Saturday, November 15, 2025
Homeహెల్త్Health: పింక్ సాల్ట్ – వైట్ సాల్ట్.. రెండిటిలో ఏది బెటర్‌ అంటే..!

Health: పింక్ సాల్ట్ – వైట్ సాల్ట్.. రెండిటిలో ఏది బెటర్‌ అంటే..!

Pink Salt VS White Salt:మన రోజువారీ ఆహారంలో ఉప్పు ఒక ముఖ్యమైన భాగం. ఏ వంటలోనైనా రుచి రావాలంటే ఉప్పు అవసరం. సూప్ అయినా, కూరగాయలు అయినా లేదా స్నాక్స్ అయినా ఉప్పు లేకుండా రుచిగా ఉండవు. అంతేకాదు, ఆహారం నిల్వ చేయడంలో కూడా ఉప్పు కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఎక్కువగా ఉప్పు తినడం అనేది శరీరానికి హానికరం. ముఖ్యంగా సోడియం అధికంగా తీసుకుంటే రక్తపోటు పెరిగి, గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది సాధారణ టేబుల్‌ సాల్ట్‌ బదులుగా పింక్‌ సాల్ట్‌ వాడటమే మంచిదా అని సందేహపడుతున్నారు.

- Advertisement -

ఉప్పు గనుల నుంచి…

పింక్ సాల్ట్‌ను ఎక్కువగా హిమాలయ పర్వతాల దగ్గర ఉన్న ఉప్పు గనుల నుంచి తీస్తారు. అందుకే దీనిని హిమాలయన్‌ సాల్ట్‌ అని పిలుస్తారు. ఈ ఉప్పు ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా ప్రాసెసింగ్ చేయరు. సహజంగా ఉన్న విధంగానే మనకు అందుతుంది. అందులో ఐరన్ ఆక్సైడ్ వంటి ఖనిజాలు ఉండటం వల్లే దీనికి గులాబీ రంగు వస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఈ సాల్ట్‌లో 80కి పైగా విభిన్న ఖనిజాలు లభిస్తాయి. వీటిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ప్రధానమైనవి.

Also Read: https://teluguprabha.net/devotional-news/curry-leaves-plant-vastu-rules-for-prosperity-and-happiness/

దీనికి భిన్నంగా మనం రోజూ వాడే సాధారణ ఉప్పు లేదా టేబుల్‌ సాల్ట్‌ సముద్రపు నీటిని శుద్ధి చేయడం ద్వారా తయారు చేస్తారు. తయారీ ప్రక్రియలో దానిలో ఉన్న చాలా ఖనిజాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ ఉప్పు తేమ కారణంగా గడ్డకట్టకుండా ఉండేందుకు యాంటీ కేకింగ్‌ ఏజెంట్లు కలిపి విక్రయిస్తారు. ఈ ఉప్పులో సాధారణంగా అయోడిన్‌ జోడిస్తారు. అయోడిన్‌ వల్ల థైరాయిడ్‌ సమస్యలు దూరమవుతాయి. అయితే CDC ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక టీస్పూన్‌ టేబుల్‌ సాల్ట్‌లో దాదాపు 2400 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అమెరికా FDA మాత్రం రోజుకు 2300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ సోడియం తీసుకోవద్దని సూచిస్తోంది.

ప్రాసెసింగ్‌లో తేడా..

పింక్‌ సాల్ట్‌లో సోడియం క్లోరైడ్‌ శాతం 84 నుంచి 98 వరకు ఉంటుందని చెబుతారు. అదే టేబుల్‌ సాల్ట్‌లో 97 నుంచి 99 శాతం సోడియం క్లోరైడ్‌ ఉంటుంది. అంటే రెండింటిలోనూ సోడియం ప్రధాన భాగమే అయినప్పటికీ, ప్రాసెసింగ్‌లో తేడా ఉంటుంది. టేబుల్‌ సాల్ట్‌ పూర్తిగా శుద్ధి చేసి తెల్లగా, సన్నగా లభిస్తుంది. పింక్‌ సాల్ట్‌ మాత్రం కొంచెం గట్టిగా, దొడ్డుగా ఉండి, గులాబీ రంగులో కనిపిస్తుంది.

రుచి పరంగా చూస్తే టేబుల్‌ సాల్ట్‌ మరింత ఉప్పుగా ఉంటుంది. పింక్‌ సాల్ట్‌ తేలికపాటి ఉప్పుతనంతో పాటు ఖనిజాల రుచి కూడా కలిపి ఉంటుంది. కొంతమంది దీని రుచి తేడా వల్లనే వంటల్లో పింక్‌ సాల్ట్‌ వాడటానికి ఆసక్తి చూపుతున్నారు.

Also Read: https://teluguprabha.net/gallery/tulsi-water-health-benefits-and-immunity-boosting-properties/

ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, టేబుల్‌ సాల్ట్‌లో ఉండే అయోడిన్‌ వల్ల శరీరానికి అవసరమైన అయోడిన్‌ అందుతుంది. దీని వల్ల గోయిటర్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. మరోవైపు పింక్‌ సాల్ట్‌ తీసుకోవడం వల్ల హైడ్రేషన్‌ మరియు ఎలక్ట్రోలైట్‌ సమతుల్యం కాపాడటానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఇందులో ఉండే ఖనిజాలు శరీరానికి సహజ మద్దతు ఇస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఇవి విన్నాక చాలా మంది ఏ ఉప్పు తీసుకోవాలో అన్న సందేహంలో పడతారు. నిజానికి ఇరువురి దగ్గరా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. టేబుల్‌ సాల్ట్‌ ద్వారా అయోడిన్‌ లభించడం ఒక పెద్ద ప్రయోజనం. పింక్‌ సాల్ట్‌ ద్వారా సహజ ఖనిజాలు అందుకోవచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఏ ఉప్పునైనా అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి పరిమితిలో ఉప్పును తీసుకోవడమే మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad