Homeహెల్త్Plastic: ప్లాస్టిక్ బాటిల్‌‌తో నీళ్లు తాగుతున్నారా.. అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే!

Plastic: ప్లాస్టిక్ బాటిల్‌‌తో నీళ్లు తాగుతున్నారా.. అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే!

Plastic Water Bottles: ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికే కాదు.. మన నిద్రకు కూడా శత్రువని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మనం రోజూ వాడే వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువుల వల్ల ఇన్సోమ్నియా(నిద్రలేమి) సమస్య తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. నిత్యం మనం తాగే నీళ్ల బాటిల్ ప్రభావం మన శరీరంపై దాదాపు కెఫిన్ (కాఫీ/టీ) చూపే ప్రభావంతో సమానంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

- Advertisement -

జీవ గడియారాన్ని దెబ్బతీస్తున్న రసాయనాలు: నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ప్లాస్టిక్ టాక్సికాలజీ నిపుణుడు మార్టిన్ వాగ్నర్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. ప్లాస్టిక్ వస్తువుల నుంచి విడుదలయ్యే రసాయనాలు మానవ శరీరంలోని సిర్కాడియన్ రిథమ్(Circadian Rhythm) లేదా జీవ గడియారాన్ని తారుమారు చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. పీవీసీ (PVC), పాలీయురేథేన్ ఉత్పత్తుల నుంచి వెలువడే రసాయనాలు కణాలలోని మాలిక్యులర్ క్లాక్ సిగ్నల్‌లను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల నిద్రపోయే సమయం సుమారు 17 నిమిషాల వరకు ఆలస్యమవుతుంది.

నిద్రలేమితో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు: ప్లాస్టిక్ రసాయనాల ప్రభావం వల్ల స్లీపింగ్ సైకిల్స్ దెబ్బతింటే.. అది కేవలం నిద్రలేమికి మాత్రమే పరిమితం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం (Obesity), రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, డయాబెటిస్ (మధుమేహం), క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో స్టీల్ లేదా రాగి బాటిల్స్ వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఆరోగ్యానికి మేలని వారు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News