Tuesday, October 15, 2024
Homeహెల్త్RDN medical treatment: సీనియర్ సిటిజెన్ కు ఆర్.డి.ఎన్ చికిత్స విజయవంతంగా చేసిన కేర్...

RDN medical treatment: సీనియర్ సిటిజెన్ కు ఆర్.డి.ఎన్ చికిత్స విజయవంతంగా చేసిన కేర్ హాస్పిటల్స్

'కేర్' లో బెస్ట్ హెల్త్ కేర్

అధునాతన ఆర్ డీఎన్ వైద్య చికిత్సతో వృద్ధుని ప్రాణాలు పదిలం విజయవంతంగా చికిత్స అందించిన కేర్ ఆస్పత్రి వైద్యులు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హైదరాబాద్ లోని చిక్కడపల్లికి చెందిన వృద్ధునికి బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి రోగి ప్రాణాలను నిలబెట్టారు. అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్), మధుమేహం, తీవ్రమైన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న 74 ఏళ్ల వృద్ధుడికి అధునాతన ఆర్ డి ఎన్ (Renal denervation) వైద్య విధానంలో చికిత్స అందించి స్వాంతన చేకూర్చడం ద్వారా ఈ విభాగంలో కేర్ ఆస్పత్రి పురోగతి సాధించింది.
బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రుల మెడికల్ సూపరింటెండెంట్ డా. అజిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అధిక రక్తపోటు, మధుమేహం, కరోనరీ ఆర్టరీ డిజీస్ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధ రోగి గతంలోనే కరోనరీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. అయినప్పటికీ ప్రమాదకర రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాపాయస్థితిలో ఇటీవల బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. అతని ఆరోగ్య ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యుల పరిశీలనలో తేలింది. అధిక మోతాదులో ఔషధాలను వినియోగించడం సైతం ఇందుకు దోహదం చేసింది. ఈ క్రమంలో రోగి నాన్- ఇస్కీమిక్ హైపర్టెన్సివ్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ వైఫల్యాన్ని పొందే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో కేర్ ఆస్పత్రి వైద్యులు క్యాథ్ ల్యాబ్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. పి ఎల్ ఎన్ కపర్ది రోగికి మూత్రపిండ ధమనులపై.. అధునాతన ఆర్ డి ఎన్ (రేనల్ డిన్నర్ వేషం ట్రీట్మెంట్) వైద్య విధానం ద్వారా 11 మార్లు (11 సైకిల్ ఆబ్లేషన్) సురక్షితమైన చికిత్సను అందించారు. చికిత్స అనంతరం వారం రోజుల్లో రోగి రక్తపోటు మెరుగుపడింది, రోగి ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకోవడంతో అతడు వినియోగించే ఔషధాలను తగ్గించేందుకు వీలు కలిగింది.
ఈ సందర్భంగా కేర్ ఆస్పత్రి క్యాథ్ ల్యాబ్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. పి ఎల్ ఎన్ కపర్ది మాట్లాడుతూ, “రెసిస్టెంట్ హైపర్ టెన్షన్” నిర్వహణలో మూత్రపిండ నిర్మూలన ప్రక్రియ ప్రభావాన్ని ఈ కేసు ఉదాహరణగా చూపుతుందన్నారు. తీవ్రమైన హైపర్టెన్సివ్ అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఈ విధానం సామర్థ్యం వెల్లడవుతుందని చెప్పారు. కేర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. అజిత్ సింగ్ మాట్లాడుతూ, రోగి సంరక్షణ, వైద్య శ్రేష్టతకు కేర్ కట్టుబడి ఉందన్నారు. వినూత్న వైద్య చికిత్సలను అవలంబించడంలో తమ నిబద్ధతకు ఈ కేసు ఒక ఉదాహరణ అన్నారు. అత్యంత సవాలుతో కూడిన ఆరోగ్య సమస్యలకు అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడంలో కేర్ ఆస్పత్రి అంకితభావాన్ని కలిగి ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News