Papaya Juice Benefits: మనం ఆరోగ్యం రోజూ తీసుకునే రోజూ తాజా పండ్లు, కూరగాయల పై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలూ అందుతాయి. ఇందులో బొప్పాయి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే బొప్పాయి లో ఫైబర్, విటమిన్లు అధికంగా ఉంటాయి. దీంతో మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అయితే, చాలా మందికి బొప్పాయి పండు తినడం ఇష్టం ఉండదు. ఇటువంటి పరిస్థితిలో బొప్పాయి పండును జ్యూస్ తయారు చేసి త్రాగవచ్చు. ఇది త్రాగడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బొప్పాయి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
పండిన బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందువల్ల 1 గ్లాసు బొప్పాయి రసం కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో ఎంతో ఆరోగ్యంగా ఉంటాం.
రోజూ బొప్పాయి రసం తాగడం వల్ల బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో తక్కువ కేలరీల ఉంటాయి. దీంతో ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గొచ్చు. అయితే, జ్యూస్ లో చక్కెర యాడ్ చేయకుండా అధిక ఫైబర్ ఉన్న ఈ రసాన్ని తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయి రసం తాగడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండి ఉంటుంది. దీంతో అతిగా ఆహారం తినడం మానేస్తాం
Also Read: Meenaakshi Chaudhary: జీన్స్‌లో కవ్వెక్కిస్తున్న మీనాక్షి చౌదరి
బొప్పాయిలో విటమిన్ సి కూడా ఉంటుంది. సీజనల్ వ్యాధుల కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీంతో ఈ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీనితో పాటు బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరం ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.
రోజూ బొప్పాయి రసం తాగడం వల్ల చర్మం, కళ్ళకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి కంటి చూపును పెంచుతుంది. అంతేకాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బొప్పాయి రసం తాగడం వల్ల మొఖం పై మెరుపు వస్తుంది. చర్మంపై ముడతలు సైతం తొలగిపోతాయి.
బొప్పాయి జ్యూస్ ఎలా తయారు చేయాలి?
ముందుగా పండిన బొప్పాయిని తీసుకోవాలి. చాకు ద్వారా బొప్పాయి తొక్క, గింజలను తీసివేసి మందపాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సర్ జ్యూస్ జార్‌లో వేయాలి. జ్యూస్ అవసరానికి అనుగుణంగా అందులో నీరు కలపాలి. తర్వాత మిక్సర్‌లో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు జ్యూస్ మరింత స్వీట్ గా కావాలంటే కొంచెం చక్కెరను జోడించవచ్చు. ఈ జ్యూస్ ని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.


