Saturday, November 15, 2025
Homeహెల్త్Stress Relief Drinks: ఒత్తిడి తగ్గాలంటే ఈ డ్రింక్స్ తాగండి..

Stress Relief Drinks: ఒత్తిడి తగ్గాలంటే ఈ డ్రింక్స్ తాగండి..

Stress: ఈరోజుల్లో చాలామందికి ఒత్తిడిగా ఫీలవుతున్నారు. ఇది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. దీనికి నేటి బిజీ లైఫ్, ఆఫీస్ వర్క్, కుటుంభం సమస్యలు వంటివి కారణాలు. అయితే, ఒత్తిడిని తగ్గించేందుకు మార్కెట్లో లభించే అనేక మందులను వాడుతుంటారు. ఇవి ఒత్తిడిని తగ్గించడం పక్కన పెడితే దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఒత్తిడిని తగ్గించడానికి సహజ నివారణలను ఆశ్రయించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించే కొన్ని డ్రింక్స్ ఉన్నాయి. ఇవి రుచికరమైనదే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు ఆ డ్రింక్స్ ఏంటి? వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

తులసి రసం

తులసి రసం సహజంగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడానికి మొదట తులసి ఆకులను క్లీన్ చేసి, వాటిని మెత్తగా రసం వచ్చేలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ రసంలో నిమ్మరసం, తేనె జోడించాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని చల్లటి నీటిలో కలిపి తాగాలి. తులసిలో ఉండే కొన్ని అంశాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పానీయం రిఫ్రెష్ చేయడమే కాకుండా మనస్సును ప్రశాంతపరుస్తుంది.

పుదీనా టీ

పుదీనా టీ అనేది తాజాదనాన్ని అందించి, ఒత్తిడిని తగ్గించే సూపర్ డ్రింక్. పుదీనా టీ తయారు చేయడానికి, మొదట పుదీనా ఆకులను నీటిలో మరిగించాలి. తర్వాత చక్కెర లేదా తేనె వేసి, కొద్దిసేపు పాటు మరిగించి త్రాగాలి. పుదీనాలో ఉండే మూలకాలు మానసిక అలసటను తొలగిస్తాయి. మనస్సును ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ పానీయం రుచికరంగా కూడా ఉంటుంది!

Also Read:Health: ఆహారం తిన్న వెంటనే పొరపాటున కూడా ఈ 4 పనులు అస్సలు చేయకండి..

పసుపు పాలు

పసుపు పాలు అనేది శరీరాన్ని, మనస్సును ప్రశాంతపరిచే సాంప్రదాయ నివారణ. దీనిని తయారు చేయడానికి, ఒక గ్లాసు పాలలో పసుపును వేసి మరిగించాలి. ఆపై దానికి చక్కెర లేదా తేనె జోడించే తాగాలి. పసుపులో ఉండే మూలకాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల హాయిగా నిద్ర పోవచ్చు. పైగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

 

ఉసిరి రసం

ఉసిరి రసంలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ డ్రింక్ తయారు చేయడానికి, తాజా ఉసిరిని రుబ్బి దాని రసాన్ని తీయాలి. తర్వాత దానిలో నీరు, కొంచెం చక్కెర జోడించి, మిక్స్ చేసి త్రాగాలి. ఉసిరిలో ఉండే మూలకాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.ఈ పానీయం రుచికరమైనది మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

 

కొబ్బరి నీరు

కొబ్బరి నీటిలో సహజ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతూ, మనస్సును ప్రశాంతపరుస్తుంది.
దీన్ని తయారు చేయడానికి తాజా కొబ్బరి నీళ్లను తీసి దానికి కొద్దిగా ఉప్పు వేసి త్రాగాలి. కొబ్బరి నీళ్లలో ఉండే అంశాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ పానీయాలన్నింటినీ తీసుకోవడం ద్వారా సులభంగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad