Magnesium Foods: మెగ్నీషియం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఖనిజం. ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థ పనితీరుకు, రక్తపోటు నియంత్రణకు, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు, ఎముకల బలానికి అవసరం. కొన్నిసార్లు మెగ్నీషియం లోపిస్తే, గుండె వ్యాధులు వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత మెగ్నీషియం లోపాలకు దారితీస్తుంది. కావున ఈ లోటును తగ్గించడానికి మెగ్నీషియం అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా వివరంగా తెలుసుకుందాం.
గుమ్మడికాయ గింజలు: కేవలం 30 గ్రాముల గుమ్మడికాయ గింజలలో దాదాపు 150 mg మెగ్నీషియం ఉంటుంది. ఇది గుండె, ఎముకల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
బాదం: 28 గ్రాముల బాదంలో దాదాపు 76 mg మెగ్నీషియం ఉంటుంది. ఇది మెదడు, నరాల ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది.
పాలకూర: ఒక కప్పు పాలకూరలో దాదాపు 157 mg మెగ్నీషియం ఉంటుంది. ఇందులో ఐరన్ ఫైబర్ కూడా ఉంటాయి.
జీడిపప్పు: దాదాపు 28 గ్రాములు జీడిపప్పు 82 mg మెగ్నీషియంను అందిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.
డార్క్ చాక్లెట్: కోకో కంటెంట్ (70% లేదా అంతకంటే ఎక్కువ) కలిగిన డార్క్ చాక్లెట్‌లో ఒక్కో ముక్కలో దాదాపు 64 mg మెగ్నీషియం ఉంటుంది.
అవకాడో: మధ్య పరిమాణంలో ఉన్న అవకాడో 58 mg మెగ్నీషియంను అందిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులకు కూడా మంచి మూలం.
బ్రౌన్ రైస్: తృణధాన్యాలలో బ్రౌన్ రైస్ ఒక అద్భుతమైన ఎంపిక. ఒక కప్పు వండిన బ్రౌన్ రైస్‌లో 84 mg మెగ్నీషియం ఉంటుంది.
పెరుగు: పెరుగు ప్రోబయోటిక్ మాత్రమే కాదు, ఒక కప్పు పెరుగు 30-40 mg మెగ్నీషియంను కూడా అందిస్తుంది.
అరటిపండ్లు: అరటిపండు 32 mg మెగ్నీషియంను అందిస్తుంది. ఇది పొటాషియం మంచి మూలం కూడా.


