Saturday, November 15, 2025
Homeహెల్త్Guava: జామ పండ్లే కాదు..ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు!

Guava: జామ పండ్లే కాదు..ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు!

Guava Leaves Benefits: జామ ఒక పండుగా ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే, దాని ఆకులు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయని మీకు తెలుసా? జమ ఆకులు అనేక గృహ నివారణలలో ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా ఇవి అనేక వ్యాధులతో పోరాడడానికి కూడా ఎంతో సహాయపడుతాయి. ఆయుర్వేదంలో జామ ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉంటయి. జామ ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి శరీరాన్ని లోపల నుండి బలోపేతం చేయడంలో ఉపయోగపడుతాయి. ఈ క్రమంలో జామ ఆకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

జామ ఆకులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

మధుమేహం

మధుమేహ రోగులకు జామ ఆకులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆకులను తీసుకుంటే రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. జమ ఆకుల టీ తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకుల కషాయం తాగడం మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

కడుపు వ్యాధుల నుండి ఉపశమనం

జామ ఆకులు కడుపు సంబంధిత వ్యాధులతో పోరాడడానికి ఎంతో పని చేస్తాయి. గ్యాస్, అజీర్ణం లేదా విరేచనాలకు జామ ఆకులు దివ్యౌషధం. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ అంశాలు ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతాయి. జామ ఆకులను మరిగించి దాని నీటిని త్రాగడం వల్ల కడుపు చికాకు, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

జుట్టు రాలడాన్ని నివారిస్తుంది

జమ ఆకులు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఎందుకంటే ఇందులో ఈ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా నెత్తిని కూడా ఆరోగ్యంగా చేస్తాయి. ఇందుకోసం జామ ఆకుల పేస్ట్‌ను తయారు చేసి తలకు అప్లై చేయాలి. ఇది జుట్టు రాలడం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: Health Tips: హెల్తీ గా ఉండాలంటే పొద్దున్నే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసా..?

చర్మ ఆరోగ్యం

జామ ఆకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటయి. ఇవి చర్మంపై బ్యాక్టీరియాను తొలగిస్తాయి. దీనిని పేస్ట్‌గా తయారు చేసి ముఖంపై పూయడం వల్ల మొటిమల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది చర్మాన్ని క్లీన్ గా చేసి, ప్రకాశవంతంగా ఉంచుతుంది.

రోగనిరోధక శక్తి

జామ ఆకులలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ దాని టీ తాగడం వల్ల శరీరం వైరస్‌లు, బ్యాక్టీరియాతో పోరాడడంలో మెరుగ్గా ఉంటుంది. తరచుగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను సైతం తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad