Sunday, November 16, 2025
Homeహెల్త్Apple: ఆపిల్ పండు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

Apple: ఆపిల్ పండు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

Apple benefits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ లో పండ్లు, తాజా కూరగాయలను చేర్చుకోవాలి. ఇందులో భాగంగానే ప్రతిరోజు ఒక ఆపిల్ పండు తినడం వల్ల డాక్టర్ అవసరం ఉండదని అంటారు. ఆపిల్ లో ఉండే అనేక పోషకాలు అనారోగ్యానికి గురి కాకుండా చేస్తుంది. అయితే, ఇటీవల ప్రసిద్ధ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ పని ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో డాక్టర్ రోజు కూడా ఉండే ఆపిల్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. రోజు రెండు ఆపిల్స్ తింటే దాని ప్రభావం ఎంతో మెరుగ్గా ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

లివర్ ఆరోగ్యం

డాక్టర్ జోసెఫ్ ప్రకారం.. ఆపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని నిర్వీకరణ చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఫ్యాటీ లివర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

పేగు క్యాన్సర్ నివారణ

ఆపిల్ లో రక్షిత సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పేగును ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. ఈ మూలకాలు పేగులో హానికరమైన మార్పులను నిరోధిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

 

కొలెస్ట్రాల్ నియంత్రణ

యాపిల్స్ లో కరిగే ఫైబర్ ఉంటుందని, ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుందని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లు అంటున్నారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పైగా గుండె పనితీరును సైతం మెరుగుపరుస్తుంది.

Also Read: Liver Health: లివర్ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్..!

 

రక్తంలో చక్కెర నియంత్రణ

యాపిల్స్ తక్కువ రైస్మిక్ సూచికను కలిగి ఉంటాయి. అంటే ఇది చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీంతోపాటు ఆపిల్స్ లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఇది టైప్ టు డయాబెటిస్ ను నివారిస్తుంది.

బరువు తగ్గడం

ఆపిల్స్ లో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీని కారణంగానే వీటిని తింటే కడుపు ఎక్కువ సమయం నిండిన భావన కలుగుతుంది. ఇది పదేపదే తినే అలవాటును నివారిస్తుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది.

ఆపిల్ ఎప్పుడు తినాలి?

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో లేదా రోజులో ఏ సమయంలోనైనా 2 తాజా ఆపిల్స్ తినడం దినచర్యలో భాగంగా చేసుకోవచ్చు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad