Homeహెల్త్Yashoda Hospitals: ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల సంరక్షణపై యశోద హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో 'ఇన్సీకాన్- 2026' సమ్మిట్‌

Yashoda Hospitals: ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల సంరక్షణపై యశోద హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ‘ఇన్సీకాన్- 2026’ సమ్మిట్‌

Yashoda Hospitals ‘Infectious Diseases’ Summit: సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘తీవ్రమైన ఇన్ఫెక్షన్లు & అంటు వ్యాధుల సంరక్షణ” పై రెండు రోజులపాటు “ఇన్సీకాన్-2026” జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఐసీయూ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ వ్యాధులు, సెప్సిస్ నిర్వహణ, అత్యాధునిక నిర్ధారణ పద్ధతులపై 500 మందికి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో శాస్త్రీయ సదస్సు జరుగుతోంది.

- Advertisement -

yashoda hospitals

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ‘ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ విభాగం ఆధ్వర్యంలో క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ(CIDS), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజిస్ట్స్(IAMM), అసోసియేషన్ అఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (API) హైదరాబాద్ చాప్టర్ వంటి ప్రముఖ వైద్య సంస్థలతో కలిసి “ఇన్సీకాన్-2026” పేరుతో “అంటు వ్యాధులు- క్లిష్టమైన సంరక్షణ”పై జాతీయ స్థాయి శాస్త్రీయ సదస్సును శనివారం హైటెక్ సిటీ, రహేజా మైండ్‌స్పేస్‌ ఐటీ పార్క్‌లోని ది వెస్టిన్ హోటల్‌లో ప్రారంభించారు. 500 మందికి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో మే 2, 3 తేదీల్లో జరగనున్న ఈ రెండు రోజుల జాతీయ సదస్సును యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి ముఖ్య అతిధిగా హాజరై సదస్సుకు ప్రారంభోత్సవం చేశారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/visits-to-ishtakameshwari-temple-temporarily-suspended/

ఈ సందర్భంగా డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్‌లో తాము అకాడమిక్ ఎక్సలెన్స్, నిరంతర వైద్య విద్యను ప్రోత్సహించడంపై కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇన్సీకాన్-2026 ద్వారా మాలిక్యులర్, ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులు, వైద్య పరీక్షల విశ్లేషణ, నూతన చికిత్స విధానాలపై నిపుణులు తమ అనుభవాలను పంచుకుంటారని పేర్కొన్నారు. ఈ సదస్సులో క్రిటికల్ కేర్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ట్రాపికల్ ఇన్ఫెక్షన్లు, ట్రాన్స్‌ప్లాంట్‌ సంబంధిత ఇన్ఫెక్షన్లు, క్లినికల్ మైక్రోబయాలజీ విశ్లేషణలు, హెచ్ఐవీ సహా రోగనిరోధక శక్తి తగ్గిన రోగుల్లో ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ చికిత్సలో ఇన్ఫెక్షన్లు, మాలిక్యులర్, ఆధునిక నిర్ధారణ పద్ధతులు, టీకాలు- నివారణ చర్యలు వంటి విభిన్న అంశాలు చర్చిస్తారని చెప్పారు. అదేవిధంగా, ప్రస్తుత క్లినికల్ సవాళ్లు- అభివృద్ధి చెందుతున్న చికిత్స విధానాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ సదస్సు వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా రోగుల చికిత్స ఫలితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్‌. పవన్‌ వివరించారు. 

Also Read: https://teluguprabha.net/telangana/kavitha-says-that-telangana-jagruti-will-continue-as-an-ngo/

యశోద హాస్పిటల్స్- సికింద్రాబాద్, సీనియర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్. మోనాలిసా సాహూ మాట్లాడుతూ.. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆధునిక వైద్యంలో అత్యంత సవాలుతో కూడుకున్న, వేగంగా మారుతున్న వైద్య విభాగం అని పేర్కొన్నారు. ముఖ్యంగా క్రిటికల్ కేర్‌లో సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం రోగి ఫలితాలపై కీలక ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈ ఇన్సీకాన్- 2026 సదస్సు ద్వారా ఐసీయూ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ వ్యాధులు, సెప్సిస్ నిర్వహణ, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, టీబీ,  హెచ్ఐవి నిర్వహణలో తాజా మార్పులు, యాంటీమైక్రోబియల్ స్టీవర్డ్‌షిప్, పిల్లల ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అభివృద్ధి చెందుతున్న చికిత్సా విధానాలు, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ కేస్-బేస్డ్ డిస్కషన్స్, ప్యానెల్ చర్చల ద్వారా సదస్సులో పాల్గొన్న వైద్యులు.. క్లిష్టమైన ఇన్ఫెక్షన్లను, ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్లను ఎలా నిర్వహించాలో ప్రాక్టికల్‌గా అవగాహన పొందారని వెల్లడించారు. ఇటువంటి వేదికలు వైద్య నిపుణుల మధ్య జ్ఞాన మార్పిడిని పెంపొందించి, ఉత్తమ చికిత్సను అందించడంలో సహాయపడతాయని మోనాలిసా సాహూ స్పష్టం చేశారు. 

ఈ సదస్సు యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్. లింగయ్య, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ యూనిట్ హెడ్ డాక్టర్. విజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. సదస్సుకు ప్రధాన సమన్వయకర్తగా సీనియర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్. మోనాలిసా సాహూ వ్యవహరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News