Monday, May 20, 2024
Homeనేషనల్Sanitary Pads : శానిటరీ పాడ్స్ వాడే మహిళలకు షాకింగ్ న్యూస్.. ఇన్ని అనర్థాలున్నాయా ?

Sanitary Pads : శానిటరీ పాడ్స్ వాడే మహిళలకు షాకింగ్ న్యూస్.. ఇన్ని అనర్థాలున్నాయా ?

శానిటరీ పాడ్స్.. ఈ రోజుల్లో ప్రతి మహిళ వీటినే వాడుతున్నారు. అవసరానికి ఉపయోగించే ఈ పాడ్స్ వల్ల మహిళలకు హాని ఉందని టాక్సిక్ లింక్ ప్రస్తావించింది. వాటిని తయారు చేస్తున్న కంపెనీలు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపించింది. థాలేట్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనే రెండు రకాల కెమికల్స్ గురించి తెలుసుకునేందుకు ఢిల్లీకి చెందిన టాక్సిక్ లింక్ అనే స్వచ్ఛంద సంస్థ లోతైన అధ్యయనం చేసింది. ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో వాడే థాలేట్స్ ను శానిటరీ పాడ్స్ తయారీలోనూ వాడుతున్నట్లు టాక్సిక్ లింక్ తన అధ్యయన నివేదికలో పేర్కొంది. సాగేగుణం కోసం శానిటరీ నాప్ కిన్స్ తయారీలో థాలేట్స్ ను వినియోగిస్తున్నారు.

- Advertisement -

ప్లాస్టిసైజర్స్ వల్ల ఉత్పత్తులు సాఫ్ట్ గా, సాగే గుణంతో ఉంటాయి. పది రకాల శానిటరీ ప్యాడ్స్ పై పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు. వాటిలో ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ పేరుతో ఉన్నవి కూడా ఉన్నాయి. ప్రతీ ఉత్పత్తిలోనూ థాలేట్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయని పరిశోధకుల పరీక్షలో నిర్థారణ అయింది. ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 2 బ్రాండ్స్ లో ఆరు రకాల థాలేట్స్ ఉంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటి వలన ఎండోమెట్రియోసిస్, గర్భధారణ సంబంధిత సమస్యలు, గర్భంలో శిశువు ఎదుగుదలపై ప్రభావం, ఇన్సులిన్ నిరోధకత, హైపర్ టెన్షన్ తదితర సమస్యలకు కారణమవుతాయని సూచిస్తున్నారు. ఇండియన్ శ్యానిటరీ న్యాప్కిన్స్ మార్కెట్ 2021 నాటికే 618.4 మిలియన్స్ డాలర్స్ దాటింది. 2027కల్లా ఇది 1.2 బిలియన్ డాలర్స్ కు చేరుతుందని అంచనా. మరి తాజా అధ్యయనంలో వెల్లడైన ఈ విషయాలు మహిళలను మళ్లీ సంప్రదాయ నాప్కిన్స్ వాడేలా చేస్తుందని పలువురి అభిప్రాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News