పొత్తికడుపు చుట్టూ కొవ్వు చేరిందా? తులసి,అల్లం, తేనె మిశ్రమంతో చేసే డిటాక్స్ డ్రింకు ఈ సమస్యను ఇట్టే తగ్గిస్తుంది. తులసిలో యుజెన్ ఆయిల్ ఉంటుంది. ఇది కీళ్లు, జీర్ణకోశ సమస్యలను బాగా తగ్గిస్తుంది. ఇందులోని యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలే ఇందుకు కారణం. అంతేకాదు తులసి ఆకులో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. అవి శరీరంపై ఫ్రీరాడికల్స్ ప్రభావం చూపకుండా కాపాడతాయి. గ్లాసుడు నీళ్లల్లో ఐదారు తులసి ఆకులు వేసి ఆ నీళ్లను ఉదయం లేచిన వెంటనే తాగితే శరీరానికి అది మంచి డిటాక్స్ డ్రింకుగా పనిచేస్తుందని డైటీషియన్లు కూడా చెప్తున్నారు. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపేస్తుంది. అంతేకాదు జీవక్రియ కూడా బాగా జరిగేలా సహకరిస్తుంది.
ఇది శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను బయటకు పంపడమే కాకుండా కాలరీలను కరిగిస్తుంది కూడా. అల్లంలో జింజొరోల్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ నుంచి శక్తివంతమైన ఎంజైములు ఊరేలా చేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో పోట్లను తగ్గిస్తుంది. జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన్న అదనపు కొవ్వును కరిగించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది.
అల్లం, తులసి నీళ్లు తయారుచేయడం కూడా చాలా సులభం.
ఐదు లేదా ఆరు తాజా తులసి ఆకులు తీసుకోవాలి. ఒక అంగుళం పొడవున్న అల్లం ముక్కను తీసుకోవాలి. అందులో గ్లాసుడు నీళ్లు పోసి అవి సగం అయ్యేదాకా బాగా మరిగించాలి. ఉడికిన తర్వాత ఆ నీళ్లను ఒక గ్లాసులోకి వొడగొట్టి ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.ఈ డ్రింకు మరింత రుచిగా ఉండాలనుకుంటే అందులో కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్లు నిత్యం ఈ తులసి నీళ్లను పరగడుపునే తాగాలి. అదీ మోడరేషన్ ప్రమాణాలలో మాత్రమే తీసుకోవాలి. బరువు వేగంగా తగ్గాలనుకునేవాళ్లు ఈ డ్రింకును నిత్యం తాగాలి.