Zero Calories Foods: నేటి కాలంలో ఊబకాయం అత్యంత సాధారణ సమస్యగా మారింది. దీనివల్ల బొడ్డు కొవ్వు అసభ్యకరంగా కనిపించడమే కాకుండా జీవక్రియ లోపాలు, మధుమేహం, అనేక గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఉబకాయాన్ని తగ్గించడానికి కొందరు వాకింగ్ చేస్తే, మరికొందరు జిమ్ కు వెళ్తారు. అయినప్పటికీ ఊబకాయం తగ్గదు. ఎందుకంటే బరువు తగ్గడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోతే గంటల తరబడి వ్యాయామం చేసిన ఫలితం ఉండదు. అయితే జీరో క్యాలరీలు ఉన్న ఆహారాలు తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చు. ఇందులో తక్కువ కేలరీలు కలిగి ఉన్నప్పటికీ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇటువంటి ఆహారాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇప్పుడు జీరో క్యాలరీలు ఉన్న ఆహారాల గురించి తెలుసుకుందాం
బ్రోకలీ
బ్రోకలీ బరువు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును ఇట్టే కరిగిస్తాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
దోసకాయ
బరువు తగ్గాలనుకునే వారికి దోసకాయ చాలా ప్రభావంతంగా ఉంటుంది. దోసకాయలు దాదాపు 96% నీరు ఉంటుంది. దీని తీసుకుంటే శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతేకాకుండా కడుపున శుభ్రంగా ఉంచుతుంది.
టమోటా
టమోటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ జీవ క్రియను పెంచడానికి పనిచేస్తుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు టమాటాను ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది.
నారింజ పండు
నారింజ పండులో ఉండే ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. దీని వినియోగం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు
క్యారెట్
పరువు తగ్గడానికి క్యారెట్ చాలా మంచిది. క్యారెట్ ఫైబర్ పవర్ హౌస్. దీనిని తినడం క్యాలరీల బర్నింగ్ ప్రక్రియ వేగవంతం చేస్తుంది. క్యారెట్ ను తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఇది ఆకలి నియంత్రించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
నిమ్మకాయ నీరు
నిమ్మకాయ నీరు శరీరాన్ని నిర్వీషికరణ చేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు త్రాగితే సులభంగా బరువు తగ్గుతారు.