Side effects of eating an apple: “రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు” అనే సామెతను చాలామంది నమ్ముతారు. నిజంగా ఆపిల్‌లో ఉండే విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. అయితే, యాపిల్ తినేటప్పుడు అందులోని గింజల విషయాన్ని చాలామంది పట్టించుకోరు. కొందరు వాటిని తినేస్తూ ఉంటారు కూడా. అయితే, తాజా పరిశోధనలు గింజల వినియోగంపై హెచ్చరికలు జారీ చేశాయి.
గింజల్లోని ప్రమాదకర రసాయనం
యాపిల్ విత్తనాల్లో అమిగ్డాలిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్లిన తర్వాత హైడ్రోజన్ సైనైడ్‌గా మారుస్తుంది. హైడ్రోజన్ సైనైడ్ విషతుల్యం.. ఇది మన శరీరంలోని కణాలకు ఆక్సిజన్ చేరకుండా అడ్డుకుంటుంది. తలనొప్పి, గందరగోళం, అలసట వంటి లక్షణాలు స్వల్ప మోతాదులో కనిపించవచ్చు. కానీ ఎక్కువగా తీసుకుంటే తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. ఈ అమిగ్డాలిన్ అనే పదార్థం ముఖ్యంగా రోసేసి (Rosaceae) కుటుంబానికి చెందిన పండ్ల గింజల్లో ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఆపిల్, బాదం, ఆప్రికాట్, పీచ్, చెర్రీ వంటి పండ్లు ఉన్నాయి. ఇవి ఒకే కుటుంబానికి చెందినవిగా పరిగణించబడతాయి.
ఏమేం సమస్యలు తలెత్తొచ్చు?
గింజల వల్ల శరీరంలో సైనైడ్ మోతాదు పెరిగితే.. అధిక రక్తపోటు, వంటి సమస్యలను తలెత్తవచ్చు.
గుండె సంబంధిత సమస్యలు
మూర్ఛ వంటి తీవ్రమైన పరిస్థితుల్లో కోమా లేదా మరణం కూడా సంభవించవచ్చు. అయితే, శాస్త్రవేత్తల ప్రకారం ఒక్కో ఆపిల్ గింజలో సుమారు 0.6 మిల్లీగ్రామ్ హైడ్రోజన్ సైనైడ్ ఉండే అవకాశముంది. సగటున 80 నుంచి 500 గింజలు తినితే ఒక మనిషికి ప్రాణాపాయం కలగొచ్చని అంచనా. 2015లో నిర్వహించిన ఓ పరిశోధన ఆధారంగా శాస్త్రవేత్తలు స్పష్టం చేసిన అంశాలు ఇవే. యాపిల్ తినే ముందు గింజలను తొలగించడం మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలకు గింజలు తీసిన తర్వాతే యాపిల్ తినిపించాలి. యాపిల్ జ్యూస్ తయారీలో గింజలు తొలగించి వాడటం మంచిది. ఆపిల్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, దాని గింజలు అదే స్థాయిలో ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. అలవాటుగా గింజలతో పాటు ఆపిల్ తినేవారు వెంటనే అలాంటి ప్రవర్తనను మానుకోవడం ఉత్తమం. ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న విషయాలకూ ప్రాధాన్యత ఇవ్వాలి.


