Soaked Almonds Benefits: బాదంపప్పులో అనేక పోషకాలు దాగి ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని అంటారు. బాదం పప్పులను మన డైట్ లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. బాదంపప్పులను క్రమం తప్పకుండా తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నానబెట్టిన బాదం పప్పులు జీర్ణం కావడానికి సులభం కావడమే కాకుండా వాటి ఎంజైములు కూడా చురుగ్గా మారుతాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 3-4 నానబెట్టిన బాదంపప్పులు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
నానబెట్టిన బాదం పప్పులో విటమిన్ ఇ, ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను సైతం ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా నానబెట్టిన బాదం పప్పులు, పిల్లలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం ద్వారా అల్జీమర్స్, ఇతర నాడి సమ్మతిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్దకాన్ని సైతం నివారిస్తుంది. వీటిని తినడం ద్వారా కడుపు ఎక్కువగా నిండిన భావన కలుగుతుంది. దీంతో పదేపదే తిన్న తినే అలవాటును నివారించవచ్చు.
నానబెట్టిన బాదం పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Also Read:Drumstick:మునగకాయ తింటే.. నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..
నానబెట్టిన బాదంలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం శరీరంలోని ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇవి అర్థరైటీస్, అస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తమ ఎముకలు బలంగా ఉండాలంటే బాదంపప్పులను తమ ఆహారంలో చేర్చుకోవాలి.
నాన్న పెట్టిన బాదం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణజలాన్ని నయం చేస్తాయి. ఇవి ముడతలను సైతం తగ్గిస్తాయి. బాదం పప్పులు చర్మాని లోపలి నుండి హైడ్రేటెడ్ గా, ఆరోగ్యంగా ఉంచుతాయి


