు

కిమ్స్​‍ ఆస్ప­త్రిలో అత్యా­ధు­నిక చికిత్స
పార్కి­న్సన్స్​‍ వ్యాధితో బాధ­పడే చాలా­మంది తమ జీవన నాణ్యత గురించే ఇబ్బంది పడు­తుం­టారు. ప్రతి చిన్న విష­యా­నికీ ఎవరో ఒక­రి­మీద ఆధా­ర­ప­డాల్సి ఉంటుం­దని, చివ­రకు మూత్ర విస­ర్జన సమ­యంలో కూడా ఇబ్బంది అవు­తుం­దని మాన­సి­కంగా నలి­గి­పో­తుం­టారు. ఏ వయ­సులో ఉన్నా కూడా పార్కి­న్సన్స్​‍ వ్యాధి వల్ల వచ్చే వణు­కును పూర్తిగా తగ్గిం­చ­డా­నికి ఎంఆ­ర్‌­జీ­ఎ­ఫ్‌­యూ­ఎస్ యంత్రాన్ని తాజాగా సికిం­ద్రా­బా­ద్‌­లోని కిమ్స్​‍ ఆస్ప­త్రిలో ప్రవే­శ­పె­ట్టారు. ఇప్ప­టికే మెదడు సంబం­ధిత సమ­స్య­లకు అత్యు­న్నత స్థాయి చికి­త్సలు అంది­స్తున్న ఈ ఆస్ప­త్రిలో ఎప్ప­టి­క­ప్పుడు వైద్య­ప­రంగా వస్తున్న సాంకే­తిక పరి­జ్ఞా­నాన్ని అంది­పు­చ్చు­కుని ముంద­డుగు వేస్తు­న్నారు. అందులో భాగం­గానే ఎంఆ­ర్‌­జీ­ఎ­ఫ్‌­యూ­ఎస్ యంత్రాన్ని తెప్పించి, దాంతో పార్కి­న్సన్స్​‍ రోగు­లకు చికిత్స అంది­స్తు­న్నారు. మందు­లకు నయం కాకుండా, శస్త్ర­చి­కిత్స చేయిం­చు­కునే పరి­స్థితి లేన­ప్పుడు ఇది ఒక అద్భు­త­మైన పరి­ష్కా­రంగా కని­పి­స్తోంది. ఇత­రత్రా వ్యాధులు ఏమీ లేకుండా.. కేవలం ఈ సమ­స్యతో ఇబ్బంది పడు­తున్న చాలా­మం­దికి ఇది కచ్చి­తంగా సరి­పో­తుంది. పైగా.. అత్యంత కచ్చి­త­త్వంతో, సమస్య ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే చికిత్స చేసే విధానం ఇందులో ఉండ­డంతో రోగి భద్రత గురించి ఏమాత్రం ఆందో­ళన చెందా­ల్సిన అవ­సరం లేనే లేదు. సాంకే­తిక పరి­జ్ఞానం వైద్య­చి­కి­త్సల తీరు­తె­న్ను­లను గణ­నీ­యంగా మార్చే­సింది. దీని­వల్ల వైద్య నిపు­ణుల సామ­ర్థ్యా­నికి ఈ యంత్రాల కచ్చి­తత్వం తోడ­వ్వ­డంతో ప్రపం­చ­వ్యా­ప్తంగా కొన్ని కోట్ల మంది పార్కి­న్సన్స్​‍ బాధి­తు­లకు ఈ అత్యా­ధు­నిక వైద్య పరి­జ్ఞా­నంతో ఊరట కలు­గు­తుంది. రోగలు సంర­క్ష­ణలో ఇదో విప్ల­వా­త్మ­క­మైన ముంద­డు­గుగా వైద్య నిపు­ణులు భావి­స్తు­న్నారు. ఇందులో ఎక్కడా కోతలు పెట్టా­ల్సిన అవ­సరం లేదు. మత్తు­మందు ఇవ్వ­క్క­ర్లేదు, అలాగే చివ­రకు ఆస్ప­త్రిలో చేరా­ల్సిన అవ­సరం కూడా ఉండదు. కేవలం ఓపీ పద్ధ­తి­లోనే వచ్చి ఈ చికిత్స తీసు­కుని, వణు­కులు తగ్గిం­చు­కుని వెళ్లి­పో­వచ్చు.


పార్కి­న్సన్స్​‍ వచ్చి­నట్లు గుర్తిం­చడం ఎలా?
పార్కి­న్సన్స్​‍ వ్యాధి వచ్చి­నట్లు దాని లక్ష­ణా­లను బట్టి సుల­భంగా గుర్తిం­చ­వచ్చు. బాధి­తులు ఆ విష­యాన్ని తెలు­సు­కో­లే­క­పో­యినా,చుట్టు­ప­క్కల ఉన్న­వా­ళ్లకు స్పష్టంగా తెలు­స్తుంది. ఆ లక్ష­ణాలు ఇలా..

  • వణుకు
  • మాట తడ­బ­డడం
  • మింగ­డంలో ఇబ్బంది
  • వాసన కోల్పో­వడం
  • నడక తగ్గి­పో­వడం
  • ఒక­వైపు చెయ్యి వణ­కడం
  • కద­లి­కలు నెమ్మ­దిం­చడం
  • కండ­రాలు బిగు­సు­కు­పో­వడం
  • ఒకరి సహాయం లేకుండా నడ­వ­లే­క­పో­వడం
  • చేతులు, కాళ్లు బిగు­సు­కు­ఓయి నడ­వడం కష్టం కావడం

ప్రపంచ పార్కి­న్సన్స్​‍ రాజ­ధాని భారత్‌?
మన దేశం­లోని ప్రతి లక్ష మంది ప్రజల్లో 15 నుంచి 43 మంది పార్కి­న్సన్స్​‍ వ్యాధితో బాధ­ప­డు­తు­న్నారు. ప్రపం­చంలో ఇతర దేశా­ల­న్నింటి కంటే మన దేశం­లోనే ఈ సమస్య ఎక్కు­వగా ఉంది. గతంలో ఇది 50-60 ఏళ్లు దాటి­న­వా­రి­లోనే ఎక్కు­వగా కని­పిం­చేది. కానీ ఇప్పుడు దాదాపు మన దేశం­లోని మొత్తం పార్కి­న్సన్స్​‍ రోగుల్లో 40-45% మందికి 22 నుంచి 49 సంవ­త్స­రాల లోపే ఈ వ్యాధి లక్ష­ణాలు మొద­ల­వు­తు­న్నాయి.
పార్కి­న్సన్స్​‍ వ్యాధి అనేది.. క్రమంగా పెరు­గుతూ ఉండే న్యూరో డీజ­న­రే­టివ్‌ డిజా­ర్డర్‌. ముఖ్య­మైన మెద­డు­లోని డోప­మైన్‌ లోపం మన శరీ­రం­లోని కద­లి­క­లను ప్రభా­వితం చేస్తుంది. ఇన్నా­ళ్లుగా దీన్ని కేవలం వృద్ధు­లకు మాత్రమే వచ్చే సమ­స్యగా భావిం­చే­వారు. కానీ, ఇటీ­వలి కాలంలో యువత కూడా దీని బారిన పడు­తు­న్నారు. నిజా­నికి దీని లక్ష­ణాలు కొద్ది­కొ­ద్దిగా అయినా 50 సంవ­త్స­రాల లోపే కని­పి­స్తాయి. కానీ, చాలా­మంది వాటిని పట్టిం­చు­కో­క­పో­వ­డమో.. లేదా వేడి­చే­యడం వల్ల వచ్చిం­దని అను­కో­వ­డమో జరు­గు­తుంది. భార­త­దే­శంలో ఈ వ్యాధి ప్రారం­భ­మయ్యే సగటు వయసు 51.03 11.32 సంవ­త్స­రాలు. ప్రపంచ సగ­టుతో పోలిస్తే ఇది ఒక దశాబ్దం తక్కువ! ప్రపం­చ­వ్యా­ప్తంగా చూసినా, మన దేశంలో చూసు­కున్నా కూడా.. మహి­ళల కంటే పురు­షులే ఎక్కు­వగా ఈ వ్యాధి బారిన పడు­తు­న్నారు.
మెదడు వయసు పెరి­గే­కొద్దీ
శరీ­రంలో మెదడు చాలా కీలకం. ఇందులో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర అనా­రోగ్యం వస్తుంది. మన మెదడు వయసు పెరిగే కొద్దీ దెబ్బ­తిం­టుంది. దీని­వల్ల జ్ఞాప­క­శక్తి, ఆలో­చనా సామర్థ్యం తగ్గు­తుంది. ఇలాంటి సమ­స్యలే పార్కి­న్సన్స్​‍ వ్యాధు­లకు దారి­తీ­స్తాయి. పార్కి­న్సన్‌ అనేది మెద­డుకు సంబం­ధిం­చిన సమస్య. మెద­డులో మని­షిని నడి­పేం­దుకు సహాయం చేసే డొప­మైన్‌ అనే హార్మోన్‌ తక్కువ మోతా­దులో విడు­దల అయి­న­ప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా డొప­మైన్‌, ఎపి­నె­ప్రిన్‌ లాంటి హార్మోన్లు నాడీ కణాల మధ్య సమా­చారం ప్రసారం కావ­టా­నికి తోడ్ప­డ­తాయి. సామా­న్యంగా ఈ సమస్య పెద్ద­వ­యస్సు (50-60 ఏళ్లు) గల­వా­రిలో వస్తుంది. పార్కి­న్సన్స్​‍ సమస్య మహి­ళల కంటే పురు­షుల్లో ఎక్కు­వగా వచ్చే అవ­కాశం ఉంటుంది. కుటుం­బంలో ఎవ­రైనా పార్కి­న్సన్స్​‍ బాధి­తు­లుంటే వంశ­పా­రం­ప­ర్యంగా ఇత­రు­లకు కూడా చిన్న వయ­సు­లోనే ఈ వ్యాధి వచ్చే అవ­కాశం ఉంటుంది.
మన చుట్టూ ఉన్న వాతా­వ­రణం ఇప్ప­టికే కలు­షితం అయి­పో­యింది. దాంతో­పాటు.. మనం తింటున్న ఆహారం కూడా విప­రీ­తంగా క్రిమి­సం­హా­రక మందు­లను ఉప­యో­గించి పండి­స్తు­న్నారు. ఇలాం­టివి తీసు­కో­వడం వల్ల, కాలు­ష్యా­నికి గురి­కా­వడం వల్ల కూడా మెద­డులో మెద­డులో డోప­మైన్‌ రసా­యనం ఉత్పత్తి చేసే నరాలు క్రమంగా దెబ్బ­తిం­టాయి. ఇలాంటి కార­ణాల వల్లే మన దేశంలో 30 ఏళ్ల­లో­పు­వా­రికి కూడా పార్కి­న్సన్స్​‍ వ్యాధి వస్తోంది. సాధా­ర­ణంగా ఒక­వైపు చెయ్యి, కాళ్లు తొలుత దీని­వల్ల ప్రభా­వితం అవు­తాయి. తర్వాత కొంత కాలా­నికి రెండు­వై­పులా చేతులు, కాళ్లు వణు­కు­తుం­టాయి, కాళ్ల అడు­గులు సరిగా పడవు.
పార్కి­న్సన్స్​‍ వ్యాధి నిర్ధా­రణ
రోగి గత చరిత్ర, వాళ్ల కుటుంబ చరిత్ర, 18 ఎఫ్‌ ఫ్లురో­డోపా, పెట్‌ టెస్ట్‍, శారీ­రక పరీ­క్షలు చేసిన తర్వాత ఈ వ్యాధిని నిర్ధా­రి­స్తారు. సీటీ స్కాన్‌ ఎంఆ­ర్‌ఐ లాంటి ఇమే­జింగ్‌ పరీ­క్షల ద్వారా మెద­డులో ఏమైనా గడ్డలు ఉన్నాయా, సాధా­రణ ఒత్తిడి హైడ్రో­సె­ఫా­లస్ లేదా వాస్కు­లర్‌ పార్కి­న్సో­నిజం లాంటి మెదడు సంబంధ సమ­స్యలు ఉన్నాయా అన్న విష­యాన్ని గుర్తించి, తద్వారా ఈ సమ­స్యను నిర్ధా­రిం­చ­వచ్చు.
నివా­రణ చర్యలు
ఏ వ్యాధి అయినా రాక­ముందే కొంత జాగ్రత్త పడడం మంచిది. వచ్చిన తర్వాత చికిత్స అవ­కా­శాలు ఎటూ చూసు­కుంటాం. ముందుగా కొన్ని జాగ్ర­త్తలు తీసు­కుంటే దీని తీవ్రత తగ్గే అవ­కాశం ఉంటుంది, లేదా వ్యాధి రాకుండా కూడా నివా­రిం­చ­వచ్చు.
పోష­కాలు ఎక్కు­వగా ఉండే (యాంటీ ఆక్సి­డెంట్లు, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్​‍) ఆహా­రాలు తీసు­కో­వడం
వాకింగ్‌, స్విమ్మింగ్‌ లాంటి ఏరో­బిక్‌ వర్కౌట్స్​‍ చేయడం
తగి­నంత సేపు బాగా నిద్ర­పో­వడం
అన­వ­స­ర­మైన ఆలో­చ­నలు మాను­కో­వడం, ఒత్తి­డిలో ఉంటే మెద­డుకు హాని కలు­గు­తుంది కాబట్టి యోగా, ధ్యానం లాంటివి చేయడం, వాహ­నాలు నడు­పు­తు­న్న­ప్పుడు తప్ప­ని­స­రిగా హెల్మ్‍ట్‌, సీటు బెల్టు ధరిం­చడం. పురు­గు­మం­దుల ప్రభా­వా­నికి గురి­కా­కుండా ఉండడం, కాచిన వంట నూనె­లను పదే పదే మళ్లీ వాడ­కూ­డదు. పసు­పులో యాంటీ­సె­ప్టిక్‌, కర్కు­మిన్‌ అనే పోష­కాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వంట­కాల్లో పసుపు వాడడం మంచిది. శారీ­రక వ్యాయామం, నడ­వడం, ఫిజి­యో­థె­రపీ వల్ల కీళ్లు బాగుం­టాయి. దాని­వల్ల వ్యాధితో కలిగే దుష్ప్ర­భా­వాల నుంచి కొంత వరకు కోలు­కునే అవ­కాశం ఉంటుంది.

ఈ చికిత్సతో వణుకును తగ్గిస్తాం
మాగ్నె­టిక్‌ రిజొ­నెన్స్​‍ గైడెడ్‌, ఫోకస్డ్‍ అల్ట్రా సౌండ్‌.. ఎంఆ­ర్‌­జీ­ఫస్ అనే ఈ యంత్రాన్ని కిమ్స్​‍ ఆస్ప­త్రిలో ప్రవే­శ­పె­ట్టి­నట్లు సగ­ర్వంగా ప్రక­టి­స్తున్నాం. పార్కి­న్సన్స్​‍ వ్యాధి వల్ల వచ్చే వణు­కును పూర్తిగా తగ్గిం­చ­డంలో ఇది ఒక విప్ల­వా­త్మ­క­మైన టెక్నా­లజీ. ఇది చిన్న కోత కూడా లేకుం­డానే మెద­డులో ఉన్న సమ­స్య­లను పూర్తిగా తగ్గి­స్తుంది. ఈ అత్యా­ధు­నిక టెక్నా­లజీ చికి­త్సలో అత్యంత కచ్చి­తత్వం సాధి­స్తుంది. తద్వారా రోగు­లకు అత్యంత సుర­క్షి­త­మైన, అత్య­ద్భు­త­మైన ఫలి­తాలు అంది­స్తుంది. కృష్ణా ఇన్‌­స్టి­ట్యూట్‌ ఆఫ్‌ మెడి­కల్‌ సైన్సెస్ – కిమ్స్​‍ ఆస్పత్రి రోగు­లకు వీలై­నంత తక్కువ ధరలో, అత్యంత నాణ్య­మైన చికి­త్సలు అందించే విష­యంలో ఎప్పుడూ ముందం­జలో ఉంటుంది. ఇప్పుడు మేం తెలు­గు­రా­ష్ట్రా­ల్లోనే తొలి­సా­రిగా ఈ యంత్రాన్ని తీసు­కొచ్చాం. ఇది అన్ని­ర­కాల వణుకు సమ­స్య­లను.. ముఖ్యంగా పార్కి­న్సన్స్​‍ వ్యాధి వల్ల వచ్చే వణు­కును పూర్తిగా తగ్గి­స్తుంది. మా ఆస్ప­త్రి­లోని నిపు­ణు­లైన సీని­యర్‌ వైద్యుల పర్య­వే­క్ష­ణలో ఈ మిషన్‌ మీద చేసే చికిత్స ఐదు నిమి­షాల్లో పూర్త­వు­తుంది. బయ­టకు వచ్చిన తర్వాత వెంటనే మార్పు గమ­నిం­చు­కో­వచ్చు. అంటే, చేతుల్లో ఉన్న వణుకు వెంటనే ఆగి­పో­తుంది. సాధా­ర­ణంగా ఒక­వైపు వణు­కుకు ఒక­సారి చికిత్స చేస్తారు. రెండు­వై­పులా ఉంటే కొంత­కాలం ఆగిన తర్వాత చేస్తారు. ఏది ఏమైనా.. పార్కి­న్సన్స్​‍ వ్యాధి చికి­త్సలో ఇది ఒక కొత్త పెను సంచ­లనం అని మాత్రం సగ­ర్వంగా చెప్ప­గ­లను.
– డాక్టర్‌ బొల్లి­నేని భాస్క­ర­రావు, సీని­యర్‌ కన్స­ల్టెంట్‌
కార్డి­యో­థొ­రా­సిక్‌, వాస్క్యు­లర్‌ సర్జన్‌, ఛైర్మన్‌,
మేనే­జింగ్‌ డైరె­క్టర్‌, కిమ్స్​‍ ఆస్పత్రి

పార్కి­న్సన్స్​‍ బాధి­తు­లకు కొత్త జీవితం అంది­స్తున్నాం
కృష్ణ మహ­దేవ్‌ ఇక్క­డకు వచ్చి­న­ప్పుడు ఆయన చేతులు ఆయన స్వాధీ­నంలో ఉండేవి కావు. ఆయన వయసు కేవలం 27 సంవ­త్స­రాలే. ఇంకా చాలా మంచి భవి­ష్యత్తు ఉంది. సాధా­ర­ణంగా పార్కి­న్సన్స్​‍ వ్యాధి కాస్త పెద్ద వయ­సులో వస్తుంది. కానీ అరు­దుగా ఇలా చిన్న­వా­ళ్లకు కూడా రావచ్చు. కృష్ణకు మేం ఆస్ప­త్రిలో కొత్తగా ప్రవే­శ­పె­ట్టిన ఎంఆ­ర్‌­జీ­ఎ­ఫ్‌­యూ­ఎస్ చికిత్స అందించాం. ఆ తర్వాత అత­డికి చక్కగా నయ­మైంది. ఇప్పుడు కాగితం మీద తన పేరు తాను రాసు­కు­న్నాడు. అది చూసి ఎంత­గానో సంతో­షిం­చాడు. మళ్లీ పిల్ల­లకు పాఠాలు చెప్ప­గ­ల­నని, బోర్డు­మీద లెక్కలు రాయ­గ­ల­నని విశ్వాసం వ్యక్తం చేశాడు. కిమ్స్​‍ ఆస్ప­త్రిలో ఎప్ప­టి­క­ప్పుడు సరి­కొత్త సాంకే­తిక పరి­జ్ఞా­నాన్ని అంది­పు­చ్చు­కుని రోగు­లకు సంపూర్ణ స్వస్థత చేకూర్చే ప్రయ త్నం చేస్తున్నాం. ఇన్నాళ్లూ పార్కి­న్సన్స్​‍ వ్యాధికి సరైన చికిత్స లేదు. డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యు­లే­షన్‌ ఉన్నా, అందరూ దానికి సుము­ఖత చూపే­వారు కారు. దాంతో ఈ వ్యాధి బాగా ఇ బ్బంది పెట్టేది. ఇప్పుడు వచ్చిన ఈ అత్యా­ధు­నిక చికి­త్సతో పార్కి­న్సన్స్​‍ రోగు­లకు ఒక సరి­కొత్త జీవితం లభి­స్తుం­దని కచ్చి­తంగా చెప్ప­గలం.

  • డాక్టర్‌ మానస్ కుమార్‌ పాణి­గ్రాహి, సీని­యర్‌ కన్స­ల్టెంట్‌ న్యూరో సర్జన్‌, న్యూరో­స­ర్జరీ విభా­గా­ధి­పతి, కిమ్స్​‍ ఆస్పత్రి

తక్ష­ణమే ఫలితం..
మెరు­గు­పడే జీవన నాణ్యత
ఎంఆ­ర్‌­జీ­ఎ­ఫ్‌­యూ­ఎస్ అనేది చాలా సుర­క్షి­త­మైన చికిత్స. ముఖ్యంగా పార్కి­న్సన్స్​‍ బాధి­తుల్లో చాలా­మంది డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యు­లే­షన్‌ శస్త్ర­చి­కిత్స చేయిం­చు­కో­వ­డా­నికి భయ­ప­డ­తారు. అలాం­టి­వా­రికి ఇది చాలా మంచి అవ­కాశం. ఇందులో ఎంఆ­ర్‌­ఐలో ఉండే కచ్చి­తత్వం, అల్ట్రా­సౌండ్‌ విధా­నంలో ఉండే చికిత్స పద్ధతి రెండూ కలిసి ఉంటాయి. దీని­వల్ల తక్ష­ణమే ఫలితం కని­పి­స్తుంది. ఈ చికిత్స చేసిన తర్వాత రోగి జీవన నాణ్యత గణ­నీ­యంగా మెరు­గు­ప­డు­తుంది. అంత­కు­ముందు వాళ్లు పడిన ఇబ్బం­దు­లేమీ ఇకపై ఉండవు. ఈ అత్యా­ధు­నిక సాంకే­తిక పరి­జ్ఞానం అనేది ముఖ్యంగా ఎసె­న్షి­యల్‌ ట్రెమర్స్​‍, పార్కి­న్సన్స్​‍ డిసీజ్‌ లాంటి వాటితో బాధ­ప­డు­తున్న అనే­క­మంది రోగు­లకు ఒక వరం లాంటి­దని చెప్పు­కో­వచ్చు.

  • డాక్టర్‌ ఎం.జయశ్రీ, కన్స­ల్టెంట్‌ న్యూరా­ల­జిస్ట్‍,
    కిమ్స్​‍ ఆస్పత్రి
  • చిన్న కోత కూడా అక్క­ర్లే­కుండా ఉప­శ­మనం
  • ఎంఆ­ర్‌­జీ­ఎ­ఫ్‌­యూ­ఎస్ చికి­త్సలో ఉండే ఒక మంచి లక్షణం.. ఇందులో అస్సలు చిన్న కోత కూడా పెట్టా­ల్సిన అవ­సరం ఉండనే ఉండదు. పైగా ఇది అత్యంత కచ్చి­త­త్వంతో చికిత్స అంది­స్తుంది. ఇది చేయిం­చు­కున్న తర్వాత రోగు­లకు అప్ప­టి­వ­రకు ఉన్న సమ­స్యలు చేత్తో తీసి­పా­రే­సి­నట్లు పోతాయి. ఇందులో కోత పెట్టా­ల్సిన అవ­సరం లేక­పో­వ­డంతో.. మత్తు కూడా ఇవ్వ­క్క­ర్లేదు. అందు­వల్ల మత్తు వల్ల వచ్చే దుష్ప్ర­భా­వాలు అస్సలు ఉండనే ఉండవు. చికిత్స అయిన తర్వాత రోగి ఎంచక్కా ఒకటి రెండు గంట­ల్లోనే ఇంటికి వెళ్లి­పో­వచ్చు.
  • డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ యాదా, కన్స­ల్టెంట్‌ న్యూరా­ల­జిస్ట్‍, కిమ్స్​‍ ఆస్పత్రి
    జీవితం మీద మళ్లీ నమ్మకం కుది­రింది
    నేను లెక్కల టీచ­ర్‌గా పని­చే­సే­వా­డిని. కానీ, కొవిడ్‌ తర్వాత కొంత కాలా­నికి నాకు చేతులు వణ­కడం మొద­లైంది. అది క్రమంగా బాగా ఎక్కు­వై­పో­యింది. నా చేతుల మీద నాకు పట్టు ఉండేది కాదు. చేత్తో బోర్డు మీద రాయ­గ­లి­గే­వా­డిని కాను. గ్లాసు పట్టు­కుని నీళ్లు తాగడం, చేత్తో ఆహారం తీసు­కో­వడం అన్నీ బాగా కష్టం అయి­పో­యేవి. అప్పుడే నాకు కిమ్స్​‍ ఆస్పత్రి గురించి, డాక్టర్‌ మానస్ కుమార్‌ పాణి­గ్రాహి గురించి తెలి­సింది. ఆయన ఇక్కడ ఇస్తున్న ఎంఆ­ర్‌­జీ­ఎ­ఫ్‌­యూ­ఎస్ గురించి కూడా తెలు­సు­కు­న్నాను. ఇక్క­డకు వచ్చాక నాకు చికిత్స చేశారు. ఇప్పుడు మీరే చూడండి.. అస్సలు నా చేతిలో వణుకు అన్నది లేదు. నేను కాగితం మీద ఎంచక్కా రాయ­గ­లు­గు­తు­న్నాను. నా జీవితం మీద మళ్లీ నాకు ఒక నమ్మకం కుది­రింది. అదంతా కిమ్స్​‍ ఆస్పత్రి పుణ్యమే.
  • దండే కృష్ణ మహ­దేవ్‌, 27 సంవ­త్స­రాల టీచర్‌, మహా­రాష్ట్ర

ఆయన సంతకం చేయడం చూసి మురి­సి­పోయాం
విజ­య­వా­డకు చెందిన మా భర్త బ్యాంకులో ఉద్యోగం చేసి పదవీ విర­మణ చేశారు. ఆయన వయసు ఇప్పుడు 76 సంవ­త్స­రాలు. రిటైర్‌ అయిన తర్వాత కొద్ది కాలం నుంచే ఆయ­నకు ఈ వ్యాధి మొద­లైంది. అప్ప­టి­నుంచి.. అంటే సుమారు 15 ఏళ్ల నుంచి కూడా ఆయన కనీసం తన పేరు కూడా సరిగా రాయ­లే­క­పో­తు­న్నారు. మంచి­నీళ్లు కూడా ఆయన సొంతంగా తాగ­లే­క­పో­తు­న్నారు. మనమే దగ్గ­రుండి తాగిం­చాలి. ఆయన తాగే ప్రయత్నం చేస్తే నీళ్లన్నీ కింద, లేదా ఆయన బట్టల మీద ఒలి­కి­పో­తాయి. అన్నం కూడా తిన­లే­క­పో­యే­వారు. దాంతో మేం ఇన్నాళ్లూ చాలా బాధ­పడ్డాం. ఈమ­ధ్యనే మేం విజ­య­వాడ నుంచి ఇక్క­డకు వచ్చాం. ఇక్కడ కిమ్స్​‍ ఆస్ప­త్రిలో ఈ సమ­స్యకు చికిత్స ఉందని తెలు­సు­కుని వెంటనే ఇక్క­డకు చేరు­కున్నాం. చికిత్స పూర్తయ్యి బయ­టకు రాగానే ముందుగా ఆయ­నతో కాగితం మీద సంతకం చేయిం­చారు. అది చూసి మేమంతా ఎంతో ఆనం­ద­పడ్డాం. 15 ఏళ్ల తర్వాత తొలి­సారి ఆయన తన చేత్తో తన పేరు రాసు­కో­గ­లి­గారు. అలాగే మంచి­నీళ్లు కూడా తనం­తట తానే గ్లాసులో పట్టు­కుని, తానే గ్లాసు చేత్తో పట్టు­కుని తాగారు. ఇప్పుడు కుడి­వైపు అంతా వణుకు ఆగి­పో­యింది. ఎడ­మ­వైపు కూడా ఉంది గానీ, దానికి మరో ఆరు నెలల తర్వాత చేస్తా­మం­టు­న్నారు. ఇప్పుడు వెళ్లి­పో­వ­చ్చని చెబు­తు­న్నారు. మా కుటుంబం మొత్తం ఆయన పరి­స్థితి చూసి ఎంతో బాధ­ప­డే­వాళ్లం. ఇప్పుడు ఆయన కోలు­కున్న తీరు­చూసి ఎంత­గానో సంతో­షి­స్తున్నాం. మా పిల్లలు కూడా ఇప్పుడు ఎంతో ఆనం­దంగా ఉన్నారు.

  • చికిత్స చేయిం­చు­కున్న వ్యక్తి భార్య, విజ­య­వాడ

మా నాన్న­గారు ఉంటే ఈ చికిత్స చేయిం­చే­వా­డిని
మా నాన్న­గారు దాదాపు 14 సంవ­త్స­రాల పాటు పార్కి­న్సన్స్​‍ వ్యాధితో బాధ­పడి, తర్వాత మర­ణిం­చారు. ఆయన బీఎ­స్­ఎ­న్‌­ఎ­ల్‌లో పని­చే­సే­వారు. సర్వీసు దాదాపు చివ­రి­ద­శకు వచ్చిం­ద­నగా ఆయ­నకు ఆ సమస్య మొద­లైంది. మొదట్లో కొంత­మంది న్యూరా­ల­జి­స్టు­లకు చూపించాం. వాళ్లేవో మందులు ఇచ్చారు. వాటి వల్ల పెద్దగా ప్రయో­జనం కని­పిం­చ­లేదు. తర్వాత ఎవరో చెప్పా­రని కర్ణా­ట­కలో ఆయు­ర్వేదం మందు ఇస్తు­న్నా­రంటే అక్క­డకు కూడా తీసు­కెళ్లాం. అది వేసు­కున్న కూడా ఆయ­నకు వచ్చిన సమస్య తగ్గ­లేదు. అప్ప­టికి మొదట్లో డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యు­లే­షన్‌ గురించి తెలి­యదు. తెలి­సే­స­రికే ఆయ­నకు 70 ఏళ్ల వయసు వచ్చే­సింది. ఆ వయ­సులో చేయడం అంత మంచిది కాదని కొందరు చెప్ప­డంతో ఆగి­పోయాం. నిజా­నికి ఎంఆ­ర్‌­జీ­ఎ­ఫ్‌­యూ­ఎస్ లాంటి చికి­త్సలు అప్పట్లో లేవు. ఇప్పు­డి­ప్పుడే దాని గురించి తెలు­స్తోంది. అప్పట్లో మా నాన్న­గారు ఉన్న­ప్పుడే ఇవి ఉండి ఉంటే ఆయ­నకు చేయిం­చే­వా­డిని. అన్నాళ్ల పాటు ఆయన బాధ­ప­డాల్సి వచ్చేది కాదు. ఆల­స్యం­గా­నైనా ఈ సరి­కొత్త చికి­త్సలు రావడం సంతోషం.

  • రాఘ­వేంద్ర, సీని­యర్‌ జర్న­లిస్టు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News