Wednesday, June 11, 2025
Homeహెల్త్Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఏమవుతుంది.. నిపుణులు ఏమంటున్నారంటే..?

Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఏమవుతుంది.. నిపుణులు ఏమంటున్నారంటే..?

జ్వరం వచ్చినప్పుడు చాలా మందిని ఒకే ప్రశ్న వేదిస్తుంటుంది. “ఇప్పుడు స్నానం చేయాలా.. వద్దా. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 98.6°F (37°C) ఉండాలి. కానీ అది 100°F లేదా అంతకంటే ఎక్కువైతే జ్వరం అని పరిగణించబడుతుంది. అప్పుడు శరీరం బలహీనంగా మారుతుంది, చలికి శరీరం వణుకుతుంది, తలనొప్పి వస్తుంది.

- Advertisement -

అయితే జ్వరం తగ్గించేందుకు మందులు ఉపయోగించినా.. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే ఇదే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు నేరుగా స్నానం చేయడం వల్ల శరీరంపై ఒత్తిడి పడవచ్చు. ముఖ్యంగా చలి ఎక్కువగా అనిపిస్తే గోరువెచ్చని నీటితో తడిపిన గుడ్డతో శరీరాన్ని తుడవడం ఉత్తమం.

మధ్యస్థ స్థాయిలో జ్వరం ఉన్నవారు, శరీర బలం ఉన్నవారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. ఇది చెమట, ధూళి, బ్యాక్టీరియా వంటి వాటిని తొలగించడంతో పాటు తలనొప్పి, చప్పుళ్లు తగ్గించడంలో సాయపడుతుంది. విశ్రాంతి అవసరమైన జ్వర దశలో శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అవసరం కానీ ఒత్తిడి పెంచే చర్యలు తీసుకోరాదు.

ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు లేదా తీవ్రమైన జ్వరం ఉన్నవారు స్నానం చేయడం కన్నా గోరువెచ్చని నీటితో శరీరాన్ని తుడవడం మెరుగైన ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయాలా లేదా అనే నిర్ణయం తీసుకోవాలంటే శరీర పరిస్థితిని అంచనా వేయాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News