Tuesday, April 8, 2025
Homeహెల్త్Food adulteration: ఆహారకల్తీలో రెండో స్థానంలో తెలంగాణ.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్

Food adulteration: ఆహారకల్తీలో రెండో స్థానంలో తెలంగాణ.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్

ఆహార కల్తీ(Food adulteration)లో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఆహార భద్రత అధికారులు గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22 శాతం కల్తీవే ఉండటం గమనార్హం.

- Advertisement -

2021-24 మధ్య దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీవిగా తేలిన నమూనాల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాల వారీగా ఇటీవల పార్లమెంటుకు నివేదించింది.

ఈ లెక్కల ప్రకారం ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 కల్తీ ఆహారంగా తేలుతున్నాయి. తమిళనాడు 20 శాతం సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. కేరళ 13.11 శాతం, ఆంధ్రప్రదేశ్ 9 శాతం, కర్ణాటక 6.30 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News