Saturday, September 21, 2024
Homeహెల్త్Ridge guard: బీరకాయ నూనెతో బ్యూటీ

Ridge guard: బీరకాయ నూనెతో బ్యూటీ

ఈమధ్యకాలంలో జుట్టు రాలిపోవడం సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య తలెత్తిన వెంటనే స్పందిస్తే వెంట్రుకలను కాపాడుకోవచ్చని సౌందర్యనిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో జుట్టు రాలడం, వెంట్రుకలు తెల్లబడడం వంటి సమస్యలను సింపుల్గా నిరోధించవచ్చంటున్నారు. అలాంటి వంటింటి చిట్కాలలో ఒకటి బీరకాయ జ్యూసు. బీరకాయను సగానికి కోసి తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీలో ఈ బీరకాయముక్కలు, రెండు కరివేపాకు రెబ్బలు, మూడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అందులో సరిపడినన్ని నీటిని పోసి జ్యూసులా చేయాలి. ఆ జ్యూసులో పావు స్పూను శొంఠిపొడి, చిటికెడు మిరియాలపొడి, పావు స్పూను జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా సైంధవ లవణం వేయాలి. ఇలా తయారుచేసిన బీరకాయ జ్యూసును ఉదయం పరగడుపున పది రోజుల పాటు తాగితే జుట్టు రాలడం తగ్గి, వెంట్రుకలు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయంటున్నారు శిరోజాల నిపుణులు.

- Advertisement -

జుట్టు రాలడానికి పోషకాహార లోపం కూడా ఒక కారణమని నిపుణులు చెప్తున్నారు. అందువల్ల మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని నిత్యం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సలహా ఇస్తున్నారు. బీరకాయ తెల్ల జుట్టును నల్లగా చేస్తుంది. జుట్టుకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను బీరకాయ సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. తెల్లజుట్టు సమస్య పోవాలంటే కాస్త నూనెలో బీరకాయ ముక్కలను వేసి బాగా ఉడికించి ఆ నూనెను వడకట్టి ప్రతిరోజూ దానిని జుట్టుకు రాయాలి.

ఇలా కొంతకాలంపాటు చేయడం వల్ల తెల్లజుట్టు మెల్లగా నల్లరంగులోకి మారుతుంది. జుట్టు తెల్లబడకుండా చేయడంలో బీరకాయలోని విత్తులు బాగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటారు. జుట్టు కుదుళ్లల్లో
మిలనిన్ వ్రుద్ధి చెసే ఎంజైములు ఈ గింజల్లో ఉన్నాయని వీళ్లు చెప్తారు. బీరకాయ గింజల కేరియర్ ఆయిల్ ని నేరుగా మాడుకు రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు పటిష్టంగా తయారవుతాయట. దురద, పొడిచర్మ సమస్యలు మాడులో తలెత్తవట. అంతేకాదు శిరోజాలు బాగా పెరిగేలా ఇది చేస్తుందంటున్నారు. తలలోని తెల్లజుట్టు సమస్య పోవడానికి బీరకాయ గింజల నూనెని మాడుకు బాగా పట్టించి ఉదయం వరకూ అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ నూనె జుట్టు కుదుళ్ల నుంచి మాడు లోపలికంటా వెళ్లి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. బీరకాయ గింజల ఆయిల్ ని చర్మానికి రాసుకుంటే చర్మం ఎంతో మ్రదువుగా, పట్టులా తయారవుతుంది. ఎంతో బాగా మెరుస్తుంది.

బీరకాయ గింజల కేరియర్ ఆయిల్ లో ఉండే ఒమెగా 6, ఒమెగా 9, కుకుర్ బిటాసిన్ బి, ఇలు, విటమిన్ ఎ, సి, బి6, పాల్మిటోలిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్, ట్రిటెర్పెనాయిడ్ సెపొనిన్స్ లు చర్మపు సహజసిద్ధమైన ఎకోసిస్టమ్ ను పరిరక్షిస్తాయి. ఈ నూనెలోని విటమిన్ ఎ, విటమిన్ సిలు హైపర్ పిగ్మెంటేషన్, తేలికపాటి యాక్నే, వయసుమీదపడుతున్న ఛాయలు తొందరగా కనపడ్డం వంటి పలు చర్మ సమస్యలను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. విటమిన్ బి6, పాల్మిటోలిక్ యాసిడ్ లు యాంటీ ఏజింగ్, యాంటి యాక్నే ఏజెంట్లుగా పనిచేస్తాయి. కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. లోషన్, క్రీమ్స్ లో సైతం ఈ నూనెను చేర్చడం వల్ల చర్మంపై మంచి ప్రభావం చూస్తాం.

ఇందులోని యాంటాక్సిడెంట్ల కారణంగా చర్మానికి ఇది మంచి ఆయిల్ గా పనిచేస్తుంది. చర్మాన్ని మ్రుదువుగా చేస్తుంది. అంతేకాదు క్లీన్సింగ్ చేసిన తర్వాత మరింతగా చర్మం మెరిసేలా చేస్తుంది. బీరకాయ గింజల నూనెలో యాంటిమైక్రోబియల్ సుగుణాలతో పాటు నేచురల్ డిటాక్సింగ్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ నూనె జుట్టును పట్టులా చేస్తుంది. తెల్లజుట్టు రాకుండా నిరోధిస్తుంది. చర్మంపై మ్రతుకణాలను తొలగించి శుభ్రం చేస్తుంది. చర్మం ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. యాక్నే రిస్కు ఉన్న చర్మానికి కావలసినంత సాంత్వనను అందిస్తుంది. గాయాలను మాన్పుతుంది. చర్మంలోని మురికి, మలినాలను పోగొడుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
అంతేకాదు చర్మంలోని నూనె ఉత్పత్తిని ఇది సమతుల్యం చేస్తుంది. చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. నల్లమచ్చలను పోగొడుతుంది. చర్మం, పెదవులు మ్రదువుగా ఉండేట్టు చేస్తుంది. జుట్టుకు కావలసిన తేమను అందిస్తుంది. మాడు పొడిబారకుండా కాపాడుతుంది. జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. శిరోజాలకు కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ ప్రకాశవంతంగా కనిపిస్తాయి. తరచూ బీరకాయగింజల నూనె వినియోగించడం వల్ల చర్మం, జుట్టులకు సంబంధించి ఎన్నో ప్రయోజనాలను మనం అందుకుంటాము. డైట్ లో కూడా బీరకాయ ఉండేలా చూసుకోవాలి. ఉదాహరనణకు బీరకాయ రైతా తింటే చాలామంచిది. ఇది మలబద్దకాన్ని తగ్గించడంతో పాటు బరువు పెరగకుండా సహాయపడుతుంది. జీర్ణక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది.

బరువు తగ్గించడంలో కూడా బీరకాయ సహకరిస్తుంది. బీరకాయ ముక్కలను మెత్తగా ఉండికించి చిక్కటి మజ్జిగలో వేయాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర,మినపప్పు, ఇంగువ వేసి నూనెలో వేగించాలి. ఆ తర్వాత ఎర్రమిరకాయ, పచ్చిమిరప కాయ ముక్కలు, కరివేపాకును కూడా అందులో జోడించి ఒకసారి నూనెలో అటు ఇటు వేగించాలి. ఆ తాళింపును బీరకాయ రైతాపై వేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. బీరకాయ రెసిపీలు జుట్టుకు, చర్మానికే కాదు శరీరారోగ్యానికి కూడా ఎంతో మంచి చేస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News