ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్ వ్యాధి(Parkinson’s disease) రెండవ అత్యంత న్యూరోడీజెనరేటివ్ డిజార్డర్. సాధారణ భాషలో వణుకుడు వ్యాధి (షేకింగ్ డిసీజ్) అని అంటారు. ఈ వ్యాధి మెదడులో నాడీ కణాలు దెబ్బతినటం – క్షీణించటం కారణంగా వస్తుంది. భారతదేశంలో వివిధ అధ్యయనాల ప్రకారం ప్రతి లక్ష మంది జనాభాకు 15 నుండి 43 మందిలో ఈ పార్కిన్సన్స్ వ్యాధి ప్రాబల్యం ఉంది. పెరుగుతున్న ఆయుర్దాయం, వృద్ధాప్య జనాభాతో పార్కిన్సన్స్ వ్యాధి భారం మన దేశంలో ఎక్కువగా ఉంటుందని న్యూరో వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ “వణుకుడు” వ్యాధిని ముందుగా గుర్తించిన డాక్టర్. జేమ్స్ పార్కిన్సన్ పేరున ఈ వ్యాధికి “పార్కిన్సన్స్” వ్యాధిగా నామకరణం చేశారు. అంతేకాకుండా ఆయన పుట్టినరోజు అయిన ఏప్రిల్ 11న ప్రపంచ పార్కిన్సన్స్ డేగా జరుపుకుంటున్నారు.
ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం సందర్భంగా.. హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్, 25 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవం, వెయ్యి మందికి పైగా పార్కిన్సన్ రోగులు (దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా) DBS చేయడంలో అనుభవం కలిగిన, పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూవ్‌మెంట్ డిజార్డర్స్ రీసెర్చ్ సెంటర్ (PDMDRC) డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్, డాక్టర్. రూపమ్ బోర్గోహైన్, మాట్లాడుతూ… ఈ పార్కిన్సన్ వ్యాధి ప్రధానంగా మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే న్యూరాన్‌లను కోల్పోవడం మరియు ఇతర న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తి చేసే న్యూరాన్‌లను కోల్పోవడం వల్ల వస్తుందని తెలిపారు. పార్కిన్సన్ వ్యాధికి ఖచ్చితమైన కారణం తెలియదు కానీ, జన్యు మరియు పర్యావరణ కారకాల కారణంగా ఇది సంభవిస్తుందని అన్నారు.
విశ్రాంతి సమయంలో వణుకు, అన్ని కార్యకలాపాలలో మందగమనం, దృఢత్వం కోల్పోవడం, నడక కష్టం, ప్రసంగం మరియు చేతివ్రాత మార్పులు, మలబద్ధకం, వాసన కోల్పోవడం, మూత్ర విసర్జనలో ఆటంకాలు, బిపి, హెచ్చుతగ్గులు, జ్ఞాపకశక్తి ఆటంకాలు వంటివి పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు అని చెప్పారు. నేటికి పార్కిన్సన్స్ వ్యాధికి కచ్చితమైన చికిత్స లేదని… కానీ లక్షణాలను మెరుగుపరచడానికి, రోగుల జీవన నాణ్యతను ధృడపర్చడానికి అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS) అనేది పార్కిన్సన్స్ వ్యాధికి ఒక అత్యాధునిక శస్త్రచికిత్స అన్నార. పార్కిన్సన్స్ లక్షణాలు మందుల ద్వారా నియంత్రించబడని రోగులకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS) పార్కిన్సన్స్ వ్యాధికి అందుబాటులో ఉన్న అత్యంత ప్రభావవంతమైన శస్త్రచికిత్సలో ఒకటిగా ఆయన తెలిపారు.
పార్కిన్సన్స్ వ్యాధికి ఈ అత్యంత ప్రభావవంతమైన చికిత్స గురించి డాక్టర్. రూపం బోర్గోహైన్ వివరిస్తూ.. “డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్” అంటే మెదడులో ఒక చిన్న పరికరం (పల్స్ జనరేటర్)ను అమర్చడం, ఇది కదలికను నియంత్రించే మెదడులోని నిర్దిష్ట ప్రాంతాలకు విద్యుత్ ప్రేరణలను పంపుతుందన్నారు. ఈ ప్రేరణలు పార్కిన్సన్స్ వ్యాధి వల్ల కలిగే అసాధారణ మెదడు కార్యకలాపాలను నియంత్రించడంలో సహాయపడతాయని.. అలాగే మోటారు పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తాయని తెలిపారు. ముఖ్యంగా వణుకు, దృఢత్వం మరియు కదలిక మందగమనాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. రోగులు చలనశీలత, స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందేందుకు వీలు కల్పిస్తుందన్నారు. ఈ DBS, రోగి మందులపై ఎక్కువ ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుందన్నారు. దీర్ఘకాలిక ఔషధ వినియోగంతో సంబంధం ఉన్న దుష్ప్రభావాలను తగ్గిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఈ DBS, పార్కిన్సన్స్ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు.
యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్లు డాక్టర్. రుక్మిణి మృదుల, డాక్టర్. రాజేష్ అలుగోలు, డాక్టర్. శృతి కోలా, డాక్టర్. VVSRK ప్రసాద్‌లతో ప్రొఫెసర్, డాక్టర్. రూపం బోర్గోహైన్ బృందం 25 సంవత్సరాల పాటు విస్తృత అనుభవాన్ని కలిగి ఉంది. వేలాది మందికి పైగా పార్కిన్సన్స్ రోగులకు (దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా) DBS చేయడంలో విజయం సాధించారు. తన వ్యక్తిగత అనుభవంలో డాక్టర్. రూపం అనేక జీవితాలన్ని మార్చే ప్రతిస్పందనలను చూశారు. అతని రోగులు ఇప్పుడు ఈ ప్రక్రియకు రాయబారులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మరియు ఆయన బృందం దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలకు శిక్షణ ఇచ్చారు. తద్వారా ఈ చికిత్స చాలా మందికి ప్రయోజనం చేకూరుస్తుంది.

డాక్టర్. రూపమ్ బోర్గోహైన్,
సీనియర్ న్యూరాలజిస్ట్ & డైరెక్టర్ – పార్కిన్సన్స్ డిసీజ్ & మూవ్మెంట్ డిసార్డర్ రీసెర్చ్ సెంటర్ (PDMDRC),
యశోద హాస్పిటల్స్,
హైటెక్ సిటీ,
హైదరాబాద్.