Who should Not drink Green Tea: ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్యాంగా ఉండటానికి ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతారు. ఇది బరువు తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని తాగేవారు ఒక విధంగా ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణిస్తారు. అందుకే చాలా మంది తమ రోజును గ్రీన్ టీ తో స్టార్ట్ చేయడానికి ఇష్టపడతారు. కారణం గ్రీన్ టీలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అయితే, గ్రీన్ టీ తాగడం కొంతమందికి హాని కలిగించవచ్చు. చాలామంది ఇది ఆరోగ్యానికి మంచిదని తరచుగా తాగుతారు. అయితే, ఇప్పుడు గ్రీన్ టీ తాగడం ఎవరు తాగకూడదో ఈ కధనం ద్వారా ఇక్కడ తెలుసుకుందాం.
గ్రీన్ టీని మలబద్ధకం, యాసిడ్ లేదా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నవారు తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఇందులో టానిన్ అనే మూలకం ఉంటుంది. ఇది కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది. దీని కారణంగా కడుపు నొప్పి సమస్య రావొచ్చు.
ఆలగే, గర్భవతిగా ఉన్న మహిళలు, లేదా డెలివరీ అయినా స్త్రీలకు గ్రీన్ టీ అంత మంచిది కాదు. కారణం ఇందులో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
Also Read: Vitamin-D: విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలు..
అంతేకాకుండా రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు గ్రీన్ టీ అసలు తాగకూడదు. ఇది శరీరంలో ఐరన్ శోషణను తగ్గిస్తుంది. అయితే, రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే, ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
గ్రీన్ టీ ని ఎక్కువగా ఆందోళన చెందే వారు కూడా తాగకపోవడం చాలా మంచిది. దీనికి ప్రధాన కారణం గ్రీన్ టీలో ఉండే కెఫిన్ ఆందోళనను మరింత పెంచడానికి పనిచేస్తుంది. ఇది వేగవంతమైన హృదయ స్పందనకు కారణమవుతుంది. అలాగే, నిద్రకు భంగం కూడా కలిగించవచ్చు.
ఇప్పటికే తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యతో ఇబ్బందిపడుతుంటే గ్రీన్ టీ తాగడం పూర్తిగా మానుకోవాలి. ఇందులో ఉండే కెఫిన్ మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. దీనితో పాటు, థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు కూడా వీలైనంత తక్కువగా గ్రీన్ టీ తాగాలి.
గ్రీన్ టీ తాగడానికి సరైన మార్గం
ఆహారం తినడానికి ఒక గంట ముందు లేదా తర్వాత గ్రీన్ టీ ని తాగడానికి తాగాలి. అయితే, రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల గ్రీన్ టీ మాత్రమే తాగడానికి అలవాటు చేసుకోవాలి. గ్రీన్ టీ తాగే ముందు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటె వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.


