Friday, December 12, 2025
Homeహెల్త్Heart: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్..ఈరోజు నుంచే మీ డైట్‌లో చేర్చుకోండి!

Heart: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్..ఈరోజు నుంచే మీ డైట్‌లో చేర్చుకోండి!

Foods For Heart Health: చాలామంది నేటి బిజీ లైఫ్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి కారణంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీటిలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో గుండె జబ్బులు ఒకటి. గుండె ఆరోగ్యానికి సహాయపడే అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఎరుపు రంగులో ఉండే సూపర్ ఫుడ్స్ అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. వీటిని మన డైట్ లో చేర్చుకుంటే మన గుండె కలకలాం పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పును సహజసిద్ధంగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

 

టమోటాలు: అందరి వంటింట్లో ఉండే ఈ టమోటాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా, గుండె జబ్బుల ప్రమాదాన్ని సహజంగా తగ్గిస్తుంది. టమాటో ఎరుపు రంగు లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ వల్ల వస్తుంది. ఈ లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ధమనులు మూసుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని సలాడ్‌లలో పచ్చిగా తినవచ్చు లేదా సూప్ లేదా జ్యూస్ తయారు చేసి తాగవచ్చు.

 

దానిమ్మ: దానిమ్మ గింజలు పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్లు వంటి వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్త నాళాల గోడలు దెబ్బతినకుండా కాపాడతాయి. దానిమ్మపండు తినడం వల్ల ధమనులలో ఫలకం ఏర్పడటం తగ్గుతుందని, అడ్డంకుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీని నేరుగా తినవచ్చు లేదా రసం చేసుకుని తాగవచ్చు. లేదంటే దీనిని సలాడ్లు లేదా పెరుగులో కూడా చేర్చవచ్చు.

also:Vivo X300 Series: భారత్​కు వివో “X300” సిరీస్ ఫోన్లు..లాంచ్ డేట్ ఫిక్స్..!

స్ట్రాబెర్రీలు: స్ట్రాబెర్రీలు ఆరోగ్యకరమైన గుండెకు గొప్ప సూపర్ ఫుడ్. రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ముందుంటాయి. వీటిలో ఆంథోసైనిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఆంథోసైనిన్లు గుండె జబ్బులకు ప్రధాన కారణమైన మంటను తగ్గిస్తాయి. ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. వీటిని పెరుగు, ఓట్స్ లేదా స్మూతీలతో జోడించి తినవచ్చు.

బీట్‌రూట్: బీట్‌రూట్ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది నైట్రేట్‌లతో సమృద్ధిగా ఉంటుంది. దీని తినడం ద్వారా మన శరీరం ఈ నైట్రేట్‌ను నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తాయి. ఇది రక్త నాళాలను సడలించి వెడల్పు చేస్తుంది. ఈ ప్రక్రియ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని దూరం చేస్తుంది. బీట్‌రూట్ ను సలాడ్ లేదా చేసుకుని తాగవచ్చు.

ఎర్ర ద్రాక్ష: ఎర్ర ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం రక్త నాళాలను సరళంగా ఉంచడంలో సహాయపడుతుంది. సిరల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. వీటిని చిరుతిండిగా తినవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే? రెడ్ వైన్ తాగడం కంటే ఎర్ర ద్రాక్ష తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది (మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం).

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News