Star Anise Vs Mansoon:వర్షాకాలం వచ్చిందంటే, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు ఎక్కువగానే ఎదురవుతుంటాయి. ఈ సమయంలో ఇంట్లోని వంటగదిలో దొరికే కొన్ని పదార్థాలే మన ఆరోగ్యాన్ని కాపాడే ఔషధాలుగా మారతాయి. అలాంటి వాటిలో ముందు గుర్తుకు వచ్చేది అనాస పువ్వు. దీన్ని అనేక పేర్లతో పిలుస్తారు స్టార్ అనాస, చక్రపువ్వు అని. చూడటానికి చిన్న నక్షత్రంలా ఉండే ఈ మసాలా పదార్థం రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు చాలా ఉన్నాయి.
చాలామంది దీన్ని బిర్యానీల్లో, పులావ్‌ల్లో వాడతారు. కానీ దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. వర్షాకాలంలో శరీర రోగనిరోధక శక్తిని పెంచే శక్తి దీనిలో ఉంది. ఆయుర్వేదం దానిని ఓ ప్రకృతివైద్యంగా వివరించింది. ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఇందులో ఉన్న శక్తివంతమైన రసాయనాలను గుర్తించి దీన్ని ఒప్పుకుంది.
షికిమిక్ యాసిడ్…
ఈ అనాసపువ్వులో షికిమిక్ యాసిడ్ అనే అంశం ఉంటుంది. ఇది ముఖ్యంగా వైరస్‌లు వ్యాపించే సమయంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది సహాయపడుతుంది. రోజు చక్కగా మరిగించిన టీ లేదా కషాయం తాగేటప్పుడు అనాసపువ్వు వేసుకుంటే గొంతు నొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులు తగ్గిపోతాయి.
జీర్ణ సమస్యలు..
వర్షాకాలంలో మరొ సాధారణ సమస్యలు.. జీర్ణ సమస్యలు. చాలామందికి భోజనం తర్వాత పొత్తికడుపు ఉబ్బరం, అజీర్తి, పేగుల్లో గాలి జమ కావడం వంటి ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటి సమస్యలకు అనాసపువ్వు సహజ పరిష్కారం. దీని వాసనలోనే జీర్ణవ్యవస్థను శాంతంగా ఉంచే శక్తి ఉంది. భోజనం తర్వాత చక్కగా చాయ్‌లో లేదా తేలికపాటి కషాయంలో వేసుకుని తాగితే కడుపు తేలికగా ఉంటుంది.
Also Read: https://teluguprabha.net/devotional-news/debt-relief-spiritual-remedies-in-sravana-month-explained/
శక్తిని కోల్పోయిన సమయంలో, రోజంతా అలసటగా అనిపిస్తే కూడా ఇది సహాయపడుతుంది. దీని వాడకంతో శరీరానికి కావలసిన ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని రోజులు నిరంతరం వాడితే శక్తి తిరిగి వస్తుంది. మనం రోజూ ఎదుర్కొనే శారీరక బలహీనతలు తగ్గుతాయి.
పీరియడ్స్ సమయంలో..
మహిళలకు ఇది మరో రకంగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు, ఒత్తిడితో కలిగే అసౌకర్యాలు, నొప్పులు వంటి సమస్యలకు ఇది ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో ఉండే ఫైటోఈస్ట్రోజెన్ అనే పదార్థం మహిళల శరీరంలో హార్మోన్ల సమతుల్యతను సాధించేందుకు తోడ్పడుతుంది.
చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే బ్యాక్టీరియా, ఫంగల్ దాడులను నివారించడంలో చక్రపువ్వు ఉపయోగపడుతుంది. దీని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని రక్షిస్తాయి. బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కలుగజేస్తాయి.
గోరువెచ్చని పాలలో..
తరచుగా నిద్ర సమస్యతో బాధపడేవారు కూడా దీన్ని వాడవచ్చు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో కొద్దిగా చక్రపువ్వు పొడి వేసుకుని తాగితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మెలకువలు తగ్గిపోతాయి. మంచి నిద్ర రావడంలో సహాయపడుతుంది. దీని వాసనలోనే శాంతియుతమైన శక్తి దాగి ఉంది.


