Saturday, November 15, 2025
Homeహెల్త్Tea for weight loss: కొవ్వును కరిగించి బరువు తగ్గించే టీ

Tea for weight loss: కొవ్వును కరిగించి బరువు తగ్గించే టీ

బాగా బరువు ఉన్నారని బాధపడుతున్నారా? అయితే దాన్ని తగ్గించే సహజ చిట్కా ఒకటి ఉంది. శరీరంలోని కొవ్వును కరిగించే ప్రత్యేకమైన టీ ఉంది. దీన్ని రోజుకు మూడు కప్పులు చొప్పున ఒక వారం రోజులు తీసుకుంటే మీ ఒంట్లో ఫ్యాట్ బాగా తగ్గుతుంది. ఇంతకూ ఆ టీ ఎలా తయారుచేయాలంటారా? వంటింట్లో లభించే పదార్థాలతో చేసే ఈ టీ నేచురల్ టీ.

- Advertisement -

రెండు టీస్పూన్ల తురిమిన అల్లం, ఒక టీస్పూన్ దాల్చిన చెక్కపొడి, ఒక కప్పు నీళ్లు, ఒక ప్యాకెట్ గ్రీన్ టీ, రెండు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె, వేడి టీపైన చల్లడానికి రెండు పుదీనా ఆకులు రెడీగా పెట్టుకోవాలి. నీళ్లల్లో అల్లం తురుము, దాల్చిన చెక్కపొడి వేసి ఐదునిమిషాలు స్టవ్ పై మరగనివ్వాలి. తర్వాత అందులో తేనె, రెండు టీస్పూన్ల నిమ్మరసం చేర్చి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడపోయాలి. అందులో గ్రీన్ టీ ప్యాకెట్ ను ముంచి రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. అంతే బరువును తగ్గించే వేడి టీ రెడీ. అలా రెడీ అయిన టీపై పుదీనా ఆకులు చల్లి వేడి వేడిగా తాగాలి. మంచి ఫలితాలు చూడాలంటే ఈ టీని పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగితే చాలా మంచిది. ఇలా నిత్యం చేస్తే మీ బరువు తగ్గడమే కాదు మీ జీవితమే ఉల్లాసంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది.

మరి మీరు కూడా ఫ్యాట్ కిల్లర్ టీని ట్రై చేయండి…ఆలస్యం ఎందుకు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad