Kidney Health: ఈరోజుల్లో కాలేయం, మూత్రపిండాల సంబంధిత వ్యాధులు సర్వసాధారణంగా మారాయి. దీనికి నేటి జీవనశైలి, తప్పుడు ఆహార అలవాట్లు ప్రధాన కారణాలు. మూత్రపిండాల గురించి చెప్పాలంటే, ఇది మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది రక్తాన్ని పంప్ చేస్తుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అలాంటప్పుడు మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో ముఖ్యం. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. దీంతో కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాదు, ఎలాంటి కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అయితే మూత్రపిండల ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ఉదయం పాటించాల్సిన కొన్ని అలవాట్ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయాలంటే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని సులభతరం చేస్తుంది. అయితే, అధిక గోరువెచ్చని నీటిని తాగడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది కిడ్నీ పై ఒత్తిడిని కలిగిస్తుంది.
రుచికోసం ఎక్కువ ఉప్పు తింటే, అది మూత్రపిండాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. కిడ్నీల ఆరోగ్యం కోసం ఉదయాన్నే అల్పాహారంలో ఎక్కువ ఉప్పు తినకుండా ఉండటానికి ప్రయత్నించాలి. దీనికి కారణం ఎక్కువ ఉప్పు తినడం వల్ల మూత్రం నుండి కాల్షియం తగ్గుతుంది. ఇది మూత్రపిండాలలో రాళ్ల సమస్యలను కలిగిస్తుంది. ఇది రక్తపోటును సైతం పెంచుతుంది. ఇది మూత్రపిండాలకు ఎంతో ప్రమాదకరం.
పొద్దునే లేచిన తర్వాత యోగా లేదా వ్యాయామం చేయాలి. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉండటమే కాకుండా, మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. స్ట్రెచింగ్ శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. అలాగే, వ్యాయామం చేసినప్పుడు వచ్చే చెమట ద్వారా శరీరం విషపదార్థాలు బయటకు వస్తాయి. ఇది మూత్రపిండాలపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగితే అలవాటు ఉంటె వెంటనే మానుకోవాలి. ఎందుకంటే టీ, కాఫీ తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. దీనికి బదులుగా హెర్బల్ టీ తాగవచ్చు. ఇది మూత్రపిండాలకు ఆరోగ్యంగా ఉంటుంది.
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతి ఉదయం డైట్ లో పండ్లను చేర్చుకోవడం ముఖ్యం. ఇవి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, మొత్తం శరీరంలోని అవసరమైన పోషకాల లోపాన్ని కూడా తీరుస్తుంది. అంతేకాకుండా, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి, రోజంతా నాలుగు నుండి ఐదు లీటర్ల నీరు త్రాగాలి.


