Friday, November 22, 2024
Homeహెల్త్skin tightening: యాంటీ-ఏజింగ్ కొబ్బరినూనె మాస్క్

skin tightening: యాంటీ-ఏజింగ్ కొబ్బరినూనె మాస్క్

మన ఇళ్లలో కొబ్బరి నూనె తప్పకుండా ఉంటుంది, దాంతో మీరు చర్మాన్ని కాపాడుకోండి

చర్మాన్ని బిగుతుగా చేసే కొబ్బరినూనె మాస్కులు…
మీ చర్మం బిగువుగా లేదా? అయితే ఆందోళన చెందకండి. కొబ్బరినూనెతో చర్మాన్ని బిగువుగా ఉండేలా మలచుకోవచ్చు. చర్మం మ్రుదువుగా, ముడతలు పడకుండా, బిగువుగా ఉండాలంటే ముఖ్యంగా రెండు ప్రొటీన్లు కీలకంగా పనిచేస్తాయి. అవే కొల్లాజెన్, ఎలాస్టిన్లు. ఈ రెండు ప్రొటీన్లు బాగా తక్కువగా ఉన్నప్పుడు చర్మం దెబ్బతింటుంది. ముడతలు పడుతుంది. బాగా సాగుతుంది. దీంతో చూడడానికి ముసలివాళ్లల్లా కనపడతారు. అతినీలలోహిత కిరణాల వల్ల కొల్లాజెన్, ఎలాస్టిసిటీ రెండూ దెబ్బతింటాయి. ఏజింగ్ ప్రోసెస్
కూడా ఇందుకు కారణం. అలాగే గాలిలోని కొన్ని విషపదార్థాల బారిన పడడము కూడా మరో ప్రధాన కారణం. చర్మం బిగువుగా ఉంచేలా కొన్ని వంటింటి మాస్కులు బాగా పనిచేస్తాయి. అందులో భాగంగానే
చర్మం బిగువుగా ఉండేందుకు కొబ్బరినూనెను రకరకాల వంటింటి పదార్థాలతో కలిపి మాస్కులుగా తయారుచేసి వాడొచ్చు.
కొబ్బరినూనెలో శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి. చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ ను ఇవి పోగొడతాయి. అంతేకాదు చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తాయి. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. తద్వారా చర్మం బిగువుగా ఉండేలా సంరక్షిస్తుంది. సూర్యరశ్మి నుంచి విడదలయ్యే అతినీలలోహిత కిరణాల నుంచి సైతం చర్మాన్ని కొబ్బరినూనె రక్షిస్తుంది. అందుకే చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచే పదార్థం కొబ్బరినూనె. కొబ్బరినూనెకు ఎలాంటి రసాయనాలతోనూ పనిలేదు. ఇది సహజసిద్ధమైన ఆయిల్. కొబ్బరినూనెకు ఎలాంటి కెమికల్ యాడిటివ్స్ ను చేర్చాల్సిన అవసరం లేదు. చర్మంపై ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు.

- Advertisement -

చర్మం మ్రుదువుగా ఉండడానికి కూడా కొబ్బరినూనెను వాడతారు. అంతేకాదు మేకప్ రిమూవర్ గా కూడా దీన్ని ఉపయోగిస్తారు. స్కిన్ పరమైన రకరకాల డిజార్డర్లకు కూడా దీన్ని వాడతారు. ఇంకా మరెన్నో ప్రయోజనాలను కొబ్బరినూనె ద్వారా మనం పొందుతున్నాం. ఒక రిపోర్టు ప్రకారం కొబ్బరినూనెలో విటమిన్ ఇ ఉంది. ఇది చర్మాన్ని ఎంతో బాగా మెరుగుపడేట్టు చేస్తుంది. చర్మాన్ని బిగువుగా అయ్యేలా చేయడంలో కొబ్బరినూనె,అలొవిరా మాస్కు బాగా పనిచేస్తుంది. అలొవిరాలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఎలాంటి మచ్చలు అవీ లేకుండా చేస్తుంది. అంతేకాదు ఇందులో విటమిన్ సి కంటెంట్ కూడా పుష్కలంగా ఉంది. ఇది చర్మం ముడతలు పడకుండా అడ్డుకుంటుంది. అలాగే చర్మం సాగకుండా నిరోధిస్తుంది. అందుకే ఈ ప్రయోజనాలన్నింటినీ పొందడానికి అలొవిరా, కొబ్బరినూనె మిశ్రమం చర్మంపై బాగా పనిచేస్తుంది.

ఇందుకోసం రెండు స్పూన్ల కొబ్బరినూనె, అలొవిరా ఆయిల్ ని సిద్ధంగా ఉంచుకోవాలి. రెండు టీస్పూన్ల కొబ్బరినూనె, అలొవిరా ఆయిల్ ను తీసుకుని మిశ్రమం చేయాలి. ఆ మాస్కుని చర్మంపై అప్లై చేసుకోవాలి. దాన్ని కొంతసేపు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. చర్మాన్ని టైట్ చేసే మరో మాస్కు కూడా ఉంది. అదే కొబ్బరినూనె, విటమిన్ ఇ ఆయిల్. కొబ్బరినూనె చర్మాన్ని మ్రుదువుగా చేస్తే, విటమిన్ ఇ కొత్త కణాలను వ్రుద్ధిచేసి చర్మాన్ని బిగువుగా ఉండేలా చేస్తుంది. విటమిన్ ఇ చర్మాన్ని సాగకుండా అడ్డుకుంటుంది. ఇందుకోసం రెండు స్పూన్ల కొబ్బరినూనె, రెండు స్పూన్ల విటమిన్ ఇ
ఆయిల్ తీసుకుని ఈ రెండింటినీ మిశ్రమంలా కలపాలి. ఈ క్రీము చర్మన్ని బిగువుగా చేయడంలో ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అందుకే ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని గంటపాటు అలాగే ఉంచుకుంటే చర్మం లోపలికంటా అది వెడుతుంది. తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కొబ్బరినూనె, ఆర్గాన్ ఆయిల్ కూడా చర్మాన్ని బిగుతుగా చేయడంలో ఎంతో బాగా పనిచేస్తాయి. వీటి మిశ్రమం చర్మంపై ఉండే ముడతలను పోగొడతాయి.

అంతేకాదు వయసు మీదపడుతున్న లక్షణాలు, ఫైన్ లైన్స్ చర్మంపై కనిపించకుండా నిరోధిస్తాయి. కొబ్బరినూనెలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ ఇ లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కొల్లాజెన్ చాలా అవసరం. మరెంతో ముఖ్యం కూడా. ఆర్గాన్ ఆయిల్, కొబ్బరినూనె రెండింటినీ సమానపాళ్లల్లో తీసుకుని బాగా కలపాలి. ఆ క్రీమును ముఖానికి రాసుకోవాలి. కాసేపు అలాగే ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఆల్ట్రావైలెట్ కిరణాల వల్ల దెబ్బతిన్న చర్మాన్ని ఈ మాస్కు సంరక్షిస్తుంది. చర్మాన్ని బిగువుగా ఉండేలా కొబ్బరినూనె, తేనె మాస్కు కూడా బాగా
పనిచేస్తుంది. తేనె చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని సహజసిద్ధంగా అందిస్తుంది. అంతేకాదు తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉంటాయి. అవి చర్మం సాగకుండా, ముడతలు పడకుండా సంరక్షిస్తాయి. అందుకే రెండు స్పూన్ల తేనె, కొబ్బరినూనె సమపాళ్లల్లో తీసుకుని మిశ్రమాంలా కలపాలి. దాన్ని చర్మంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. అలా 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. చర్మం ఎంతో బిగుతుగా తయారయి చూడడానికి యంగ్ గా కనిపిస్తారు.


కొబ్బరినూనె, పసుపు మాస్కు కూడా చర్మాన్ని బిగుతు చేస్తుంది. పసుపులో యాంటాక్సిడెంట్లు బాగా ఉన్నాయి. అందుకే కొద్దిగా పసుపు తీసుకుని అందులో కొబ్బరినూనె వేసి దాన్ని చర్మానికి రాసుకుంటే చర్మం సాగదు. ముడతలు పడదు, ఫైన్ లైన్స్ ముఖంపై ఏర్పడవు. ఈ మిశ్రమం వల్ల కొల్లాజెన్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని బిగువుగా చేయడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ పేస్టును నిర్దిష్టమైన పద్ధతిలో తరచూ ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మం చక్కటి బిగువును సంతరించుకుంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News