మహిళల అందానికి శత్రువు వేసవికాలం. అధిక ఉష్ణోగ్రతలు .. చెమట .. ఉక్కపోత .. దుర్వాసన మహిళలను ఇబ్బంది పెడతాయి. మండే ఎండలకు శరీరం ట్యాన్ కావడంతో పాటు ముఖానికి వేసుకున్న మేకప్ కూడా కారిపోతుంది. దీంతో .. ఎండాకాలం బైటకు రావాలంటే చాలు మహిళలు చిరాకు పడతారు. అయితే .. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వేసివికాలం సైతం అందంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా …!
వేసవికాలం వచ్చిందంటే చెమట పట్టడం, ట్యాన్ అయ్యిపోవడం, ర్యాషెస్ రావడం ఇలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అయితే ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఎండా కాలంలో సెన్సిటివ్ స్కిన్ వాళ్లకి చర్మంపై మంట కలగడం, నొప్పి కలగడం, చర్మం ఎర్రగా మారడం, యాక్ని మొదలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో శరీర సంరక్షణకు మరింత శ్రద్ధ పెడుతూ ఉండాలి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు మీ చర్మం వేసవి కాలంలో కూడా ఎంతో బాగుంటుంది.
వేసవికాలంలో మనం లైట్‌గా ఉండే దుస్తులు ధరించడానికి ఇష్టపడతాం. అలానే మనకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటే బట్టలని వేసుకుంటూ ఉంటాము. అలానే బయటికి వెళ్లకుండా వీలైనంత వరకు ఇంటిపట్టునే ఉండడానికి చూస్తూ ఉంటాము. అయితే ఒకవేళ కనుక బయటకు వెళ్లాల్సి వస్తే చర్మం ఎండకి కమిలి పోతుంది. అలానే ఎన్నో సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. నిజానికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో సెన్సిటివ్ స్కిన్ వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. అటువంటప్పుడు చర్మంలో ఉండే సెబమ్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దీంతో చర్మం యాక్నికి గురవుతుంది. దీని మూలంగా చర్మం చాలా డల్‌గా మారిపోతుంది. అలాగే యువి కిరణాల కారణంగా మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇది ప్రొడ్యూస్ అవడం వల్ల చర్మం డల్‌గా అయిపోతుంది. ఎండా కాలంలో చర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తప్పకుండా వీటిని రెగ్యులర్‌గా అనుసరించండి.
కవర్ చేసుకోవాలి
మీ చర్మాన్ని కవర్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు చర్మాన్ని కవర్ చేసుకోండి. కేవలం వేసవికాలం వరకు కొంచెం మీరు మీ స్కిన్‌ని కవర్ చేసుకుంటూ ఉంటే మంచిది. దీంతో సన్ లైట్ డైరెక్ట్‌గా చర్మంపై పడదు. చర్మానికి కూడా ఇలాంటి సమస్యలు కలగవు. అందువల్ల మీరు బయటకు వెళ్లేటప్పుడు గొడుగుని తీసుకువెళ్లడం మర్చిపోకండి. అలానే ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్‌ని కూడా ధరించండి. పెద్ద టోపీ ఒకటి కొనుక్కోవడం మర్చిపోవద్దు.
సన్ స్క్రీన్ లోషన్
వేసవి వచ్చిందంటే చాలా మంది సన్ స్క్రీన్ లోషన్‌ని వాడడం ప్రారంభిస్తారు. సన్ స్క్రీన్ లోషన్‌ని రాసుకోవడం వల్ల చర్మానికి సమస్యలు తగ్గుతాయి. అయితే మీరు సన్‌స్క్రీన్ లోషన్‌ని కొనుగోలు చేసేటప్పుడు ఎస్పీఎఫ్ 30 లేదా అంత కంటే ఎక్కువ ఉన్న దాన్ని కొనుగోలు చేయండి.అదే విధంగా సన్‌స్క్రీన్ లోషన్‌ని బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోండి. సన్‌స్క్రీన్ లోషన్ వాడటం వల్ల చర్మ సమస్యలు ఉండవు. అలాగే చర్మానికి ప్రొటెక్షన్ ఉంటుంది. సన్‌స్క్రీన్ లోషన్‌ని మీరు స్క్రీన్స్ ముందు పని చేసేటప్పుడు వాడితే కూడా మంచిది. స్క్రీన్స్ ముందు పని చేసుకునేటప్పుడు రెగ్యులర్‌గా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుంటే డార్క్ సర్కిల్స్ మొదలైన స్కిన్ సమస్యలు వుండవు.
నీరు ఎక్కువగా తీసుకోవాలి
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేట్‌గా ఉండటం కూడా చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. వేసవిలో చెమట ఎక్కువ పడుతుంది దీంతో ఎక్కువ నీళ్ళు ఒంట్లో నుంచి వెళ్లిపోతాయి. కాబట్టి ప్రతి రోజూ ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల హైడ్రేట్‌గా ఉండొచ్చు. అదే విధంగా వేసవిలో కూరగాయలు పండ్లు కూడా ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.
తరచూ ఫేస్‌వాష్ చేయడం
సెన్సిటివ్ స్కిన్ వాళ్లు వేసవికాలంలో ముఖాన్ని ఒకసారి కంటే ఎక్కువ సార్లు కడుక్కోవడం కూడా మంచిదే. కాలుష్యం కారణంగా చర్మానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు కాలుష్యం మొదలైన వంటి వాటి వల్ల కలిగే ఇబ్బందులు తొలగించుకోవడానికి ముఖాన్ని తరచూ కడుక్కుంటూ ఉండండి అలానే మీరు ఎక్కువ కెమికల్స్‌ను ఉపయోగించవద్దు. కెమికల్స్ ఉండే వాటిని ఎక్కువగా వాడడం వల్ల ఎలర్జీలు వంటి సమస్యలు కలుగుతాయి. అదే విధంగా హార్ష్ స్క్రబ్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఇది కూడా చాలా ముఖ్యం. కాబట్టి తప్పని సరిగా వీటిని కూడా ఫాలో అవుతూ ఉండండి.
వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్‌ని వాడడం :
మీరు మాయిశ్చరైజర్లు ఉపయోగించేటప్పుడు వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి. చర్మానికి వేసవి కాలంలో ఇది చక్కటి ప్రయోజనం ఇస్తుంది ఇలా ఈ విధంగా సెన్సిటివ్ స్కిన్ వాళ్లు ఫాలో అయితే చర్మం పగిలి పోకుండా ఉంటుంది. అలాగే చర్మానికి ఎటువంటి ఇబ్బందులు కలగవు. అదే విధంగా మీరు వేసవి కాలంలో వీలైనంత వరకు నీడనే ఉండండి. ఏవైనా పనులు ఉంటే చల్ల బాటు వేళల్లో చేసుకోండి. అంతే కానీ అనవసరంగా ఎండలో శ్రమ పడకండి. ఇలా ఈ విధంగా ఈ చిట్కాలను కనుక సెన్సిటివ్ స్కిన్ వాళ్లు వేసవి కాలంలో అనుసరించారు అంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు అలానే మీ అందం కూడా తరిగిపోదు. స్కిన్‌కి ఎలాంటి సమస్యలు కూడా వుండవు.