Benefits Of Ranapala Leaf: మన చుట్టూ కనిపించే సాధారణ మొక్కలే మన ఆరోగ్యానికి బలమైన ఆధారంగా మారతాయని చాలామందికి తెలియదు. ఇంటి పెరట్లో పెరిగే కొన్ని మొక్కలు అద్భుతమైన ఔషధ లక్షణాలు కలిగి ఉంటాయి. అటువంటి అనేక రోగ నివారణ గుణాలున్న మొక్కల్లో రణపాల కూడా ఒకటి. సాధారణంగా ఆకుపచ్చగా కనిపించే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.
రాళ్లను కరిగించే..
ఈ మొక్కను పెంచడం చాలా సులభం. కుండీల్లో గానీ, ఇంటి ఆవరణలో నేలపై గానీ ఉంచి పెంచుకోవచ్చు. ఆకులు మందంగా ఉండి వాటిలో రసం పుష్కలంగా కనిపిస్తుంది. ఈ మొక్కను వాడటంలో ప్రాముఖ్యత దాని ఆరోగ్య ప్రయోజనాలే.రణపాల మొక్కకు ఆయుర్వేదంలో పాషాణభేది అనే పేరు ఉంది. దీని అర్థం రాళ్లను కరిగించే ఔషధం. పేరు చెబుతున్నట్లుగానే, ఇది మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను తక్కువ సమయంలో కరిగించి, అవి శరీరం నుంచి బయటకు వెళ్లేలా చేస్తుంది. మూత్రనాళాల్లో సంచరించే ఈ రాళ్లు కలిగించే తీవ్రమైన నొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
ఖాళీ పొట్టతో రెండు మూడు ఆకులను…
ప్రతిరోజూ ఉదయం ఖాళీ పొట్టతో రెండు మూడు ఆకులను నమలడం లేదా వాటి రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని అనుభవాల ద్వారా తెలియజేస్తున్నారు. ఇది కేవలం కిడ్నీ సమస్యలకే కాకుండా ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు కూడా సహాయపడుతుంది.రణపాల ఆకుల్లోని పోషక విలువలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాలేయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఇది సహకరిస్తుంది. రోజూ ఈ మొక్కను కొన్ని వారాల పాటు వాడితే ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు..
జీర్ణ సమస్యలు కూడా ఈ మొక్క వాడకంతో తగ్గుతాయి. ఆకుల్లో స్వల్పంగా ఉప్పగా, పుల్లగా ఉండే రుచి ఉంటుంది. దీనివల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలపై త్వరిత పరిష్కారం లభిస్తుంది. దీని రసంలో కొద్దిగా శొంఠి పొడి కలిపి తాగితే వేగంగా ఉపశమనం లభిస్తుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ…
రణపాల మొక్కలో సహజంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దాంతో శరీరంలో వచ్చే వాపులు, కీళ్ల నొప్పుల వంటి సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఆకులను మెత్తగా నూరి నొప్పి ఉన్న ప్రదేశాల్లో పట్టుగా వాడితే ఉపశమనం కలుగుతుంది. అలాగే ఆకులను వేడి చేసి గాయాలపై కట్టుగా పెట్టితే త్వరగా మానిపోతాయి. ఇందులోని యాంటీసెప్టిక్ లక్షణాలు మైక్రోబయల్స్ పై ప్రభావం చూపుతాయి.
రక్తపోటు నియంత్రణలో…
రక్తపోటు నియంత్రణలో కూడా ఈ మొక్క తన ప్రత్యేకతను చూపుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు రోజుకు రెండుసార్లు ఈ మొక్క ఆకుల రసం కొన్ని చుక్కలు నీటిలో కలిపి తాగితే బీపీ కంట్రోల్ లో ఉండే అవకాశం ఉంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది.
శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించడంలో రణపాల సహాయపడుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఎలాంటి మార్గాలవల్లనైనా శరీరం పాడవకుండా చూసే ఈ మొక్కని తరచూ వాడటం వల్ల శరీరానికి మెరుగైన రక్షణ లభిస్తుంది.
Also Read: https://teluguprabha.net/health-fitness/health-benefits-of-drinking-water-stored-in-copper-bottle/
ఆకులను నేరుగా తినడం ఇష్టంలేనివారు కషాయం రూపంలో కూడా వాడుకోవచ్చు. అర లీటరు నీటిలో 15–20 రణపాల ఆకులు వేసి బాగా మరిగించాలి. నీరు సగం అయ్యేంత వరకూ మరిగిన తర్వాత వడకట్టి తాగాలి. రుచి కోసం తేనె లేదా చిటికెడు ఉప్పు కలిపి తీసుకోవచ్చు. ఇలా రోజుకు రెండు సార్లు వాడితే శరీరానికి కావాల్సిన ఆరోగ్య లాభాలు అందుతాయి.
అయితే ప్రతి ఒక్కరి శరీర స్వభావం వేరు కావడం వల్ల కొత్తగా ఏదైనా ఔషధ మొక్క వాడేముందు ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించడం మంచిది. కొన్ని సందర్భాల్లో మితిమీరిన వాడకంతో దుష్ఫలితాలు రావచ్చు. అందువల్ల సరైన మార్గదర్శకత్వంలో వాడటం వల్లే దీని ప్రయోజనాలు పూర్తిగా పొందొచ్చు.
Also Read: https://teluguprabha.net/health-fitness/watermelon-strawberry-smoothie-for-glowing-skin-naturally/
ఈ మొక్క గురించి చరిత్రలోనూ ప్రస్తావనలు ఉన్నాయి. అనేక పూర్వకాల ఆయుర్వేద గ్రంథాలలో దీనిని ప్రకృతి ఔషధంగా పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో మరుగున పడిపోయిన ఈ ప్రకృతి వరాన్ని తిరిగి మన జీవితాల్లోకి తీసుకురావడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఈ నేపథ్యంలో, ఇంటి ఆవరణలో ఉండే చిన్న మొక్క మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడగలదో రణపాల మెచ్చిన ఉదాహరణగా నిలుస్తుంది.


