Blood Pressure Signs: నేటి బిజీ లైఫ్ లో చాలామంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం పూర్తిగా మానేశారు. చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. శారీరక శ్రమ, సరిగా నిద్ర లేకపోవడం వల్ల చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మనల్ని అనేక వ్యాధులపై నెట్టేస్తుంది. ఇందులో అధిక రక్తపోటు కూడా ఒకటి. అధిక రక్తపోటు సైలెంట్ కిల్లర్. దీని లక్షణాలు ఎక్కువగా బయటకు కనిపించకుండానే శరీరానికి నెమ్మదిగా హాని కలిగిస్తుంది. అయితే, కొన్ని సంకేతాలు శరీరం మనకు తెలియజేస్తూ ఉంటుంది. వాటిని గుర్తించగలిగితే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
తేలికపాటి తలనొప్పి
ఉదయం నిద్రలేచినప్పుడు తీవ్రమైన తలనొప్పిని అనిపిస్తే, దానిని సాధారణమైనదిగా భావించకూడదు. ఇది ఒకటి లేదా రెండుసార్లు వస్తే మందులు తీసుకోవచ్చు. కానీ, తరచుగా ఇలానే తలనొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమ. నిజానికి ఇది అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చు.
Also Read: Health Tips: రోజూ ఓ పచ్చి టమాట తింటే చాలు, బీపీ తో పాటు గుండె జబ్బులు కూడా పరార్!
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఊపిరి ఆడకపోవడమో లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది అధిక రక్తపోటును కూడా సూచిస్తుంది.
తల తిరగడం
అకస్మాత్తుగా లేచినప్పుడు తల తిరుగుతున్నట్లు అనిపిస్తే, మెదడుకు రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని అర్థం. ఇది పదేపదే జరిగితే, జాగ్రత్తగా ఉండాలి. తరచుగా తల తిరగడం అనిపిస్తే డాక్టర్ ను సంప్రదించాలి.
ముక్కు నుండి రక్తస్రావం
ఎటువంటి కారణం లేకుండా ముక్కు నుండి నిరంతరం రక్తస్రావం అవుతుంటే, అది అధిక రక్తపోటు వల్ల కావచ్చు. ఇది అప్పుడప్పుడే జరిగినా, నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
అలసట లేదా మతిమరుపు
అలసట, గందరగోళం, ఆకస్మిక మతిమరుపు వంటి సమస్యలు కూడా అధిక రక్తపోటు కు సంకేతం కావొచ్చు. మెదడుకు సరైన రక్తప్రసరణ జరగకపోతే ఇలా జరగుతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకోవడమూ దీని లక్షణమే కావచ్చు.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


