స్మార్ట్ గా తినటం అలవాటు చేసుకోండి. స్మార్ట్ ఈటింగ్ శరీరారోగ్యానికి ఎంతో మంచిది. మంచి డైటరీ ఛాయిస్ ను ఎంపికచేసుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మీరు కొనే ఆహారం లేదా తీసుకోవాలనుకునే డ్రింకులను కొనేటప్పుడు మొదట ఆ ప్రొడక్టుల లేబుల్స్ లో పేర్కొన్న పదార్థాలేమిటో చూడాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరోగ్యవంతమైన డైట్ అంటే తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తినడం, కొద్ది పరిమాణాల్లోనే తినడం అని మీరు భావిస్తే పొరబడ్డారన్నమాటే. మీరు తినే పదార్థాలు ఏమిటి, వాటిల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయన్నది కూడా చాలా ముఖ్యం.
సరైన పోషకాహారం తీసుకుంటేనే ఎవరైనా ఆరోగ్యవంతమైన జీవనశైలిని గడపగలరు. అయితే అసలు సవాలేమిటంటే ..ఎంత పరిమాణంలో పోషకాలు శరీరానికి అవసరం, మీరు ఎంత తింటున్నారన్నది. ఏవి ఆరోగ్యవంతమైనవి? ఎంత తింటే అది శరీరానికి అతి అవుతుంది వంటి విషయాలను గమనించుకోవాలి. పోషకాహారంలో ఒమేగా 3 తప్పనిసరిగా ఉండాలి. ఇందులో బోలెడు గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
ఆరోగ్యానికి పనికివచ్చే ఎన్నో లాభాలు వీటిల్లో ఉన్నాయి. సరైన పోషకాలను ఆహారంగా తీసుకుంటే గుండెజబ్బుల బారిన పడము. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కూడా బలంగా తయారవుతుంది. మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేసేలా పోషకాలు ఎంతగానో సహకరిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఫుడ్స్ తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ప్రొటీన్లు బాగా తీసుకోవడం వల్ల చిరుతిళ్ల మీద ధ్యాస పోదు. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. మీ శరీరానికి తగ్గ బరువు మాత్రమే ఉంటారు. పైగా పోషకాలు శరీరంలోని టిష్యూలను బాగుచేస్తాయి.
గుడ్లు, చికెన్, పాల ఉత్పత్తులు, కాలిఫోర్నియా వాల్ నట్స్ వంటి వాటిలో ప్రొటీన్లు బాగా ఉంటాయి. చాలామందికి ఆహారం తిన్న తర్వాత స్వీటు తినాలనిపిస్తుంది. పైన చెప్పిన ప్రొటీన్లు తినడం వల్ల ఆ క్రేవింగ్ ఉండదు. అందుకే రోజూ మీరు తీసుకునే డైట్ లో ఇవి ఉండేలా చూసుకోవాలి. రోజులో కొన్ని వేళల్లో ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు చక్కెర, ఉప్పు, ఫ్యాట్ ఉండే స్నాక్స్ జోలికి పోకుండా తాజా పండ్లు, నట్స్, కాయగూరలు తింటే మంచిది. హోల్ గ్రెయిన్ స్నాక్స్ కూడా ఆరోగ్యానికి మంచివి. లేదా గుప్పెడు కాలిఫోర్నియా వాల్ నట్స్ తో పాటు నల్లగా ఉండే ఎండుద్రాక్షను తింటే కడుపు నిండినట్టు ఉంటుంది. క్రేవింగ్ ఉండదు.
అలాగే రోజులో నాలుగైదుసార్లు తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల బరువు పెరగము. కంచంలో పెట్టుకున్న పదార్థాలు వ్రుధా అయిపోతాయని కొందరు అతిగా తినేస్తుంటారు. ఈ అలవాటును పూర్తిగా మానుకోవాలి. అతిగా తింటే ఊబకాయం బారిన పడడమే కాదు మధుమేహం వంటి జీవనశైలి జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.
పరిమితంగా తినడం అంటే అనారోగ్యకరమైన పదార్థాలను కొద్దిగా తినడం కాదు. ఆరోగ్యకరమైన ఫుడ్స్ ను సరైన ప్రమాణాల్లో తినాలని అర్థం. అవసరమైతే కొలత పెట్టుకుని ఆ ప్రకారం తినడం అలవాటు చేసుకోవాలి. మీ కంచంలో సగం ప్రొటీన్ ఫుడ్, ధాన్యాలు, ఇంకోసగం కూరలు ఉండాలి. హెల్దీ డైట్ అంటూ ఒకేసారి చాలా గోల్స్ పెట్టుకోకుండా మెల్లమెల్లగా గుడ్ ఫుడ్ ను తీసుకుంటూ ఆరోగ్యాన్ని, ఫిట్ నెస్ ని పెంచుకోవాలి.