Friday, April 25, 2025
Homeహెల్త్ఇలాంటి కొబ్బరి నీరు తాగుతున్నారా.. అయితే ప్రాణానికే ప్రమాదం..!

ఇలాంటి కొబ్బరి నీరు తాగుతున్నారా.. అయితే ప్రాణానికే ప్రమాదం..!

కొబ్బరి నీరు ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం.. ఇది శరీరానికి తక్షణ తాపాన్ని తగ్గించి, శక్తిని అందించే ఈ పానీయం ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. అయితే కొబ్బరి నీరు తాగేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. ఇది ఎంత మంచిదైతే, అంతే త్వరగా పాడయ్యే స్వభావం కలిగింది. తాజాగా డెన్మార్క్‌లో చోటు చేసుకున్న సంఘటన ఒక హెచ్చరికలా మారింది. అక్కడ ఓ వ్యక్తి ఫ్రిజ్‌లో పెట్టని, పాడైన కొబ్బరి నీరు తాగాడు. తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. మెదడులో వాపు రావడం మొదలై, తీవ్రమైన లక్షణాలు ఏర్పడ్డాయి. చివరికి మెదడు పూర్తిగా పని చేయకపోవడం వల్ల, అతని మరణం సంభవించింది. ఈ ఘటన చూస్తే, మనం ఆరోగ్యకరంగా అనుకునే కొన్ని సహజ పదార్థాల్ని కూడా ఎంతో జాగ్రత్తగా వాడాలి అనే విషయాన్ని గుర్తుచేస్తుంది.

- Advertisement -

కొబ్బరి బొండాన్ని కోసిన వెంటనే, దానిని గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్ లాక్ బ్యాగ్‌లో వేసి వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. దీని వల్ల కొబ్బరి నీరు మూడు నుంచి ఐదు రోజుల వరకూ తాజాగా నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ ఉష్ణోగ్రత 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. ఇలా ఉంచితే బ్యాక్టీరియా పెరగకుండా ఆహారాన్ని కాపాడుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే, పగలగొట్టిన కొబ్బరికాయను కోయకుండా ఉంచాలి. అదనంగా, కొబ్బరిలో ఉండే అదనపు తేమను కాగితపు టవల్‌తో తుడిచివేయడం వల్ల అది 6 నెలల వరకూ ఫ్రీజర్‌లో నాణ్యత కోల్పోకుండా నిలుస్తుంది.

పగలగొట్టి బయట ఉంచిన కొబ్బరి నీరు తక్కువ సమయమే నిల్వ ఉంటుంది. అధిక వేడి కారణంగా బ్యాక్టీరియా వేగంగా పెరిగి దానిని పాడుగా మార్చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాసన మారడం, రుచి చెడిపోవడం మొదట కనిపించే లక్షణాలు. అలాంటి నీటిని తాగితే ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరి శరీరం త్వరగా బ్యాక్టీరియాకు లొంగే అవకాశం ఉంటుంది. అందుకే, ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.

పదేపదే చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, మనం తీసుకునే ఆహారం శుభ్రంగా, సురక్షితంగా ఉండాలన్నదే. ఆహారం విషపూరితంగా మారితే అది కేవలం శారీరక వ్యాధులే కాక, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయానికీ దారి తీస్తుంది. సల్మొనెల్లా, ఇ. కోలీ లాంటి హానికరమైన సూక్ష్మజీవులు తక్కువ ఉష్ణోగ్రతల్లో పెరగలేరు కాబట్టి ఫ్రిజ్ ను ఉపయోగించుకోవాలి. ఆహార భద్రత అనేది కేవలం వ్యక్తిగత శ్రేయస్సు కోసం కాదు .. ఇది కుటుంబాన్ని, సమాజాన్ని రక్షించేందుకు తీసుకోవాల్సిన ఒక బాధ్యతగా మనమందరం చూడాలి. ప్రకృతి ఇచ్చిన ఈ విలువైన కొబ్బరి నీటిని భద్రంగా నిల్వ చేసి, ఆరోగ్యంగా ఆస్వాదించడం ఉత్తమం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News