Dragon Fruit Benefits: మన డైట్ లో పండ్లను చేర్చుకుంటే ఎంతో మంచిది. అనేక ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు. అయితే, డ్రాగన్ ఫ్రూట్ గురించి చాలామంది వినే ఉంటారు. ఇది ప్రత్యేకమైన రంగు, రుచికి ప్రసిద్ధి. ఈ పండును తింటే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయా అని కూడా పిలుస్తారు. ఇది తక్కువ కేలరీల పండు. ఇందులో ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ ఫ్రూట్ ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ
ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. ఇది మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడం ద్వారా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
Also Read: Coriander Leaves: కొత్తిమీర నీరు తాగితే ఈ సమస్యలన్నీ పరార్!
బరువు తగ్గడం
ఈ పండులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. తద్వారా డ్రాగన్ ఫ్రూట్ తింటే చాలా సమయం కడుపుని నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఇది పదే పదే తినాలనే కోరికను తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది.
చర్మ ఆరోగ్యం
ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మెరిసేలా చేస్తాయి. ఇది ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం
డ్రాగన్ ఫ్రూట్‌లో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
మధుమేహం
ఈ పండు తక్కువ గ్లైసెమిక్ సూచిక రక్తంలో చక్కెర స్థాయిలను పెరగడానికి అనుమతించదు. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: Vitamin B12 Deficiency: మీకు అలసట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలున్నాయా?
ఎముకలు
డ్రాగన్ ఫ్రూట్‌లో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. అంతేకాకుండా బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారిస్తుంది.
ఒత్తిడి
ఇందులో ఉండే మెగ్నీషియం నాడీ వ్యవస్థను సడలిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
క్యాన్సర్ నివారణ
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.


