Stroke Risk For Women: అవాంచిత గర్భాన్ని తొలగించేందుకు కొంతమంది యువతులు గర్భనివారణ మాత్రలు వాడుతుంటారు. ఈ మాత్రలు మోతాదుకు మించి వినియోగిస్తుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిన్‌తో కూడిన హార్మోన్ల గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తుంటారు. అయితే, వీటిని మింగడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి గర్భధారణను నివారించడమే కాక.. రుతు చక్రాలను నియంత్రింస్తాయని హెచ్చరిస్తున్నారు. తాజా పరిశోధన ప్రకారం.. ఈ గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ది కన్వర్జేషన్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా అకస్మాత్తుగా వచ్చే క్రిప్టోజెనిక్ ఇస్కీమిక్ స్ట్రోక్ ముప్పును ఇది సూచిస్తుందని అధ్యయనం తెలిపింది. యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ సమావేశంలో సమర్పించిన ఓ అధ్యయన ఫలితాల ప్రకారం.. ఈ హార్మోన్ల మాత్రలు ఉపయోగించే మహిళల్లో క్రిప్టోజెనిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని తేలింది. ఈ హార్ట్ఎటాక్ స్ట్రోక్ గర్భనివారణ మాత్రలు ఉపయోగించని వారితో పోలిస్తే వీరికి మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఊబకాయం, మైగ్రేన్ వంటి ఇతర ప్రమాదాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని తేలింది. మాత్రలతోపాటు ఈస్ట్రోజెన్ కలిగిన ప్యాచ్, వాజినల్ రింగ్ వంటి ఇతర పద్ధతుల్లో కూడా ఈ ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి.
ఈ మాత్రలతో స్ట్రోక్ ముప్పు ఎక్కువ..
అయితే, ప్రొజెస్టిన్ మాత్రమే కలిగిన ఐయూడీలలో మాత్రం ఎక్కువ ప్రమాదం కనిపించలేదు. కృత్రిమ ఈస్ట్రోజెన్ ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి కాలేయాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాదు, గడ్డలు ఏర్పడకుండా నిరోధించే వాటి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఈ గడ్డలు మెదడులోని ధమనులను అడ్డుకుని ఇస్కీమిక్ స్ట్రోక్‌కు కారణమవుతాయి. ధూమపానం చేసేవారికి.. మైగ్రేన్‌తో బాధపడేవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం ఉన్నప్పటికీ సంపూర్ణ ప్రమాదం తక్కువగానే ఉంటుందని అధ్యయనంలో తేలింది. ప్రతి 4,700 మంది మాత్రలు వాడేవారిలో సంవత్సరానికి సుమారు ఒక్కరికి మాత్రమే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు సీహెచ్సీలను ఉపయోగిస్తున్నందున.. చిన్న ప్రమాదం కూడా జనాభా స్థాయిలో పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. గర్భధారణ సమయంలో ప్రసవానంతర కాలంలో స్ట్రోక్ ప్రమాదం, గర్భనిరోధక మందుల కంటే ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. గర్భనిరోధక మందుల దుష్ప్రభావాలపై సరైన అధ్యయనం లేకపోవడం మహిళల ఆరోగ్య వనరుల్లో ప్రధాన లోపాన్ని తెలియజేస్తుంది. మహిళలు సురక్షితమైన, ప్రభావవంతమైన పద్ధతుల ద్వారానే గర్భనివారణ పద్ధతులు పాటించాలని నిపుణులు కోరుతున్నారు.


