Brain Foods: మెదడు మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగం. కావున దీని ఆరోగ్యాంగా ఉంచుకోవడం మన బాధ్యత. మన మెదడు ఆరోగ్యం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అయితే వయస్సు, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. కావున సరైన ఆహారాలు తీసుకుంటే మెదడును చురుకుగా ఉంచుతుంది. మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని సైతం తగ్గిస్తాయి. అందువల్ల మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి ఆహారంపై శ్రద్ధ చూపడం ముఖ్యం.సరైన ఆహారం తీసుకుంటే మెదడులో వాపు తగ్గుతుంది. ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు మెదడుకు మేలు చేసే ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వాల్నట్స్: వాల్నట్స్ మెదడు ఆరోగ్యానికి బెస్ట్ ఆప్షన్. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ E, పాలీఫెనాల్స్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఈ మూలకాలన్నీ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వాపును తగ్గిస్తాయి. కొత్త కణాలను తయారు చేయడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 2-3 వాల్నట్స్ తినడం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
పసుపు: అందరి ఇంట్లో కామన్ గా ఉండే ఆహార పదార్థం పసు. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కుర్కుమిన్ అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నాడీకణ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
బ్లూబెర్రీస్: బ్రెయిన్ బెర్రీస్ అని పిలువబడే బ్లూబెర్రీస్..ఆంథోసైనిన్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తాయి. బ్లూబెర్రీస్ క్రమం తప్పకుండా తినడం వల్ల న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. అభ్యాసం, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
ఆకుపచ్చ ఆకుకూరలు: పాలకూర, బ్రోకలీ, కాలే వంటి ఆకుకూరలు విటమిన్ కె, లుటీన్, ఫోలేట్, బీటా-కెరోటిన్ వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. మెదడు పనితీరుకు విటమిన్ కె చాలా ముఖ్యమైనది.
డార్క్ చాక్లెట్: 70% లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు, కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్లేవనాయిడ్లు జ్ఞాపకశక్తి, అభ్యాసానికి కారణమైన మెదడు భాగాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. తక్కువ మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం మానసిక స్థితిని మెరుగుపరచడానికి, అలసట నుండి ఉపశమనం పొందటానికి, మనస్సును అప్రమత్తంగా ఉంచడానికి సహాయపడుతుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


