వేసవిలో మేకప్ టిప్స్ కొన్ని…
వేసవిలో మేకప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ముఖానికి ఎక్కువ మేకప్ వేసుకోకుండా ఉంటేనే మంచిది. అందుకే బ్యూటీ నిపుణులు ఈ సీజన్ లో లైట్ మేకప్ కే ప్రాధాన్యం ఇవ్వాలని చెపుతుంటారు. ఈ సీజన్లో తేలికపాటి మేకప్ వేసుకోవడమే బెస్టని బ్యూటీ నిపుణులు సైతం సూచిస్తునారు.
మేకప్ ను ఉదయం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడంతో మొదలెట్టాలి. తర్వాత టిన్టెడ్ మాయిశ్చరైజర్ లేదా ఫేస్ పౌడర్ ని వేసుకోవాలి. అలాగే ఫేవరేట్ కన్సీలర్ తో చర్మంపై స్పాట్ కరెక్షన్ చేస్తుండాలి. వాటర్ ప్రూఫ్ మస్కారాను వాడాలి. మేకప్ గా టిన్టెడ్ లిప్ బామ్ వాడాలి. అలాగే రోజూ స్కిన్ కేర్ రొటీన్ కు వెళ్లబోయే ముందు టోనర్ ని అప్లై చేసుకోవాలి. సలిసిలిక్ యాసిడ్ మంచి టోనర్ గా పనిచేస్తుంది. ఇది చర్మంపై చేరిన మ్రుతకణాలను పోగొడుతుంది. చర్మంలోని నూనె గ్రంధులను పరిరక్షిస్తుంది.
అంతేకాదు ఇందులోని కూలింగ్ ఎఫెక్టు యాక్నే వంటి వాటిపై బాగా పనిచేస్తుంది. వేసవిలో వాటర్ ప్రూఫ్ మస్కారాను మాత్రమే వాడాలి. లేకపోతే కాటుక నల్లదనం ముఖమంతా పరుచుకుపోయినట్టు అవుతుంది. అలాగే బాగా సువాసనలు చిందించే బ్యూటీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వీటివల్ల వేసవిలో తలతిప్పినట్టు అవుతుంది.