దానిమ్మ పండు తింటే అందరికీ ఎంతో మంచిది. ముఖ్యంగా స్త్రీలు ఈ పండు తినడం వల్ల పొందే
లాభాలు మరింత ఎక్కువట. ఈ పండు వల్ల స్త్రీలు పొందే ఆరోగ్య సిరికి అంతే లేదట.
- Advertisement -
- ఈ పండులో ఎక్కువ న్యూట్రియంట్లు ఉన్నాయి. పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. నిత్యం ఈ పండును తినడం వల్ల మెలమెల్లగా శరీరంలోని ఫ్యాట్ పై మంచి ప్రభావం చూపుతుంది. ఇందులో ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ ఉంది. ఇది గర్భిణీలకు చాలా అవసరం. పుట్టే బిడ్డకు ఎలాంటి లోపాలు లేకుండా ఇది చూస్తుంది. అంతేకాదు సంతాన సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. కాన్సర్ రిస్కు బారిన పడకుండా కాపాడుతుంది.
- ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంది. ఇది గుండె బాగా పనిచేసేలా చేస్తుంది. రక్తపోటును
తగ్గిస్తుంది. - ఈ పండులో విటమిన్ సి కూడా పుష్కలం. ఇది శరీరంలో బలమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. అంతేకాదు ఈ పండు శరీర బరువును కూడా తగ్గిస్తుంది.
- విటమిన్ ఇ చర్మానికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అలాంటి మంచి విటమిన్ దానిమ్మలో పుష్కలంగా ఉంది. ఆరోగ్యవంతమైన శిరోజాల పెరుగుదలకు ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. గోళ్లు బాగా పెరిగేలా చేస్తుంది.
- చర్మంపై ఏర్పడ్డ మచ్చలు, ముడతలను కనిపించనివ్వదు.
- ఈ పండులో విటమిన్ కె బాగా ఉంది. ఇది శరీరంలోని ఎముకలను దృఢంగా ఉంచుతుంది. అంతేకాదు కాట్నిటివ్ హెల్త్ ను కూడా పెంపొందిస్తుంది.
- దానిమ్మలో వైద్య చికిత్సకు పనికివచ్చే రెండు ప్లాంట్ కాంపౌండ్లు ఉన్నాయి. వీటిల్లో పునికాలగిన్స్ ఎంతో శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు. ఇవి దానిమ్మ తొక్కలోనే కాదు దానిమ్మ గింజల జ్యూసులో కూడా బాగా ఉంటాయి.
గ్లూకోజ్ టాలరెన్సు ను ఈ పండు మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ప్యునిసిక్ యాసిడ్ ఫ్యాటీ యాసిడ్. అది మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో గ్లూకోజ్ టాలరెన్సును మెరుగుపరుస్తుందని స్టడీల్లో సైతం వెల్లడైంది. మన శరీరంలోని పెరిరెనల్, ఎపిడిడైమల్ ఫ్యాట్స్ గుండెకు సంబంధించిన అనారోగ్యాలకు కారణమవుతాయి. దానిమ్మను తినడం వల్ల శరీరంలోని ఈ ఫ్యాట్స్ ను ముఖ్యంగా తగ్గుతాయి. దాంతో గుండె జబ్బుల రిస్కు కూడా బాగా తగ్గుతుంది.
- దానిమ్మ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అంతేకాదు ఎముకలోని ఖనిజాల సాంద్రతను కూడా ఈ పండు మెరుగుపరుస్తుంది. కాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వ్యాధిగ్రస్థులు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తో బాధపడుతుంటారు. ఇది నిశ్శబ్దంగా వారి శరీరమంతటా వ్యాపిస్తుంది. చివరకు ఈ సమస్య పేషంటు జీవితకాలంపై కూడా ప్రభావం చూబిస్తుంది. ఇలాంటి వారికి యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న దానిమ్మ పండు చేసే మేలు ఎంతో. పునికలాగిన్స్ లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ సమస్యతో బాధపడేవారు దానిమ్మ పండు తింటే చాలా మంచిది. పలు స్టడీల్లో బ్రెస్ట్ కాన్సర్ కణాలు, పెద్దప్రేవు కాన్సర్ కణాలు , చివరకు జీర్ణాకోశ ద్వారంలో తలెతే ఇన్ఫ్లమేషన్ సమస్యలకు దానిమ్మ గింజలు ఎంతో బాగా పనిచేస్తాయని తేలింది.
- అంతేకాదు ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో రోజుకు ఒక కప్పు దానిమ్మ రసం తాగడం వల్ల డయాబెటిస్ పేషంట్లలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అయిన ఇంటర్ ల్యుకిన్-6,సిఆర్ పిలు తగ్గుతాయట. అంతేకాదు దానిమ్మ నుంచి తీసిన పదార్థాలు రొమ్ము కాన్సర్ కణాలను తగ్గించడంతో పాటు రొమ్మకాన్సర్ కణాలను పూర్తిగా పోగొట్టొచ్చు కూడా. అంతేకాదు చర్మ కాన్సర్, ఊపిరితిత్తుల కాన్సర్ వంటి సీరియస్ సమస్యల చికిత్సలో కూడా ఈ పండు వల్ల పొందే ప్రయోజనాలు ఎన్నో అని సైతం పలు స్టడీలు తెలుపుతున్నాయి.
- గుండె పోటు రావడానికి అధిక రక్తపోటు ఒక కారణం. దాన్ని నియంత్రించడంలో సైతం దానిమ్మ బాగా పనిచేస్తుంది. కొన్ని వారాల పాటు నిత్యం ఐదు ఔన్సుల దానిమ్మ రసం తాగుతున్న వారిలో అధిక
రక్తపోటు ప్రముఖంగా తగ్గిన కేసులున్నాయని కూడా ఒక స్టడీలో వెల్లడైంది. గుండెజబ్బుల రిస్కును కూడా దానిమ్మ బాగా తగ్గిస్తుంది. - దానిమ్మ కీళ్ల సమస్యలను తగ్గించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. దానిమ్మలోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల కీళ్లనొప్పుల బాధలు తగ్గుతాయి.
- బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా దానిమ్మ తగ్గిస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో మెమరీ పవర్ ను
మరింతగా మెరుగుపరుస్తుంది. ఇందులోని డైటరీ నైట్రేట్స్ వల్ల వ్యాయామాలను బాగా చేయగలరు.
దానిమ్మలోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఇన్ఫ్లమేటరీ బవుల్ డిసీజ్ తో బాధపడేవారు ఎన్నో
రకాలుగా లాభం పొందుతారు. అంతేకాదు దానిమ్మలో యాంటిబాక్టీరియల్, యాంటి వైరల్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. నిత్యం దానిమ్మను తమ డైట్ లో వాడే వారు మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు.