Homeహెల్త్Therapy : శ్రావ్యమైన శబ్దంతో స్వస్థత.. ఒత్తిడికి చెక్ పెట్టే 'సౌండ్ హీలింగ్' విశేషాలు

Therapy : శ్రావ్యమైన శబ్దంతో స్వస్థత.. ఒత్తిడికి చెక్ పెట్టే ‘సౌండ్ హీలింగ్’ విశేషాలు

Sound healing therapy for stress relief : ఉరుకుల పరుగుల నేటి జీవనశైలిలో ప్రశాంతత కనుమరుగై, మానసిక ఒత్తిడి పెనుసవాలుగా మారుతోందా? అయితే, మందులతో పనిలేకుండా మనసును కుదుటపరిచే అద్భుత ఔషధం శబ్ద తరంగాల్లోనే దాగుంది. ప్రకృతిలోని పక్షుల కిలకిలా రావాలు, జోరువాన సవ్వడులు నరాల అలసటను తీర్చి సరికొత్త జవజీవాలు నింపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

- Advertisement -

మెదడుపై నాదాల ప్రభావం: మనం వినే శబ్దాలు నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కర్ణకఠోరమైన శబ్దాలు ఆందోళనను రేకెత్తిస్తే, ఆహ్లాదకర నాదాలు మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తాయి. నెక్సస్ టీన్ అకాడమీ పరిశోధనల ప్రకారం, ప్రకృతి నాదాలు మెదడులో ఆల్ఫా, గామా తరంగాలను పెంచి ఏకాగ్రతను, సృజనాత్మకతను ఇనుమడింపజేస్తాయి.

ఒత్తిడి స్థాయిని బట్టి శబ్ద చికిత్స:
సాధారణ చికాకు: ఫ్యాన్ చప్పుడు వంటి ఏకరీతి ధ్వనులు గల ‘వైట్ నాయిస్’ పరిసరాల రొదను కప్పిపుచ్చి పనిలో శ్రద్ధ పెంచుతుంది. వర్షపు చప్పుడు, ఆకుల కదలికలతో కూడిన ‘పింక్ నాయిస్’ హృదయ స్పందనలను క్రమబద్ధీకరించి గాఢనిద్రకు దారితీస్తుంది. జలపాతాల హోరు వంటి ‘బ్రౌన్ నాయిస్’, బైనరల్ బీట్స్ మెదడును ధ్యాన స్థితికి చేరుస్తాయి.

ప్రాచీన వాద్యాలు: మిశ్రమ లోహాలతో రూపొందించే ‘టిబెటన్ సింగింగ్ బౌల్స్’ రుద్దినప్పుడు వెలువడే ఓంకార నాదం మైగ్రేన్, తీవ్ర ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చౌగడ వంటి ప్రాచీన చర్మ వాయిద్య ప్రకంపనలు శరీర చక్రాలను ఉత్తేజపరుస్తాయి.

నిపుణుల హెచ్చరిక: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం శబ్ద తీవ్రత 60 డెసిబెల్స్ మించకూడదు. రోజుకు 20 నుంచి 30 నిమిషాల సాధన శ్రేయస్కరం. హెడ్‌ఫోన్స్‌తో ఈ శబ్దాలు వినే సమయంలో డ్రైవింగ్ చేయడం వంటివి నివారించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News