Heart Attack: ఈరోజుల్లో గుండె సమస్యలు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్ల కారణంగా యువతలో కూడా ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. ఈ తీవ్రమైన సమస్యను ఎదుర్కోవాలంటే దీని లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. గుండెపోటుకు సుమారు నెల రోజుల ముందు నుంచే శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే, ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.
ఛాతీ నొప్పి, ఒత్తిడి: గుండె పోటు అత్యంత సాధారణ, తీవ్రమైన లక్షణం ఛాతీ నొప్పి. మీకు తరచుగా మీ ఛాతీలో భారం, ఒత్తిడి లేదా మంటను అనుభవిస్తే, దానిని లైట్ తీసుకోకూడదు. ముఖ్యంగా నొప్పి ఎడమ చేయి, భుజం లేదా మెడ వరకు ప్రసరిస్తే, అది గుండె సమస్యకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Also Read:Health: ఫిట్ గా ఉండాలా..?అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!
అసాధారణ అలసట: ఎటువంటి శారీరక శ్రమ లేకుండా త్వరగా అలసిపోతే లేదా సాధారణ రోజువారీ పనులతో కూడా అలసిపోయినట్లు అనిపిస్తే, ఇది గుండె పోటుకు హెచ్చరిక సంకేతం కావచ్చు. అసాధారణ అలసటను గుండె సమస్యల ప్రారంభ సంకేతంగా పరిగణిస్తారు. వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం అత్యవసరం.
శ్వాస తీసుకోకపోవడంలో ఇబ్బందులు: గుండె జబ్బుల మరో ముఖ్యమైన లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం. మెట్లు ఎక్కేటప్పుడు, కొంచెం దూరం మదించిన లేదా స్పష్టమైన కారణం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే, అది గుండె కండరాలు, రక్త ప్రసరణలో సమస్యను సూచిస్తుంది. దీని తేలికగా తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించాలి.
హార్ట్ బీట్: అసాధారణంగా వేగంగా లేదా నెమ్మదిగా హార్ట్ బీట్ రేట్ కూడా ఒక ప్రధాన సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఈ హృదయ స్పందన చాలా వేగంగా మారుతుంది. అది ఆందోళన లేదా భయాందోళనకు కారణమవుతుంది. తరచుగా సక్రమంగా లేని హృదయ స్పందనలను అనుభవిస్తే, వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.


