Stress, Tension Relief with Abhaya Mudra: జీవితం అంటేనే.. ఉరుకులు పరుగులతో కూడిది. ముఖ్యంగా నగరంలో ఉద్యోగాలు చేసేవారికి ఆందోళన, ఒత్తిడి అనేవి సర్వసాధారణం అయ్యాయి. చిన్న విషయాలకే భయపడటం, పదే పదే ఆందోళన చెందడం మనసును అశాంతికి గురిచేస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆందోళన, ఒత్తిడి తగ్గించే మార్గలు చాలా ఉన్నాయి. కానీ అవి తెలియక చాలా మంది.. అశాంతితోనే జీవితాలను గడుపుతున్నారు. అయితే వారి కోసమే ఈ అభయ ముద్ర. ఈ ముద్ర అర్థమే భయం లేకపోవడం అని. ఈ అభయ ముద్రను రోజూ 5 నిమిషాలపాటుగా సాధన చేయగలిగితే ఎలాంటి ఆందోళన అయినా దూరం అవుతుందట. అయితే ఈ చిన్న సాధనతో మనసుకు ధైర్యం, శాంతి ఎలా లభిస్తాయో తెలుసుకుందాం!
ధైర్యం, రక్షణ: ఈ ముద్ర మనసులో పేరుకుపోయిన ఆందోళన, ఒత్తిడిని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది మనకు అంతర్గత రక్షణ భావనను అందిస్తుంది. దీంతో ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిస్తుంది.
మానసిక ప్రశాంతత: అభయ ముద్రను సాధన చేస్తున్నప్పుడు.. మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది. దీంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. రోజుకు కేవలం ఐదు నిమిషాలు శ్వాసపై ధ్యాస నిలిపి ఈ ముద్ర వేస్తే చాలు.. నాడీ వ్యవస్థ శాంతించి విశ్రాంతిని పొందుతుంది.
Also Read:https://teluguprabha.net/devotional-news/karthika-pournami-jwala-thoranam-significance-stories-2025/
ఎలా చేయాలి: ఈ అభయ ముద్రను సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చోని చేయాలి. కుడి అరచేతిని పైకి చూపిస్తూ, వేళ్లను మడవకుండా చాచి, ఛాతీ ఎత్తు వరకు ఉంచాలి. ఎడమ చేతిని విశ్రాంతిగా ఒడిలో ఉంచాలి. ఈ స్థితిలో ప్రశాంతంగా కూర్చుని ధ్యాన మార్గంలో అభయ ముద్రతో ఐదు నిమిషాలు కూర్చోవాలి. ఇలా రోజుకు 5 నిమిషాలు అభయ ముద్ర సాధన చేయడం ద్వారా మానసిక ఆరోగ్యంలో స్పష్టమైన మార్పును గమనించవచ్చు. ఇది ఆందోళన, ఒత్తిడి నుండి ఉపశమనం పొందడమే కాకుండా అంతర్గత శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని సైతం పెంచుతుంది. జీవితాన్ని మరింత ప్రశాంతంగా, ధైర్యంగా స్వాగతించడానికి ఈ అద్భుతమైన ముద్రను మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఆందోళన, ఒత్తిడిని దూరం చేసుకోండి.


