Saturday, October 12, 2024
Homeహెల్త్Ragi soup: రాగి సూప్ తో స్లిమ్ అయిపోండి

Ragi soup: రాగి సూప్ తో స్లిమ్ అయిపోండి

కడుపు కాల్చుకోకుండా ఆరోగ్యకరమైన ఈ సూప్ ఎంజాయ్ చేయండి

బరువు తగ్గాలంటే 30 శాతం వ్యాయామాల అవసరమైతే, 70 శాతం మనం తినే తిండి మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ రాగి సూప్. దీనితో బరువు తగ్గొచ్చు. శీతాకాలంలో తినే బలమైన రెసిపీ కూడా ఇది. పండుగల్లో ఇష్టమైనవి తిని కాలరీలు పెరిగామని వరీ అవకండి. పెరిగిన కాలరీలను తగ్గించే రాగి సూపు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాదు రాగిజావ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కూడా.

- Advertisement -

రాగి సూపులో బరువును తగ్గించేందుకు ఉపయోగపడే బోలెడు పోషకాలు ఉన్నాయి. రాగులకు మొదట నుంచీ సూపర్ ఫుడ్ అనే పేరుంది. రాగుల్లో కాల్షియం, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఎముకలు, కండరాలు ద్రుఢంగా ఉంటాయి. అంతేకాదు రాగి సూప్ తిన్న తర్వాత కడుపు నిండుగా ఉండి ఆకలి వేయదు. దీంతో క్రేవింగ్ మనల్ని వెన్నాడదు కూడా. అంతేకాదు రాగి సూపు వల్ల బ్లడ్ షుగర్ ప్రమాణాలు స్థిరంగా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహవ్యాధిగ్రస్తులకు ఇది మంచి పోషకాహారం కూడా. కేవలం రాగులతో చేసిన సూపు తినడం ఇష్టంలేని నాన్ వెజిటేరియన్స్ దీంట్లో కాస్తంత మాంసం కూడా చేర్చి తింటే మరింత బాగుంటుంది.

ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు పోషకాహారనిపుణులు కూడా. రాగి సూపులో చికెన్ ముక్కలు వేసి నీళ్లకు బదులు చికెన్ స్టాక్ ను రాగి సూపుకు జోడించి ఉడికిస్తే చాలు. పుష్కలంగా ప్రొటీన్లున్న సూపర్ ఫుడ్ ఇది. దీన్ని తింటే చలికాలంలో మనల్ని వేధించే జ్వరాలు, ఒళ్లు నొప్పులు, జలుబు వంటి వెన్నో దరికి రావు. రాగి సూపు మరింత రుచిగా ఉండాలంటే గుడ్డులోని తెల్లసొనను బాగా గిలక్కొట్టి ఆ సూపులో పోస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. రాగిసూప్ తయారుచేసుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అందులోకి కూరగాయలు వేసి తింటే ఆ రుచి ఎంతో బాగా ఉంటుంది. శరీరానికి ఆరోగ్యాన్ని పంచే రాగి ఇందులో ఉంది కాబట్టి ఈ సూపు గొప్పతనం వేరే చెప్పాలా?

ఈ సూపు తయారీకి కూరగాయలండాలి. వాటిని ముక్కలుగా తరిగి మసాలా దినుసులు, పలచగా చేసిన రాగి జావ అన్నీ కలపాలి. దానిపై మీకు నచ్చిన వాటితో అంటే ఉదాహరణకు ఉల్లికాడలతో గార్నిష్ చేసుకోవచ్చు. పన్నీరు ముక్కను చిదిమి సూపు మీద చల్లితే కూడా దాని ఫ్లేవర్ మరింత పెరుగుతుంది. తొక్కతీసిన అల్లాన్ని సన్నని ముక్కలుగా తరిగి సూపుపై చల్లి ఆ రాగి సూప్ తింటే దాని రుచి వేరే లెవల్లో ఉంటుంది. రాగి సూపు తాగడం వల్ల ముఖ్యంగా చలికాలంలో శరీరం బరువెక్కకుండా తేలికగా ఉంటుంది. శరీరం బరువు తగ్గి సన్నబడతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News