Bottle Gourd Juice Benenfits: సొరకాయ.. మనం కూరగాయల మార్కెట్లో తరచుగా చూసే కూరగాయ. దీన్ని కొనడానికి చాలామంది మొగ్గు చూపరు. కానీ, కొందరు దీన్ని కొనడానికి ఇష్టపడితే, మరికొందరు చాలా దూరంగా ఉంటారు. కానీ మీకు తెలుసా? సొరకాయ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని! అవును..సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని రసం క్రమం తప్పకుండా తాగడం ద్వారా బరువు తగ్గడంతోపాటు రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రసం అమృతంలా పని చేస్తుంది.
సొరకాయలో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తద్వారా దీని తాగడం వల్ల శరీరం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఈ క్రమంలో సురగా రసం తాగడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ రసం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. సొరకాయలో ఉండే ఫైబర్ అధికంగా ఉంటుంది. తద్వారా ఈ జ్యూస్ తాగితే కడుపు ఎక్కువగా నిండిన భావన కలుగుతుంది. ఇది పదేపదే తినే అలవాటును నిరోధిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగితే జీర్ణక్రియను పెంచుతుంది.
Also Read: Healthy Street Food: ఆరోగ్యానికి మేలు చేసే స్ట్రీట్ ఫుడ్స్ ఏంటో తెలుసా
సొరకాయలు కరిగే ఫైబర్, నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఈ రసం తాగడం ద్వారా మలబద్ధకం, ఆమ్లత్వం, వాయు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రసం ప్రేగులను సైతం ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ రసం అధిక బిపి తో బాధపడుతున్న వారికి సహజమైన పానీయం.
సొరకాయ రసంలో చర్మం, జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాని ప్రకాశవంతంగా చేస్తాయి. అంతేకాకుండా చర్మసంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఈ రసం జుట్టును సైతం బలపరుస్తుంది. చుండ్రువంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.


