Beetroot Juice Benefits: సూపర్ ఫుడ్స్ విషయానికి వస్తే బీట్‌రూట్ జ్యూస్ ఈ జాబితాలలో అగ్రస్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యాంగా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. ఇది శరీరాన్ని లోతుగా నిర్విషీకరణ చేస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. దీంతో మన శరీరానికి ఎంతో శక్తి వస్తుంది. ఇనుము, ఫోలేట్, విటమిన్ సి, నైట్రేట్‌లతో సమృద్ధిగా ఉన్న ఈ బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పవచ్చు. దీని రోజు తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అయితే, బీట్‌రూట్ రసం తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
బీట్‌రూట్ జ్యూస్ తాగితే అందులో ఉండే నైట్రేట్లు శరీరంలోకి ప్రవేశించి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. ఇవి రక్త నాళాలను సడలించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.అంతేకాకుండా అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. బీట్‌రూట్ రసం క్రమం తప్పకుండా తాగితే గుండె పనితీరు మెరుగుపడుతుంది.
ఈ డ్రింక్ ఐరన్, ఫోలేట్ మంచి మూలం. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులకు ముఖ్యంగా మహిళలకు దీని తమ డైట్ లో చేర్చుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని రోజువారీ వినియోగం శరీరంలోని రక్త లోపాన్ని తొలగిస్తుంది.
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం లేదా ఆమ్లత్వం సమస్యలు ఉన్న వ్యక్తులు దీని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఈ జ్యూస్ కడుపును శుభ్రపరిచి, జీవక్రియను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
బీట్‌రూట్ ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తాయి. బీట్‌రూట్ రసం తాగడం వల్ల ముఖం మెరుస్తుంది. అదేవిధంగా మొటిమలు, మచ్చలు తగ్గడం ప్రారంభమవుతుంది.
ఈ రసాన్ని తీసుకుంటే శరీరానికి ఎంతో శక్తి వస్తుంది. వ్యాయామానికి ముందు ఈ డ్రింక్ తాగితే వ్యాయామం తర్వాత రోజు మొత్తం అలసటగా అనిపించదు. ఈ రసం కండరాలకు ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడుతుంది. తద్వారా శక్తి స్థాయిలను నిర్వహిస్తుంది.
ఈ పానీయం కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. శరీరం నుండి విష వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ జ్యూస్ ను తీసుకుంటే చర్మ వ్యాధులు, కడుపు సంబంధిత సమస్యలు, రాకుండా ఉంటాయి.