Friday, November 22, 2024
Homeహెల్త్Summer makeup tips: వేసవిలో సింపుల్ మేకప్ బెస్ట్

Summer makeup tips: వేసవిలో సింపుల్ మేకప్ బెస్ట్

వేసవికాలంలో వేడి, తేమను తట్టుకునేలా మేకప్ సింపుల్ గా ఉండాలి. అందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేమిటంటే…
 మేకప్, కన్సీలర్ లకు సరిపోయేలాంటి టింటెడ్ మాయిశ్చరైజర్ లేదా సన్ స్క్రీన్ ను వాడాలి. వేసవికాలంలో తప్పనిసరిగా సన్ స్ర్కీన్ ను చర్మానికి రాసుకోవాలి. టింటెడ్ క్రీమ్ ఫౌండేషన్ గా పనిచేస్తుంది. దీంతో స్కిన్ టోన్ కూడా ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది.
 మన్నికైన వాటర్ రెసిస్టెంట్ మస్కారా, లైనర్లను వాడాలి. వీటిని వాడడం వల్ల మస్కారా, లైనర్లు కారవు. కళ్లకు కాటుక పులుముకున్నట్టు అవదు.
 సహజసిద్ధమైన, న్యూట్రల్ అపియరన్స్ ఉండేందుకు వేసవిలో బ్రౌన్జర్ వాడితే బాగుంటుంది. బ్రౌన్జర్ ట్యాన్ అపియరెన్సెస్ ఇపుడు బాగా ఫేమస్. ఇది అన్ని రకాల స్కిన్ పై బాగా కనిపిస్తుంది. అంతేకాదు ఎంతో కాంతివంతంగా కనిపిస్తారు కూడా.
 మీ బుగ్గలు, పెదాలు, కనురెప్పలు అందంగా కనిపించాలంటే సింగిల్ న్యూట్రల్ షేడ్ ను అప్లై చేయాలి. వేసవిలో ఇది మీ లుక్స్ ను బాగా ఇనుమడింపచేస్తుంది.
 వేసవిలో తక్కువ మేకప్ ను అప్లై చేసుకోవాలి. పౌడర్ బ్లష్ కు దూరంగా ఉండాలి. సరైన మేకప్ పనిముట్లను వాడితే ఎండ వేడికి మేకప్ ముఖంపై కారకుండా ఉంటుంది. వేసవిలో సరైన స్కిన్ కేర్ ఎసెన్షియల్స్ ను వాడడం వల్ల మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
 ఫౌండేషన్ లేకుండా కన్సీలర్ ఉపయోగించడమే మంచిది. కన్సీలర్ చర్మంపై మచ్చలను, షేడ్స్ ను కనిపించనీయదు. అంతేకాదు కన్సీలర్ మీ స్కిన్ టోన్, టెక్స్చెర్లలో సహజసిద్ధంగా కలిసిపోతుంది. మేకప్ వేసుకోనట్టు కనిపిస్తారు.
 వేసవి వేడి నుంచి తట్టుకోవడానికి సరైన మాయిశ్చరైజర్ వాడాలి. ఉదయం ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడితే మంచిది.
 వేసవిలో రిచ్, డీప్ కలర్స్ జోలికి వెళ్లొద్దు. ఎందుకంటే వీటిని వాడడం వల్ల హెవీ లుక్ తో కనిపిస్తారు.
 వేసవిలో హెవీ లిప్ స్టిక్స్ జోలికి వెళ్లొద్దు. వాటి స్థానంలో లిప్ స్టైయిన్స్ వాడడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News