Saturday, November 23, 2024
Homeహెల్త్Skin tags: పులిపిరులు పర్మినెంట్ గా తీసేయటం ఈజీ

Skin tags: పులిపిరులు పర్మినెంట్ గా తీసేయటం ఈజీ

పుట్టుమచ్చలను కట్ చేయకండి వాటిని సహజంగా తీసేయచ్చు

చర్మంపై స్కిన్ ట్యాగ్స్ ఉంటే ఇలా చేయడి..

- Advertisement -

స్కిన్ ట్యాగ్స్ … ఇవి అన్ని వయసుల వారినీ వేధించే సమస్య. అయితే 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మంపై ఏర్పడే వీటిని పోగొట్టేందుకు ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. ఈ ట్యాగ్స్ చర్మంపై నల్లగా చిన్న సైజులో వస్తాయి. ఇవి నొప్పు ఉండవు. ప్రమాదం కూడా కావు. అయితే ఇవి చూడడానికి బాగుండవు. అందుకే వీటిని తొలగించుకోవాలని చాలామంది భావిస్తుంటారు. ఆక్రోఛోర్డాన్స్ సాధారణంగా అందరికీ తెలిసిన స్కిన్ ట్యగ్స్. ఇవి అరవై ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనపడతాయి. కొన్నిసార్లు చిన్నారుల్లో కూడా ఈ సమస్యను చూస్తాం.

చర్మంపై ఉండే ఇవి కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటాయి. ఇవి సాధారణంగా రొమ్ములు, మెడ పక్కల, చంకల్లో, చర్మం ముడతలపడే ప్రదేశాల్లో, కనురెప్పలపై ఏర్పడుతుంటాయి. ఈ ట్యాగ్స్ ను పోగొట్టే ఇంట్లోనే తయారుచేసుకునే హెర్బల్ రెమిడీలు చాలా ఉన్నాయి. ఇవి తక్కువ ఖర్చుతో అయిపోయేవి. ఎంతో బాగా పనిచేస్తాయి కూడా. స్కిన్ ట్యాగ్స్ ఒకే సైజులో, ఒకేలా ఉండవు. ఇవి చర్మం రంగు లేదా బ్రౌన్ కలర్ లో ఉంటాయి. పులిపిర్లు, స్కిన్ ట్యాగ్స్ దగ్గరగా ఒకేలా ఉంటాయి. వీటిని పోగొట్టే ఇంటి చిట్కాలలో యాపిల్ సిడార్ వెనిగర్ ఒకటి. కొన్ని చుక్కల యాపిల్ సిడార్ వెనిగర్ , కాటన్, స్కాచ్ టేప్ ఇందుకు కావాలి. కొద్ది దూది తీసుకుని దానిపై యాపిల్ సిడార్ వెనిగర్ కొద్దిగా పోయాలి. ఆ దూది ముక్కను స్కిన్ ట్యాగ్ పై పెట్టాలి. ఆ కాటన్ కిందపడకుండా ఉండేందుకు ఒక టేప్ ను దానిపై  అతికించి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వెనిగర్ లో ఉండే ఎసిడిటీ స్కిన్ ట్యాగ్ ను పోయేలా చేస్తుంది.

అరటి పండు తొక్క కూడా స్కిన్ ట్యాగ్ ను పోగొట్టడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ఒక అరటిపండు తొక్కను రెడీ పెట్టుకోవాలి. తొక్కలోని తొక్కలో తెల్లగా ఉండే భాగాన్ని స్కిన్ ట్యాగ్ మీద అతికించి గంట సేపు అలాగే ఉంచాలి. ఆ స్కిన్ ట్యాగ్ పోయేవరకూ కొన్నిరోజుల పాటు అలా చేయాలి. అరటిపండు తొక్క పులిపిర్లను కూడా రాలిపోయేట్టు చేస్తుంది. దీనికి కారణం తొక్కలో ఉన్న ఎంజైములు, యాసిడ్లు. అవి స్కిన్ ట్యాగ్ ను కూడా పోగొడతాయి. ఇంకొక చిట్కా బేకింగ్ సోడా. అరటీస్పూన్ బేకింగ్ సోడా, కొన్ని చుక్కల ఆముదం నూనె తీసుకుని రెండింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును స్కిన్ ట్యాగ్ మీద అప్లై చేసి రెండు గంటల దాకా అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా రెండు నుంచి నాలుగు వారాలు ఆపకుండా చేస్తే మెల్లగా స్కిన్ ట్యాగ్స్ పోతాయి. ఆముదంనూనె, బేకింగ్ సోడాలు స్కిన్ ట్యాగ్స్ ఉన్న ప్రదేశంలోని పిహెచ్ లో మార్పు తెస్తాయి. చర్మంపై ఏర్పడ్డ స్కిన్ ట్యాగ్స్ ను పోగొడతాయి. మనూకా తేనె కూడా స్కిన్ ట్యాగ్స్ పై బాగా పనిచేస్తుంది. మనుకా తేనెను స్కిన్ ట్యాగ్ పై పూసి బ్యాండ్ ఎయిడ్ ను దానిపై అతికించాలి. కొన్ని గంటల పాటు ఆ బ్యాండ్ ఎయిడ్ ను అలాగే ఉంచుకోవాలి. రోజులో రెండు మూడు సార్లు ఇలా చేయాలి. ఇందులో గాయాన్ని మాపే గుణాలు ఉన్నాయి. ఆక్సిజన్ సరఫరాను ఇది నియంత్రిస్తుంది. దాంతో స్కిన్ ట్యాగ్ రాలిపోతుంది.

వెల్లుల్లి కూడా  స్కిన్ ట్యాగ్స్ ను పోగొట్టడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వాటిని మెత్తగా పేస్టులా చేయాలి. దాన్ని స్కిన్ ట్యాగ్ మీద అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. వీటివల్ల స్కిన్ ట్యాగ్స్ వేగంగా ఊడిపోతాయి. ఆ భాగంలో చర్మం కూడా ఎంతో మ్రుదువుగా అవుతుంది.

అల్లం కూడా స్కిన్ ట్యాగ్స్ ను పోగొట్టడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. అల్లం ముక్కలను తరిగిపెట్టుకోవాలి. స్కిన్ ట్యాగ్ పైన, దాని చుట్టూ ఉన్న చర్మాన్ని శుభ్రం చేసి ఆ ప్రదేశం పొడిగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత తరిగి పెట్టిన పచ్చి అల్లం ముక్కను తీసుకుని ఒకటి లేదా రెండు నిమిషాలు స్కిన్ ట్యాగ్ మీద రుద్దాలి. వెంటనే ఆ భాగాన్ని నీళ్లతో కడగొద్దు. అలా చేస్తే అల్లం నుంచి వచ్చే రసం స్కిన్ ట్యాగ్ నుంచి కారిపోయే అవకాశం ఉంది. ఇలా అల్లం ముక్కలను స్కిన్ ట్యాగ్స్ పై రోజుకు ఐదు లేదా ఆరుసార్లు పెట్టి శుభ్రం చేయాలి. అల్లంలో బయోయాక్టివ్ కాంపౌండ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో గాయాన్ని తగ్గించే లక్షణాలు బాగా ఉన్నాయి. అంతేకాదు యాంటీ మైక్రోబయల్ సుగుణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కిన్ ట్యాగ్స్ ను పోగొట్టేలా చేస్తాయి. ఇంకొక చిట్కా ఏమిటంటే ఆముదం నూనె కూడా స్కిన్ ట్యాగ్స్ ను పోగొడుతుంది. ఒకటి లేదా రెండు చుక్కల ఆముదం నూనె తీసకుని వాటిని స్కిన్ ట్యాగ్ పై పూసి బ్యాండేజ్ తో దాన్ని కవర్ చేయాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచి ఫలితం  ఉంటుంది.

ఆముదం నూనెలో ఫైటో కెమికల్స్ ఉన్నాయి. ఇవి పులిపిర్లు, పుట్టుమచ్చలు, స్కిన్ ట్యాగ్స్ ను రాలిపోయేట్టు చేస్తాయి. అలాగే ఆముదంలో గాయాన్ని తొందరగా మాన్పే గుణాలు కూడా ఉన్నాయి. ఆముదం నూనె చర్మానికి కావలసినంత హైడ్రేషన్, మాయిశ్చరైజర్లను కూడా అందిస్తుంది. స్కిన్ ట్యాగ్స్ పై ఆర్గానిక్ కొబ్బరినూనెను రాసి అలాగే వదిలేయాలి. కొబ్బరినూనెలో లారిక్ యాసిడ్, ఆల్ఫా టొకోఫెరోల్ అనేవి ఉంటాయి. ఇవి స్కిన్ ట్యాగ్స్ ను కొన్ని వారాల్లో పోగొడతాయి. అలాగే టీ ట్రీ ఆయిల్ కూడా స్కిన్ ట్యాగ్స్ ను పోగొడతాయి. ఒకటి లేదా రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ , ఒకటి లేదా రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా అవకెడో ఆయిల్ లేదా కొబ్బరినూనె రెడీగా ఉంచుకోవాలి. టీ ట్రీ ఆయిల్ ని కారియర్ ఆయిల్ కొబ్బరినూనెతో కలిపి పలచన చేసి స్కిన్ ట్యాగ్ పై పూయాలి.  ఇలా స్కిన్ ట్యాగ్స్ రాలిపోయేదాకా రోజుకు రెండు లేదా మూడుసార్లు చేయాలి. టీ ట్రీ ఆయిల్ స్కిన్ ట్యాగ్ ను ఎండిపోయేలా చేసి తొందరగా రాలిపోయేలా చేస్తుంది. ఈ ఆయిల్ యాంటీమైరోబియల్ స్వభావం కలది. ఇది ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఒకసారి స్కిన్ ట్యాగ్ రాలిపోయిన తర్వాత ఆ ప్రదేశంలోని చర్మం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది కూడా.

జజోబా ఆయిల్ కూడా స్కిన్ ట్యాగ్స్ మీద బాగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు చుక్కల జజోబా ఆయిల్ ని స్కిన్ ట్యాగ్ మీద రాసి దానిపై, దాని చుట్టుపట్ల ఉన్న చర్మంపై మసాజ్ చేసి ఆ ప్రాంతాన్నినీళ్లతో కడక్కుండా అలాగే వదిలేయాలి. పగలు, రాత్రి నిద్రపోవడానికి ముందు దీన్ని రాసుకోవాలి. లవండర్ ఆయిల్ కూడా స్కిన్ ట్యాగ్స్ ను రాలిపోయేలా చేస్తాయి. ఒక చుక్క లవండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఒకటి లేదా రెండు చుక్కల కొబ్బరినూనె రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని స్కిన్ ట్యాగ్స్ పై పూయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం  కనిపిస్తుంది. అలాగే ఒకటి లేదా రెండు చుక్కల లెమన్ ఆయిల్ ని స్కిన్ ట్యాగ్స్ మీద పూసి అలాగే వదిలేయాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒకటి లేదా రెండు  చుక్కల వేపనూనె తీసుకుని దాన్ని స్కిన్ ట్యాగ్ మీద రాసి బ్యాండేజ్ తో కవర్ చేస్తే కూడా అవి పోతాయి. పిప్పర్ మెంట్ ఆయిల్, బాదం ఆయిల్, దాల్చిన చెక్క ఆయిల్ వంటివి కూడా స్కిన్ ట్యాగ్స్ ను పోగొడతాయి. అనాస, నిమ్మ,  అత్తిపండు, అలొవిరా, ఉల్లి జ్యూసులు , షియా బటర్ వంటివి కూడా స్కిన్ ట్యాగ్స్ ను పోగొడతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News