Friday, November 22, 2024
Homeహెల్త్Skin care: వేసవిలో చర్మం ఇలా సురక్షితం

Skin care: వేసవిలో చర్మం ఇలా సురక్షితం

వేసవి వచ్చేసింది. దాంతోపాటు సూర్యుని తాపం కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సూర్య కిరణాల ప్రభావం చర్మంపై దుష్ప్రభావం చూపుతుంది. తీవ్ర చమట సమస్యతో కూడా బాధపడతాం. చర్మ రంధ్రాలు పెద్దవై పలు సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా దుమ్ముధూళితో, వేడి ప్రభావంతో చర్మం దెబ్బతింటుంది. అందుకే వేసవిలో చర్మం దెబ్బతినకుండా ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేమిటంటే..

- Advertisement -


 సంవత్సరం పొడుగుతా సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. అందులోనూ వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా చర్మానికి దీన్ని అప్లై చేసుకోవాలి. సూర్యునిలోని అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని దెబ్బతీయడమే కాదు చర్మం మ్రుదుత్వాన్ని కోల్పోయి చేసి తొందరగా వయసు మీద పడినట్టు కనిపిస్తాం. దాంతోపాటు ట్యానింగ్ సమస్య కూడా తలెత్తుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ సమస్య వేధిస్తుంది.ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎస్ పిఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ ను చర్మానికి రాసుకోవాలి. బయటకు వెళ్లే పదిహేను నిమిషాల ముందు సన్ స్ర్కీన్ శరీరానికి , ముఖానికి రాసుకుంటే మంచిది. అలాగే రోజులో దీన్ని తరచూ చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. అందుకే రోజులో రెండు మూడు గంటలకు ఒకసారి ముఖానికి, శరీరానికి సన్ స్క్రీన్ రాసుకోవాలని చర్మనిపుణులు సూచిస్తున్నారు. టచ్ అప్ లు సులువుగా చేసుకోవడానికి, మేకప్ సమయంలోను సన్ స్ర్కీన్ స్టిక్ బాగా ఉపయోగపడుతుంది.


 వేసవిలో లైటర్ స్కిన్ కేర్ రొటీన్ అనుసరిస్తే మంచిది. సింపుల్ క్లీన్సింగ్, మాయిశ్చరైజింగ్ పద్ధతులను అనుసరించాలి. ఇలా చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉండడంతోపాటు మెరుపును సంతరించుకుంటుంది. మేకప్ విషయంలో హెవీ ఫౌండేషన్ వంటివి చేసుకోకుండా జంటిల్ స్కిన్ కేర్ ను కొనసాగిస్తేనే మంచిది. సమస్యలున్న ప్రదేశంపై కన్సీలర్ వాడితే మంచిది. అలాగే చర్మాన్ని సురక్షితంగా ఉంచే బ్యూటీ ఉత్పత్తులను చర్మనిపుణుల సలహాతో ఎంపిక చేసుకుని వాడాలి.

 చలికాలంలో లాగే వేసవికాలంలో కూడా నిత్యం చర్మానికి మాయిశ్చరైజింగ్ వాడాలి. చర్మం మెరుస్తూ, పట్టులా ఉండాలంటే హైడ్రేషన్ తప్పనిసరిగా కావాలి. క్లీన్సర్, టోనర్ కు సరిపడే తేలికపాటి మాయిశ్చరైజర్ ని వాడాలి.

 అలాగే చర్మంలోని సహజసిద్ధ నూనెలను పోగొట్టని చర్మ ఉత్పత్తులు వాడాలి. చర్మంలో ఉండే సహజసిద్ధమైన ఆయిల్స్ లోపించడం వల్ల చర్మం దెబ్బతింటుంది. గాఢమైన సబ్బుతో ఒళ్లు రుద్దుకోవడం వల్ల చర్మంలోని మాయిశ్చరైజింగ్ గుణం కోల్పోతాం. దాంతో చర్మం పొడారినట్ట అయి ఇరిటేషన్ సమస్య తలెత్తుతుంది. గ్లిజరిన్ ఉండే సబ్బులు వాడితే చర్మంలోని మాయిశ్చరైజర్ పోదు.

 చర్మాన్ని వారానికి ఒకసారి తప్పనిసరిగా ఎక్స్ ఫోయిలేట్ చేసుకోవాలి. ఎక్స్ ఫోయిలేషన్ వల్ల చర్మంపై ఉండే మ్రుతకణాలు పోయి చర్మం మ్రుదువుగా అవుతుంది. కాంతివంతంగా ఉంటుంది. అలాగే మీ చర్మ స్వభావానికి అనుగుణమైన ఎక్స్ ఫొయిలెంట్ ను చర్మనిపుణుల సలహాతో వాడాలి. ఎక్స్ ఫొయిలేట్ చేసుకున్న చర్మం పై సూర్యకిరణాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి.

 మీరు తినే ఆహారంలో యాంటాక్సిడెంట్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. యాంటాక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా, పట్టులా ఉంచుతాయి. క్యారట్లు, బెర్రీలు, పాలకూర వంటి వాటిల్లో సహజసిద్ధమైన యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి ఉన్న యాంటాక్సిడెంట్ సిరమ్ కూడా చర్మానికి మంచిది. అయితే దీన్ని వాడేముందు చర్మ నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

 వేసవిలో నీళ్లు బాగా తాగాలి. చర్మానికి ఎంత హైడ్రేషన్ అందితే అంత మంచిది. కనీసం రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసులు నీళ్లు తాగాలి. ఇలా చేస్తే శరీరం లోపలి కంటా హైడ్రేషన్ పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పుచ్చకాయ, కీరకాయ వంటి నీరు బాగా ఉన్న పండ్లు తినాలి. అలాగే నిత్యం వ్యాయామాలు చేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News