Vitamin C Fruits: చాలామంది విటమిన్ సి విషయానికి వస్తే, నారింజతో ఏదీ పోటీ పడలేదని భావిస్తారు. అలాంటి వారికోసమే ఈ వార్త! నారింజ పండ్లు విటమిన్ సికి అత్యుత్తమ పవర్‌హౌస్. అయినా కొన్ని పండ్లలో దీని కన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఈ పండ్లు అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా, శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నారింజ కంటే ఎక్కువ మొత్తంలో విటమిన్ సి కలిగి, శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
పైనాపిల్
ఫైనాపిల్ స్వీట్ స్వీట్, జ్యుసిగా ఉండటమే కాదు, ఇది విటమిన్ సి పవర్‌హౌస్ కూడా. ఒక కప్పు పైనాపిల్‌లో దాదాపు 79 mg విటమిన్ సి ఉంటుంది. ఇది నారింజ పండు కంటే అధికం. ఈ పండు జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది.
బొప్పాయి
బొప్పాయి పండు విటమిన్ సి అద్భుతమైన మూలం. కేవలం ఒక కప్పు బొప్పాయిలో 90 మి.గ్రా కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అంతేకాదు, కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
Also Read:Health: ఫిట్ గా ఉండాలా..?అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!
కివి
ఈ చిన్న గోధుమ, ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండు విటమిన్ సి నిధి. ఒక చిన్న కివిలో దాదాపు 64 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. ఇది నారింజ పండుకంటే ఎక్కువ. కివి తినడం జలుబును నివారించడంలో సహాయపడుతుంది. నిద్రను ప్రోత్సహిస్తుంది.
స్ట్రాబెర్రీ
ఎరుపు, జ్యుసి స్ట్రాబెర్రీలు చూడటానికి అందంగా కనిపించిన ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పవచ్చు. ఒక కప్పు స్ట్రాబెర్రీలో దాదాపు 85 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌తో పోరాడటానికి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
లిచీ
తీపి, జ్యుసిగా ఉండే ఈ వేసవి పండులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. కేవలం 100 గ్రాముల లిచీలో దాదాపు 72 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. లిచీ తినడం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాని మెరిసేలా చేస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


