Saturday, October 5, 2024
Homeహెల్త్Sexual health specialist: సెక్సువల్ స్టిగ్మాకు చెక్ పెట్టే డాక్టర్ క్యుటరస్

Sexual health specialist: సెక్సువల్ స్టిగ్మాకు చెక్ పెట్టే డాక్టర్ క్యుటరస్

సోషల్ మీడియాకు ఆమె డాక్టర్ ‘క్యుటరస్’. లైంగిక ఆరోగ్యం, పునరుత్పత్తి అంశాలపై ఆమె స్త్రీలలో తెస్తున్న చైతన్యం ఎంతో. స్త్రీలు తమ శరీరాలను ప్రేమించాలంటారామె. ప్రజారోగ్య సాధన ఆమె జీవిత లక్ష్యం. ఆమే డాక్టర్ తనయ నరేందర్. ఆమె గురించి…

- Advertisement -

డాక్టర్ తనయా నరేంద్ర స్త్రీ వైద్య నిపుణురాలు. సెక్సువల్ హెల్త్ ఎడ్యుకేటర్. డాక్టర్ క్యుటరస్ గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్. శరీరానికి సంబంధించి ఎలాంటి టాబూస్ ఉండకూడదని గట్టిగా నమ్ముతారు తనయా. వైద్య విద్యను విపరీతంగా ప్రేమించే తనయ ఆడవాళ్లు తమ శరీరాలను గురించి సిగ్గుగా ఫీలవడాన్ని తప్పుపడతారు. ఆ దిశగా తన పేషంట్లే కాదు సోషల్ మీడియాలోని తన ఫాలోయర్స్ కూడా ఆలోచించేలా చైతన్యపరుస్తుంటారు. వైద్యశాస్త్రం అంటే ఆమెకు ఎంతో ఇష్టం.

వైద్య సంబంధమైన అంశాలపై అధ్యయనాలు చేయడంలో అంతులేని కుతూహలం ఆమెది. ప్రజారోగ్యం పట్ల కూడా ఆమెకుండే ఆసక్తి ఎంతో. లైంగిక, బహిష్టు, పునరుత్పత్తి అంశాలపై అంతర్జాలంలో, సోషల్ మీడియాలో ఎక్కువగా ఆమె చర్చిస్తుంటారు. సెక్సు గురించి బహిరంగంగా మాట్లాడితే వచ్చే ట్రోల్స్, దాడులు ఆమెకు అనుభవమే. అలాంటి వాటిని అస్సలు పట్టించుకోనంటారు డాక్టర్ తనయ. శరీరం గురించి మాట్లాడితే ఆ వ్యక్తుల నైతికతను, వ్యక్తిత్వాలను ప్రశ్నిస్తుంటారని, వాటిని తను అస్సలు లెక్కచేయనని అంటారు. సెక్సు ఎడ్యుకేషన్ తన కిష్టమైన విషయమని, తను ఎంతో ప్రేమించే అంశంపై పనిచేయగలగడం తనకెంతో ఆనందాన్ని ఇస్తోందని చెప్తారు. సోషల్ మీడియా ద్వారా ఎందరో వ్యక్తులకు దగ్గర అవడం తనకు ఎంతో సంతోషాన్ని పంచుతోందని, అందులోనూ సెక్సు పరంగా స్త్రీలలో ఉన్న స్టిగ్మాను పోగొట్టగలుగుతుండడం తనకెంతో సంత్రుప్తిని ఇస్తోందని అంటారు. ఆడవాళ్లు తమ శరీరం గురించి నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడాలి అనే డాక్టర్ తనయ చదివింది గైనకాలజీ.

ఆమె స్పెషలైజేషన్ సెక్సువల్ మెడిసెన్. గర్భాశయం మానవాళికి ఎంతో ముఖ్యమైన శరీరభాగమం టారామె. బాడీ లిటరసీ, ఫెర్టిలిటీ ఎడ్యుకేషన్ పై త్వరలో పుస్తకాన్ని కూడా డాక్టర్ తనయ తీసుకురానున్నారు. హ్యూమన్ సెక్సువాలిటీ, రిప్రొడక్షన్ హెల్త్ ఆమెకి ఎంతో ఇష్టమైన సబ్జక్టులు. రిప్రొడక్షన్, ఫెర్టిలైజేషన్ సైంటిఫిక్ ప్రయోగాలలో, అధ్యయనాల్లో కూడా డాక్టర్ తనయ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికి కూడా మనదేశంలో కనీస లైంగిక చైతన్యం (సెక్సు ఎడ్యుకేషన్), అవగాహన ప్రజల్లో కొరవడడాన్ని డాక్టర్ తనయ తరచూ ప్రస్తావిస్తారు. డాక్టర్ క్యుటరస్ (క్యూట్ యుటరస్ అర్థంలోవాడినది)గా పేరున్న డాక్టర్ తనయ నరేంద్ర లైంగిక అంశాలు, జననేంద్రియాల గురించి ఉన్న అపోహలను సామాన్యులకు సైతం అర్థమయ్యే భాషలో వివరిస్తూ లైంగికపరమైన చైతన్యాన్ని ముఖ్యంగా యువతలో పెంచుతున్నారు. పోస్టులను, వీడియోలను సోషల్ మీడియాలో పెడుతుంటారు. సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోయర్స్ ఆమెకు ఉన్నారు.

ఫెయిరీ టేల్స్, జిఫ్స్, బొమ్మలు వంటివి ఉపయోగిస్తూ ప్రజలను లైంగిక ఆరోగ్యంపై ఎడ్యుకేట్ చేస్తున్నారు. సైంటిఫిక్ గా క్లిష్టమైన వైద్య అంశాలను, లైంగిక అంశాలను అందరికీ అర్థమయ్యేలా సరళంగా చెప్పగలగడం డాక్టర్ తనయ ప్రత్యేకత. జండర్ న్యూట్రల్ స్పిరిట్ కూడా ఆమెలో అడుగడుతునా కనిపించడం మరో విశేషం . ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టరు పట్టా తీసుకున్న ఈ యువ డాక్టరు ఇన్స్టా గ్రాములో లైంగిక అంశాలను చర్చిస్తుంటారు. బహిష్టు పరంగా ఉన్న అపోహలపై పోస్టులు పెడతారు. అంతేకాదు సెక్సు పరమైన ఇంటిమేట్ విషయాలను సైతం చర్చిస్తారు.

సెక్సు పరమైన అంశాలను సోషల్ మీడియాలో బహిరంగంగా చర్చించడం అంటే చాలా ధైర్యం చేసినట్టే. కారణం లైంగిక అంశాలను బహిరంగంగా రాస్తే ఇంట్లో పెద్దవాళ్లు చదివితే ఏమైనా ఉందా అనే భయం మన సమాజంలో చాలా ఉంది. లైంగికపరమైన అంశాల గురించి తప్పుడు సమాచారం ఆన్ లైన్లో ఎక్కువగా ఉండడం చూసే సోషల్ మీడియాలో సెక్సు ఎడ్యుకేషన్ కు పూనుకున్నానంటారు డాక్టర్ తనయ. ఓరల్ సెక్స్, ఏనల్ సెక్స్, టాయ్స్, పీరియడ్ సెక్స్ పై , అలాగే మొదటిసారి సెక్సు చేసేవారు తమ అనుమానాల గురించి ఇలా ఎన్నో లైంగిక అంశాలపై డాక్టరు తనయను ప్రశ్నిస్తుంటారు.

ఉద్యోగం చేస్తూనే మధ్యలో దొరికిన సమయంలో సెక్సు ఎడ్యుకేషన్ కు సంబంధించిన మెటీరియల్ ని డాక్టర్ తనయ తయారుచేస్తుంటారు. ఈమధ్య కాలంలో స్త్రీలు తమ లైంగిక ఆరోగ్యంపై బాగా ఫోకస్ చేస్తున్నారు. ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. స్త్రీలలో కనిపించినంత ఎక్కువగా ఈ ధోరణి మగవాళ్లల్లో లేదని డాక్టర్ తనయ అంటారు.

డాక్టర్ తనయ అంతర్జాతీయంగా శిక్షణ పొందిన స్త్రీవైద్య నిపుణురాలు. రచయిత, ఎంబ్రాలజిస్టు, సైటిస్టు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో మెడిసెన్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. పబ్లిక్ మెడికల్ ఎడ్యుకేషన్ ని ఆమె తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. డాక్టర్ తనయ ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ఎలక్టెడ్ ఫెలో కూడా. మెడికల్ ఎడ్యుకేషన్ లో ఆమె చేస్తున్న విశేష క్రుషికి గాను సెక్సువల్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డును 2020 సంవత్సరంలో పొందారు. కాస్మొపాలిటన్ మేగజైన్ వారి టాప్ 25 డిజ్ రప్టర్స్ ఆఫ్ ఇండియా 2021 వంటి ఎన్నో అవార్డులనూ డాక్టర్ తనయ పొందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News