The secret lies in the very salt you use: తరచూగా విపరీతంగా చలి వేస్తోందా? మతిమరుపు, చర్మం పొడిబారడం, కండరాల బలహీనత వేధిస్తున్నాయా? ఇది కేవలం అలసట మాత్రమే కాకపోవచ్చు. శరీరంలో ‘అయోడిన్’ తగినంతగా లేదనడానికి సంకేతం కావచ్చు..! ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్ల మందిని వేధిస్తున్న ఈ అయోడిన్ లోపం.. థైరాయిడ్ సమస్యలకే కాకుండా గుండె వైఫల్యం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి తీవ్ర ముప్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా గర్భవతుల్లో ఇది పిండం ఎదుగుదలను దెబ్బతీసి పుట్టుకతో వచ్చే లోపాలకు కారణమవుతుంది. అసలు అయోడిన్ లోపాన్ని ప్రారంభంలోనే ఎలా గుర్తించాలి? ఎలాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి? వంటి వివరాలు ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండడం అవసరం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 మిలియన్ల మంది అయోడిన్ లోపంతో బాధపడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కాకుండా, రోజువారీ ఆహారంలో అయోడిన్ తగినంత లభించని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ లోపం ఎక్కువే కనిపిస్తోంది.
నిపుణుల హెచ్చరికలు..
గర్భిణీ స్త్రీలకు సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో అయోడిన్ అవసరమవుతుంది. వీరిలో అయోడిన్ లోపం ఏర్పడితే పిండం ఎదుగుదలలో తీవ్ర లోపాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
ఎలా గుర్తించాలి?
శరీరంలో అయోడిన్ తగ్గినప్పుడు ప్రారంభంలో కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి.
గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్లాండ్ లో వాపు వస్తుంది. అందువల్ల థైరాయిడ్ కణితి లాగా కనిపిస్తుంది.
హైపోథైరాయిడిజం
థైరాయిడ్ గ్లాండ్ పనితీరు తగ్గడం వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల కొన్ని ప్రత్యేక లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
1. ఎక్కువ చలిగా అనిపించడం
2. దీర్ఘకాలిక మలబద్ధకం
3. చర్మం పొడిబారడం
4. కండరాలు బలహీనపడటం
5. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం
6. కండరాలు, కీళ్లు బిగుసుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి
7. మానసిక ఆందోళన, మూడ్ స్వింగ్స్
8. మహిళల్లో నెలసరి సమయంలో తీవ్రమైన రక్తస్రావం
9. మతిమరుపు, ఏకాగ్రత తగ్గడం
ఈ లక్షణాలు అన్నీ ఉండవచ్చు లేదా కొన్ని మాత్రమే కనిపించవచ్చు.
హైపోథైరాయిడిజానికి సమయానికి సరైన చికిత్స తీసుకోకపోతే నాడీ వ్యవస్థ, గుండెకు సంబంధించిన తీవ్రమైన లోపాలకు కారణం కావచ్చు. చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
1. గుండె సమస్యలు
2. గుండె పనితీరులో హఠాత్తుగా మార్పులు రావడం, గుండె పరిమాణం పెరగడం, హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రమాదకర సమస్యలు రావచ్చు.
3. నాడీ వ్యవస్థ వైఫల్యం
4. పెరీఫెరల్ న్యూరోపతి, తీవ్రమైన డిప్రెషన్, మెదడు చురుకుదనం తగ్గడం వంటి నాడీ సమస్యలు ఏర్పడతాయి.
5. గర్భిణులకు ప్రమాదకరం
6. పుట్టబోయే పిల్లల్లో పుట్టుకతో వచ్చే తీవ్రమైన లోపాలు ఏర్పడవచ్చు.
7. నెలలు నిండకముందే ప్రసవం, గర్భస్థ శిశువు మరణం లేదాగర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది.
8. పిల్లల్లో మెదడు ఎదుగుదల లోపాలు, క్రెటినిజం వంటి తీవ్రమైన వైకల్యాలు వచ్చేప్రమాదం ఉంటుంది.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు
అయోడిన్ లోపం ఉందేమోనని అనుమానం ఉన్నప్పుడు వైద్యులు ప్రధానంగా నాలుగు రకాల పరీక్షలు నిర్వహిస్తారు
1. యూరిన్ టెస్ట్
అతి తక్కువ సమయంలో చేయగలిగే పరీక్ష. కొన్ని నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. అయితే ప్రాథమిక అంచనాకే ఇది ఉపయోగపడుతుంది, వివరణాత్మక పరీక్షలు అవసరమవుతాయి.
2. బ్లడ్ టెస్ట్
రక్త పరీక్ష ద్వారా అయోడిన్ లోపాన్ని, హార్మోన్ల స్థాయిలను అత్యంత ఖచ్చితంగా గుర్తించవచ్చు. అయితే ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది.
3. అయోడిన్ పాచ్ టెస్ట్
చర్మం మీద ఒక అయోడిన్ ప్యాచ్‌ను అతికించి 24 గంటల పాటు నిశితంగా పరిశీలిస్తారు. శరీరంలో అయోడిన్ లోపం ఉన్నప్పుడు చర్మం త్వరగా అయోడిన్‌ను పీల్చుకోవడం వల్ల ఆ ప్యాచ్ మాయమవుతుంది.
చికిత్స, నివారణ మార్గాలు..
1. సప్లిమెంట్స్ వాడకం
ఆహారం ద్వారా తగినంత అయోడిన్ అందనప్పుడు వైద్యుల సలహా మేరకు అయోడిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది.
2. ప్రత్యేక శ్రద్ధ అవసరమైనవారు
వీగన్స్, శాకాహారులు, గర్భిణులకు సాధారణ ఆహారం ద్వారా తగినంత అయోడిన్ లభించకపోవచ్చు. అందువల్ల వీరికి పొటాషియం అయోడేట్ రూపంలో సప్లిమెంట్లను ఇస్తారు.
3. జీవనశైలి మార్పులు
చాలా వరకు అయోడిన్ లోపాన్ని ఆహారంలో సరైన మార్పులు చేసుకోవడం, అయోడిన్ కలిపిన ఉప్పు వాడటం, సప్లిమెంట్లతో సులభంగా సరిచేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
… భవాని

