Friday, November 22, 2024
Homeహెల్త్Sip Tea: టీ సిప్ చేస్తే మెరుపు వస్తుంది !

Sip Tea: టీ సిప్ చేస్తే మెరుపు వస్తుంది !

టీ మీ చర్మాన్ని మెరిపిస్తుంది. రోజుకు ఒకటి రెండుసార్లు టీ తాగితే ఫ్రీరాడికల్స్ పోయి చర్మం సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు టీలో యాంటీ ఏజింగ్ సుగుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. టీ చర్మాన్ని మ్రుదువుగా చేస్తుంది. టీలోని యాంటాక్సిండెంట్ల వల్ల చర్మం కాంతివంతమవుతుంది. ముఖంపై ఏర్పడ్డ స్ట్రెస్ లైన్స్ పోతాయి. చర్మం పట్టులా మెరుస్తుంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల ఫ్రీరాడికల్స్ తో చర్మానికి ప్రమాదం పొంచి ఉంది. ఫలితంగా చర్మం కాంతివిహీనం అవడంతో పాటు ముఖంపై ముడతలు ఏర్పడతాయి కూడా.

- Advertisement -

అయితే టీలోని యాంటీ ఏజింగ్ సుగుణాల వల్ల చర్మం యంగ్ గా కనిపిస్తుంది. అంతేకాదు వయసు మీద పడ్డ లక్షణాలు శరీరంపై కనిపించకుండా టీ నిరోధిస్తుంది. గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మంచిది. ఇందులో యాంటిఇన్ఫ్లమేటరీ సుగుణాలు ఎక్కువ ఉన్నాయి. అట్టగట్టినట్టు ఉన్నచర్మానికి గ్రీన్ టీ కావలసినంత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. సన్ బర్న్స్ నుంచి సాంత్వననిస్తుంది. చర్మంపై ఇరిటేషన్ ని, బర్నింగ్ సెన్సేషన్ ని, వాపును, బ్రేక్ అవుట్స్ ను తగ్గిస్తుంది.

ముఖానికి గ్రీన్ టీ రాసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయని చర్మనిపుణులు కూడా చెప్తున్నారు. చర్మంపై ఏర్పడ్డ చిన్న చిన్న గాయాలను ఈ టీ తగ్గిస్తుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకుంటున్నవాళ్లు దీన్ని నిత్యం తాగితే సత్ఫలితాలు చూస్తారు. గ్రీన్ టీ, లెమన్ గ్రాస్ రెండూ చర్మానికి ఎంతో మంచివి. లెమన్ గ్రాస్ లో చర్మాన్ని శుభ్రపరిచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

పలు స్కిన్ కేర్ ప్రాడక్టుల్లో సైతం లెమన్ గ్రాసు వాడకం కనిపిస్తుంది. లెమన్ గ్రాస్ లో యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు బాగా ఉండడమే ఇందుకు కారణం. బ్లాక్ టీ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని పోలీఫినాల్స్, యాంటాక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఇతర టీలతో పోలిస్తే చర్మంపై ఏర్పడ్డ ముడతలు పోగొట్టడంలో బ్లాక్ టీ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని పలు శాస్త్రీయ అధ్యయనాల్లో కూడా తేలింది. బ్లాక్ టీలోని చర్మాన్ని శుభ్రపరిచే గుణాలు ఉన్నాయి. యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. మలినాల వల్ల చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను ఇవి పోగొడతాయి. బ్లాక్ టీని చల్లార్చి దానిలో కాటన్ బాల్ ముంచి చర్మంపై నేరుగా అప్లై చేసుకోవచ్చు. చర్మంపై మంచిఫలితాలు కనిపిస్తాయి.

చర్మంపై వండర్స్ స్రుష్టించే మరో టీ ఉంది. అదే ఆమ్లా హెర్బల్ టీ. ఆమ్లా రసంలో విటమిన్ సి బాగా ఉంటుంది. దీన్ని నిత్యం తాగడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ను పెరుగుతుంది. దీంతో చర్మం యంగ్ గా, పట్టులా మెరుస్తూ కనిపిస్తుంది. ఆమ్లాతో చేసిన టీ తాగడం వల్ల యాక్నే మచ్చలు, ముడతలు, చర్మం పొట్టురాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు యాక్నే తీవ్రత నుంచి ఇది సాంత్వన నిస్తుంది.

లవండర్ టీ కూడా ఎంతో మంచిది. ఇందులో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండి స్కిన్ డిటాక్సిఫికేషన్ చేస్తుంది. అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై తలెత్తే మొటిమలు తలెత్తకకుండా ఇది నిరోధిస్తుంది. అంతేకాదు లవండర్ టీలో చర్మాన్ని కూలింగ్ చేసే గుణాలు బాగా ఉన్నాయి. రకరకాల చర్మవ్యాధులు తలెత్తకకుండా కూడా ఈ టీ అడ్డుకుంటుంది. అల్లం, పసుపు తో చేసిన టీ కూడా చర్మానికి ఎంతో మంచిది. ఇందులోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు, పసుపులోని కుర్కుమిన్ చర్మానికి ఎంతో సాంత్వననిస్తాయి.

ఏలకుల టీ కూడా చర్మానికి మంచిది. ఇందులో సహజసిద్ధంగా చర్మాన్ని శుభ్రం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల ముఖం శుభ్రంగా ఉండడమే కాదు ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. ఇందులో విటమిన్ సి, కాల్షియం, మాంగనీసు ఉండడం వల్ల యాంటీఏజింగ్ ఏజెంటుగా కూడా ఏలకుల టీ పనిచేస్తుంది.

అందుకే మీ రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ లో పైన చెప్పిన రకరకాల టీలను తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పైగా ఈ టీలు తయారుచేసుకోవడం కూడా చిటికెలో పని. మరి ఆలస్యం ఎందుకు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News