Saturday, November 15, 2025
Homeహెల్త్Childhood obesity: పిల్లల్లో ఉబకాయం సమస్యా.. పరిష్కార మార్గాలివే!

Childhood obesity: పిల్లల్లో ఉబకాయం సమస్యా.. పరిష్కార మార్గాలివే!

- Advertisement -

Childhood obesity problem: ఇటీవల కాలంలో పిల్లల్లో ఊబకాయం అతిపెద్ద సమస్యగా మారింది. జీవనశైలిలో మార్పుల వల్ల శారీరక శ్రమ లేకపోవటం, ఆహారపు అలవాట్లు సమస్య తీవ్రతకు కారణమవుతున్నాయి. ఊబకాయం అధిక శరీర బరువుకు మాత్రమే కాదు శరీరంలోని చెడు కొవ్వుకు సంబంధించిన అంశం. పిల్లల్లో ఈ సమస్య దీర్ఘకాలంలో అనేక వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఊబకాయానికి ప్రధాన కారణాలు:

  • ఒకప్పుడు పిల్లలు ఇంటి బయట, స్కూళ్లలో ఆట స్థలాల్లో ఆడుకునేవారు. పెరిగిన సాంకేతికతతో వచ్చిన టీవీ, వీడియో గేమ్స్, మొబైల్స్, ల్యాప్ టాప్ ల వాడకంతో ఆరుబయట ఆటలు తగ్గిపోయాయి. వ్యాయామం లేకపోవటంతో వారి బరువులో తేడా వస్తుంది.
  • మారిన ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. అధిక కేలరీలు, కొవ్వులు, చక్కెరలు ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్ డ్రింక్స్ వంటివి తీసుకోవటం.. ఇంట్లో వండినవి కాకుండా ఫాస్ట్ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఊబకాయం కలుగుతుంది.
  • పిల్లల్లో నిద్రలేమి సమస్య హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. జన్యుపరమైన కారణల వల్ల కూడా పిల్లలు ఊబకాయం బారిన పడతారు.

అనారోగ్య సమస్యలు: పిల్లల్లో ఊబకాయం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. టైప్-2 డయాబెటిస్,  గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అంతేకాదు.. ఊబకాయులైన పిల్లల్లో మానసికంగానూ సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి, ఆందోళన, ఆత్మవిశ్వాసం తగ్గటం వంటివి చూడవచ్చు.

Also Read:https://teluguprabha.net/health-fitness/breathing-problems-resolved-by-shankha-mudra/

పరిష్కార మార్గాలు: పండ్లు, కూరగాయలు, అధిక ప్రొటీన్ ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. రోజూ శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలి. వయసుని బట్టి రోజూ 8 నుంచి 10 గంటలు నిద్రపోయేలా చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad